నవంబర్ 11న రెడి‌మి నోట్ 5, ఫీచర్స్ ఇవే..?

|

రెడి‌మి నోట్ 4కు కొనసాగింపుగా మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతోన్న షావోమి లేటెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రెడి‌మి నోట్ 5 విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి రోజుకో న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుండటంతో ఫోన్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.

 
These Xiaomi Redmi Note 5 renders look pretty gorgeous

తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ చైనా సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAAలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పలు ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది. ముఖ్యంగా రెడి‌మి నోట్ 5 ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా

సెటప్‌తో వస్తోందన్న విషయంలో వాస్తవం లేదన్నది తేలిపోయింది. టీనా లిస్టింగ్‌లో పొందపరిచిన వివరాల ప్రకారం రెడి‌మి నోట్ 5 ఫోన్ సింగిల్ రేర్ కెమెరా సెన్సార్‌తో రాబోతోంది. ఇదే విషయాన్ని గిజ్‌మోచైనా కూడా స్పష్టం చేసింది.

బీజిల్-లెస్ డిజైన్..?

బీజిల్-లెస్ డిజైన్..?

రెడి‌మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ బీజిల్-లెస్ డిజైన్‌తో వచ్చే అవకాశముందని పలువురు రెండర్స్ పాయింట్ అవుట్ చేస్తున్నారు. 18:9 కారక నిష్పత్తితో కూడిన 5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2160 x 1440 పిక్సల్స్)ను, ఈ ఫోన్ క్యారీ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన ఎంఐ మిక్స్ 2 తరహాలోనే రెడి‌మి నోట్ 5 కూడా గుండ్రటి కార్నర్స్‌తో పాటు స్లిమ్ బీజిల్స్‌తో కనిపించే అవకాశం ఉంది.

రెండు వేరియంట్‌లలో ఫోన్ లభ్యం..?

రెండు వేరియంట్‌లలో ఫోన్ లభ్యం..?

టీనా లిస్టింగ్స్ ప్రకారం రెడి‌మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అందులో మొదటి వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు వేరియంట్స్ క్వాల్కమ్ 630 SoC పై రన్ అవుతాయట!

షార్ప్ నుంచి Sharp Aquos R Compact స్మార్ట్‌ఫోన్షార్ప్ నుంచి Sharp Aquos R Compact స్మార్ట్‌ఫోన్

 శక్తివంతమైన బ్యాటరీతో..?
 

శక్తివంతమైన బ్యాటరీతో..?

రెడ్‌మి నోట్ లైనప్ నుంచి షావోమీ లాంచ్ చేసే ప్రతి మోడల్‌లో బ్యాటరీ బ్యాకప్ హైలైట్‌గా నిలుస్తూ వచ్చింది.

దీంతో రెడి‌మి నోట్ 5 కూడా అదే ట్రెండ్‌ను రిపీట్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో సర్క్యలేట్ అవుతోన్న పలు రిపోర్ట్స్ ప్రకారం రెడి‌మి నోట్ 5 శక్తివంతమైన 4000mAh బ్యాటరీతో రాబోతోంది.

నవంబర్ 11న చైనా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం..?

నవంబర్ 11న చైనా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం..?

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న మల్టిపుల్ రిపోర్ట్స్ ప్రకారం రెడి‌మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 11న చైనా మార్కెట్లో లాంచ్ కాబోతోంది. అదే రోజున ఆ దేశంలో సింగిల్స్ డేను జరుపుకోనున్నారు.

ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి..?

ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి..?

రెడి‌మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర చైనా మార్కెట్లో 999 yuan (మన కరెన్సీలో రూ. 10,000)ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో టాప్ వేరియంట్ ధర 1299 yuan (మన కరెన్సీలో రూ.13,000)ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Source

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Redmi Note 5 renders have been leaked online showing the smartphone’s attractive design and looks.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X