ఐప్యాడ్ 2తో పోలిస్తే 'న్యూ ఐప్యాడ్' బరువెక్కువే..!

Posted By: Staff

ఐప్యాడ్ 2తో పోలిస్తే  'న్యూ ఐప్యాడ్' బరువెక్కువే..!

 

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ నిన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఆపిల్ కొత్త జనరేషన్ ఐప్యాడ్ 'న్యూ ఐప్యాడ్' గతంలో విడుదల చేసిన ఐప్యాడ్ 2తో పోలిస్తే ఎక్కువ బరువుని కలిగి ఉండడంతో పాటు పవర్ పుల్ బ్యాటరీని అందిస్తుంది. పెద్ద బ్యాటరీతో పాటు 10 గంటల పాటు బ్యాటరీ బ్యాక్ అప్‌ని  అందిస్తుంది. 'న్యూ ఐప్యాడ్'లో క్యాడ్ కోర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం వల్ల స్క్రీన్ రిజల్యూషన్‌కి ఎక్కువ  పవర్‌ని తీసుకుంటున్నందున ఇందులో పవర్ పుల్ బ్యాటరీని నిక్షప్తం చేయడం జరిగింది.

ఐప్యాడ్ 2తో పోలిస్తే  'న్యూ ఐప్యాడ్' బరువెక్కువే..!

ఆపిల్ చైర్మన్ టిమ్ కుక్ నిన్న శాన్ ప్రాన్సికోలో ప్రత్యేక మీడియా ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా 'న్యూ ఐప్యాడ్' ని మార్చి 7వ తారీఖున విడుదల చేశారు. న్యూ ఐప్యాడ్ ప్రత్యేకతలను పరిశీలిస్తే 9.4 mm లేదా 0.37 ఇంచ్‌లు మందాన్ని కలిగి ఉంది. ఇక ఐప్యాడ్ 2 మందాన్ని పరిశీలిస్తే కేవలం 8.8 mm లేదా 0.34 ఇంచ్‌లు. న్యూ ఐప్యాడ్ Wi-Fi మోడల్స్ అవ్వడంతో బరువు కూడా 1.33 పౌండ్స్ నుండి 1.44 పౌండ్స్‌కు పెరిగింది. సెల్యులర్ డేటాని యాక్సెస్ చేసుకునేందుకు గాను వీటిల్లో మోడమ్స్‌ కూడా ఉన్నాయి. మార్చి 16 నుండి  మార్కెట్లోకి ఆపిన్ 'న్యూ ఐప్యాడ్' అందుబాటులోకి రానున్నాయి.

ఐపిల్ న్యూ ఐప్యాడ్ లో రెటీనా డిస్ ప్లే ప్రత్యేకం. దీని డిస్ ప్లే రిజల్యూషన్ 2048 x 1536 పిక్సల్స్. క్వాడ్ కోర్ గ్రాఫిక్స్‌ని కలిగి ఉండడంతో పాటు A5X ఛిప్‌ని నిక్షప్తం చేశారు. 'న్యూ ఐప్యాడ్' టాబ్లెట్‌లో 5 MP iSight కెమెరాతో పాటు హై క్వాలిటీ ఇమేజిలను తీయగలిదే సత్తా ఉంది. వీడియోలను ఐతే 1080p HD ఫార్మెట్లో రికార్డ్ చేస్తుంది. ఇంకా 'న్యూ ఐప్యాడ్' ప్రత్యేకతలు  ఏమిటంటే ఇందులో ఎల్‌టిఈ ఫెసిలిటీని కలిగి ఉంది. దీనితో పాటు ఆపిల్ కొత్త ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 5.1ని ఇందులో నిక్షిప్తం చేశారు. ఆపిల్ కొత్తగా రూపొందించిన 'న్యూ ఐప్యాడ్' మార్కెట్లో రెండు మోడల్స్‌లో లభ్యమవుతుంది అది ఒకటి Wi-Fi రెండవది Wi-Fi + 4G.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot