2014.. ఇంటర్నెట్ సంచలనాలు

|

ఇంటర్నెట్ చరిత్రలో 2014కు ప్రత్యేక గుర్తింపే ఉంది. ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ మొదలుకుని యాపిల్ ఐఫోన్ 6 ఆవిష్కరణ వరకు, ఎమ్‌హెచ్370 విమానం అదృశ్యం మొదలుకుని పీకే సినిమా వివాదం వరకు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. 2014కు గాను ఇంటర్నెట్‌లో ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకున్న పలు ఆసక్తికర సంఘటనల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

నిజంగా ఇది చాలా అద్భుతం.. ఇంటర్నెట్ మనుషులు జీవితాలనే మార్చేసింది. 45 సంవత్సరాల క్రితం అక్టోబర్ 29, 1969న 22.30 నిమిషాలకు రెండు కంప్యూటర్ల మధ్య మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేయటం జరిగింది. వివరాల్లోకి వెళితే...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్, $19 బిలియన్‌లను చెల్లించి వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. టెక్నీలజీ చరిత్రలోనే ఇదో పెద్ద డీల్

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014లో యాపిల్ తన కొత్త వర్షన్ ఐఫోన్‌6ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో ప్రత్యేకమైన చర్చ సాగింది.

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ‘ద బిగ్ బిలియన్ డే’ పేరుతో ఆన్‌లైన్ షాపింగ్ మేళాను నిర్వహించింది. నెటిజనులు అత్యధికంగా ఈ షాపింగ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు.  

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

ఇస్రో మంగళయాన్ మార్స్ పై కాలు మోపింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి ఇంటర్నెట్‌లో ప్రపంచమంగా చర్చించుకుంది.

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ప్రవాసభారతీయ సభలో మోదీ ప్రసంగించిన తీరు ఇంటర్నెట్ ప్రపంచాన్ని మంత్రముగ్థులను చేసేసింది.

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

ఎల్లెన్ డేజనెర్స్ ఆస్కార్ సెల్ఫీ ఇంటర్నెట్‌లో ప్రత్యేకమైన ఆదరణ లభించింది.

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

సూపర్ స్టార్ రజనీ‌కాంత్ మే 9, 2014ను ట్విట్టర్‌లో జాయిన్ అయ్యారు. ఇంటర్నెట్‌లో ఈ వార్త పెద్ద సంచలనమే అయ్యింది. 

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

ఈ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరించింది. ఒకరి తరువాత ఒకరు.. ఒకరితో పోటీపడి మరొకరు గడ్డ కట్టించేంత చల్లగా ఉన్న బకెట్ నీటిని తమ నెత్తిన కుమ్మరించుకుని ఆ ఆసక్తికర సన్నివేశాలను యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థపాకులు బిల్ గేట్స్ మొదలుకుని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బెర్గ్ ఎంతో మంది సెలబ్రెటీలు ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొని తమ సేవాతత్పురతను చాటుతున్నారు. ఓ మంచి పనికోసం వీరంతా గడ్డ కట్టించే చలి నీటి బకెట్‌ను తమ తలల పై కుమ్మరించుకుంటున్నారు. ఏఎస్ఎల్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఈ ఆలోచన సోషల్ మీడియాలో బంపర్ హిట్టయ్యింది.

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

అమీర్‌ఖాన్‌ ప్రధాన పాత్రధారిగా రాజ్‌కుమార్‌ హిరాణీ రూపొందించిన 'పీకే’ అనేక వివాదాలకు దారీ తీసింది. ఇంటర్నెట్‌లో  ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చలు జరుగుతన్నాయి.

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

హాలీవుడ్ హాస్య నటుడు రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్య ఇంటర్నెట్ ప్రపంపచంలో కలకలం రేపింది. ఈయన మృతి పై సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో  అనేక చర్చలే నడిచాయి.

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని పెషావర్ సైనిక పాఠశాలలోకి చొరబడి 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని పొట్టన బెట్టుకున్న సంఘటన గురించి ఇంటర్నెట్‌‌లో  ప్రపంచమంతా చర్చించుకుంది.

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

బౌన్సర్ తగిలి కన్నుమూసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌కు క్రికెట్ ప్రపంచు ఘన నివాళులర్పించింది. సోషల్ మీడియాలో హ్యూస్‌ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వ్యక్తమయ్యాయి.

 

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రజధాని బీజింగ్ కు బయలుదేరిన ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైన ఘటన ఇంటర్నెట్ లో పెను సంచలనమే రేపింది. ఈ విమానం ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాకపోవటం ఓ మిస్టరీ

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అమెరికాకు చెందిన ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ తల నరికి, ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. ఇంటర్నెట్ లో ఈ విడియో పెద్ద దుమారమే రేపింది.

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

2014.. ఇంటర్నెట్ సంచలనాలు

ప్రపంచాన్నే వణికిస్తోన్న ప్రాణాంతక వైరస్ ఎబోలా. ఇప్పటిదాకా ఈ వైరస్ బారిన పడి వేలాది మంది సామాన్యులు మృత్యువాత పడ్డారు. వారికి వైద్య చికిత్స చేసిన వైద్యులకు సైతం ఈ వైరస్ సోకి ప్రాణాలను బలితీసుకుంది.2014లో ఒక్కసారిగా అలజడి రేపిన ఈ ప్రాణాంతక వైరస్ గురించి ఇంటర్నెట్‌లో అనేక కథనాలు వెలువడ్డాయి.

లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యూసీఎల్ఏ)లో విద్యార్థి ప్రోగ్రామర్‌గా ఉన్న చార్లీ క్లైన్ ARPANET ( ఆడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్‌వర్క్) ద్వారా ప్రొఫెసర్ లియోనార్డ్ క్లెయి న్రాక్ పర్యవేక్షణలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని ఎస్‌డిఎస్ సిగ్మా 7 హోస్ట్ కంప్యూటర్ నుంచి స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లో ఉన్న మరో ప్రోగ్రామర్‌కు చెందిన ఎస్ఆర్ఐ ఎస్‌డిఎస్ 940 హోస్ట్ కంప్యూటర్‌కు మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేసారు. రెండు కంప్యూటర్ల మధ్య ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపేందుకు ఇంటర్నెట్‌ను మొదటి సారిగా వినియోగించిన సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 29ని అంతర్జాతీయ ఇంటర్నెట్ డేగా ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగతా ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న అంతర్జాతీయ అంతర్జాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇంటర్నెట్ పై పరిశోధనలు జరుగుతున్న రోజుల్లో ఇంటర్నెట్, ARPANETగా పిలవబడేది.

Best Mobiles in India

English summary
Things That Broke The Internet In 2014. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X