Amazon, Flipkart saleలో AC,టీవీలను కొంటున్నారా!!! ఇవి గుర్తుంచుకోండి...  

|

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ ఈ వారంలో పండుగ వాతావరణం మొదలుకానున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 సేల్ అక్టోబర్ 16 అర్ధరాత్రి ప్రైమ్ యూజర్ల కోసం మరియు అక్టోబర్ 17 నుండి అందరికి మొదలవుతుంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2020 అమ్మకాలు అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో అనేక రకాల ఉత్పత్తుల మీద ఆకర్షణీయమైన ధరల తగ్గింపులతో పాటుగా డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ సమయంలో టీవీలు లేదా AC వంటి పెద్ద పెద్ద ఉపకరణాలను కొనాలని ఆలోచిస్తుంటే కనుక కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తనిఖీ చేయడం ముఖ్యం. డిస్కౌంట్ ఎక్కువగా లభిస్తున్నప్పటికి ఎల్లప్పుడూ సరైన ఎంపికలను ఎంచుకోవడం ఉత్తమం. టీవీలు మరియు ఎసి లను కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అమ్మకాలలో టీవీలను ఎంచుకోవడం
 

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అమ్మకాలలో టీవీలను ఎంచుకోవడం

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ లలో జరగబోయే అమ్మకాలలో ఏదైనా 32-అంగుళాల ఎల్‌ఈడీ టీవీని కొనుగోలు చేయాలని చూస్తుంటే కనుక దానిని సురక్షితంగా చూడటానికి మీ యొక్క ఇంటిలో టీవీకి మీకు కనీసం 4 అడుగుల దూరం అవసరం ఉంటుంది. అలాగే 40-అంగుళాల మరియు 48-అంగుళాల మధ్య గల పరిమాణాలలో టీవీలను కొనుగోలు చేస్తే కనుక వీక్షణ కోసం కనీసం 7 అడుగుల దూరం ఉండవలసి ఉంటుంది. చివరిగా 55-అంగుళాలు లేదా 65-అంగుళాల LED టీవీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీ గదిలో వీక్షణ కోసం కనీసం 9 అడుగుల దూరం ఉండాలని నిర్ధారించుకోండి.

Also Read:itel నుండి మూడు కొత్త TV సిరీస్ లు లాంచ్ ! ధర రూ.8,999 తో మొదలు.

టీవీల కొనుగోలుకు HD రెడీ మోడల్స్ ఎంచుకోవడం

టీవీల కొనుగోలుకు HD రెడీ మోడల్స్ ఎంచుకోవడం

టీవీలను కొనుగోలు చేయదలచిన వారు సిటీలలో చిన్న చిన్న గదులలో అద్దెకు ఉండే వారు ఫుల్ HD 1080p గల టీవీని ఎంచుకోవడం ఉత్తమంగా ఉంటుంది. అలాగే 720p HD రెడీ మోడల్స్ సెట్-టాప్ బాక్సులపై ఎక్కువగా ఆధారపడేవారికి ఇవి మంచి ఎంపికగా ఉంటాయి. ఇవి సినిమాలు లేదా గేమ్ లను అద్భుతమైన అనుభవంతో చూడడం కోసం 1080p-HD రిజల్యూషన్ అనేది ఎంతగానో మెరుగ్గా ఉంటుంది.

స్మార్ట్ టీవీలలో కనెక్టివిటీ ఎంపికలను కనుగొనడం

స్మార్ట్ టీవీలలో కనెక్టివిటీ ఎంపికలను కనుగొనడం

స్మార్ట్ టీవీలను LED రెసొలుషన్ తో కొనుగోలు చేయదలచిన వారు టీవీలలో హెచ్‌డిఎమ్‌ఐ, యుఎస్‌బి పోర్ట్‌లు, 3.5mm ఆడియో జాక్ మరియు బ్లూటూత్‌తో పాటు ఇతర AV పోర్ట్‌ల వంటి కనెక్టివిటీ పోర్ట్‌లు ఉన్నాయో లేవో నిర్ధారించుకోండి. ప్రస్తుతం కొన్ని టీవీలు USB పోర్టులను అందివ్వడం లేదు. USB పోర్ట్ లేకపోతే కనుక పెన్ డ్రైవ్ ద్వారా మీకు నచ్చిన ఏవైనా సినిమాలను చూడడానికి వీలుకాదు.

ఆన్‌లైన్ ఫెస్టివల్ లో అధిక నాణ్యత స్పీకర్లు గల టీవీలను ఎంచుకోవడం
 

ఆన్‌లైన్ ఫెస్టివల్ లో అధిక నాణ్యత స్పీకర్లు గల టీవీలను ఎంచుకోవడం

ప్రస్తుత సమయంలో అన్ని రకాల బ్రాండ్లు తమ టీవీలను బడ్జెట్ ధరలో కూడా అందిస్తున్నాయి. బడ్జెట్ ధరలో టీవీలను కొనుగోలు చేయాలనుకునే వారు టీవీలు సగటు స్పీకర్లతో వస్తున్నాయో లేవో నిర్దారించుకోండి. డిస్ప్లై నాణ్యత మీకు నచ్చినప్పటికీ చాలా సందర్భాలలో ఆడియో వినియోగదారులను నిరాశపరుస్తుంది. పెద్ద సైజు డిస్ప్లై టీవీలతో పాటు సౌండ్ బార్‌ను పొందడం లేదా కనీసం మంచి 2.1 ఛానల్ స్పీకర్ కోసం పెట్టుబడి పెట్టడం తప్పుగా ఉండకపోవచ్చు. కానీ బడ్జెట్ ధరలోని టీవీలలో 20W నుంచి 60W స్పీకర్లను గల టీవీలను ఎంచుకోవడం ఉత్తమం.

ఆన్‌లైన్ ఫెస్టివల్ షాపింగ్ లో AC కొనుగోలులో గుర్తుంచుకోవలసిన విషయాలు

ఆన్‌లైన్ ఫెస్టివల్ షాపింగ్ లో AC కొనుగోలులో గుర్తుంచుకోవలసిన విషయాలు

ఆధునిక మరియు పెద్ద పెద్ద గృహాలలో స్ప్లిట్ ఎసి మోడళ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. విండో ఎసి మోడల్స్ వంటివి చిన్న చిన్న గృహాలలో తక్కువ శీతలీకరణ సామర్థ్యం కలిగి ఉండి వస్తుంది. విండోస్ ఎసి మోడల్స్ తక్కువ ఖర్చుతో లభిస్తాయి. అంతేకాకుండా తక్కువ సర్వీసింగ్ ఛార్జిలను కూడా ఆకర్షిస్తాయి. మీరు అద్దె గదిలో ఉంటె కనుక విండో ఎసిని ఎంచుకోవడమే ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఇన్‌స్టాల్ చేయడం లేదా విడదీయడం చాలా సులభంగా ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Things to Remember for Buying AC, TVs on Flipkart and Amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X