మీకు తెలియకుండా గూగుల్ ఫోటో చేసే పనులు

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే అందులో అనేక రకాలైన యాప్స్ ఉంటాయి. అలాగే గూగుల్ కి సంబంధించినవి కూడా చాలానే ఉంటాయి. వాటిలో గూగుల్ ఫోటోస్ ఒకటి. ఇది మీ ఫోటోలను ఎప్పటికప్పుడు తనలో దాచుకుంటుంది. అంటే మీరు తీసిన ఏ ఫోటోఅయినా ఆ లైబ్రరీలోకి వెళుతుంది. అయితే గూగుల్ ఫోటోస్ అది ఒక్కటే చేస్తుందా లేక మరైమైనా పనులు చేస్తుందా అనే డౌట్లు చాలామందికి రావచ్చు. అయితే గూగుల్ ఫోటోస్ ఏం పనులు చేస్తుందో ఓ సారి చూద్దాం.

Read more: మొబైల్‌నుంచి సినిమాలు స్పీడ్‌గా డౌన్‌లోడ్ అయ్యే వెబ్‌సైట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఫోటోలు మాత్రమే కాకుండా ప్రదేశాలు అలాగే కార్లు ఇంకా అనేక రకాలైన అంశాలు ఈ సెర్చ్ బటన్ లో మీరు వెతకొచ్చు.

2

మీరు గూగుల్ ఫోటో యాప్ లోకి వెళ్లినప్పుడు మీరు పేర్లు వారీగా వెతికే అవకాశం ఉంటుంది. అయితే మీరు ముందు పేర్లు టైప్ చేసి పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే లేబుల్ ని రిమూవ్ చేయడం కాని యాడ్ చేయడం కాని చేయవచ్చు.

3

బ్యాక్ అప్ కు సంబంధించి మీ ఫోటోలను ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. వైఫైతో మాత్రమే బ్యాక్ అప్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటే నెట్ ఆదా అవుతుంది.

4

ఫోటోస్ అప్ లోడ్ అయిన తరువాత అవి వద్దనుకుంటే డిలీట్ చేయవచ్చు. అలాగే క్వాలిటీని కూడా సెట్ చేసుకోవచ్చు.

5

మీరు ఇతర యాప్స్ నుండి ఫోటోలను నేరుగా గూగుల్ ఫోటో యాప్స్ లోకి పంపుకునే అవకాశం ఉంది. కెమెరా ఫోటోలు మాత్రమే కాకుండా వాట్సప్ ఇన్ స్టాగ్రామ్ లాంటి యాప్స్ నుండి వచ్చిన ఫోటోలు కూడా బ్యాకప్ చేయవచ్చు.సైడ్ లో ఉన్న బటన్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్సన్స్ వస్తాయి. వాటిని ఫాలో అయితే సరిపోతుంది.

6

మీ గూగుల్ ఫోటోలో మీకు నచ్చిన విధంగా ఫోటో వ్యూలను సెలక్ట్ చేసుకోవచ్చు. రోజు, నెల, అలాగే సంవత్సరం ఇలాంటి ఆప్సన్స్ అందులో ఉంటాయి.

7

దీనిలో మల్టిపుల్ ఆప్సన్ కూడా ఉంది. ఏదైనా ఫోటోను లాంగ్ ప్రెస్ చేస్తే అందులో మీకు ఫోటోసెలక్షన్ ఆప్సన్ వస్తుంది. అదే వెబ్ లో అయితే షిప్ట్ కీస్ తో మీరు ఈ ఆప్సన్ ను సెలక్ట్ చేసుకోవచ్చు.

8

మీరు మీ ఫోటోలను ఏమైనా పొరపాటున డిలీట్ చేస్తే అవి ట్రాష్ బటన్ లో ఉంటాయి. అలాగే మీరు పూర్తిగా వద్దనుకున్న ఫోటోలు కూడా అందులో నుంచి తొలగించుకోవచ్చు.

9

మీ ఫోటోలు టీవీలో చూసినట్లుగా చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు.

10

మీరు అన్ని ఫోటోలను ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి.

11

మీరు మీ ఫోటోలను గూగుల్ ఫోటోస్ నుండి నేరుగా డ్రైవ్ లోకి పంపించాలనుకుంటే అక్కడ పోల్డర్ క్రియేట్ చేసి పంపుకోవచ్చు. అందుకోసం సెట్టింగ్స్ లో కెళ్లి జనరల్ లో ఆప్సన్ సెలక్ట్ చేసుకోవాలి.

12

గూగుల్ డ్రైవ్ ఆన్ చేయడం వల్ల మీ ఫోటోలు అలాగే వీడియోలు మీకు ఎప్పటికప్పుడు కనిపిస్తుంటాయి. అలాగే మీరు డాక్యుమెంట్స్ , గూగుల్ షీట్స్ వాడుతున్నా కాని దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది.

13

మీ ఫోటోలను ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఈఆప్సన్ ద్వారా షేర్ చేయవచ్చు.

14

గూగుల్ ఫోటోలో మీరు నేరుగా ఫోటోను మీకు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేయవచ్చు.

15

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Things You May Not Have Known Google Photos Can Do
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot