Bsnl రూ.444, మార్కెట్లో బెస్ట్ ఆఫర్ ఇదే..

90 రోజుల పాటు రోజుకు 4జీబి డేటా..

|

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఇటీవల లాంచ్ చేసిన రూ.444 చౌకా ప్లాన్ మార్కెట్లో పెను సంచలనం రేపుతోంది. ఈ ప్లాన్ ఇతర టెల్కోలకు చుక్కులు చూపించేలా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఈ మధ్యకాలంలో లాంచ్ చేసిన బెస్ట్ డేటా సెంట్రిక్ ప్లాన్‌లలో చౌకా ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

 రోజుకు 4జీ డేటా...

రోజుకు 4జీ డేటా...

మార్కెట్లో ఇతర టెలికం ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్నఇతర డేటా సెంట్రిక్ ప్లాన్లను పరిశీలించినట్లయితే నెలకు రూ.350 నుంచి రూ.450 మధ్య చెల్లిస్తేగాని రోజుకు 1జీబి డేటా లభించేలా లేదు. అయితే, బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న చౌకా ప్లాన్ లో మాత్రం రూ.444 చెల్లించినట్లయితే రోజుకు 4జీబి 3జీ డేటా అందుబాటులో ఉంటుంది.

 ప్లాన్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు..?

ప్లాన్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు..?

రూ.444 చెల్లించి చౌకా ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఏకంగా 90 రోజుల పాటు ప్లాన్ బెనిఫిట్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది. అంటే 90 రోజుల పాటు రోజుకు 4జీబి చొప్పున 3జీ డేటాను పొందే వీలుంటుంది.

వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు..

వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు..

బీఎస్ఎన్ఎల్ రూ.444 చౌకా ప్లాన్‌లో ఎటువంటి వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. ఇది కేవలం డేటా సెంట్రిక్ ప్లాన్ మాత్రమే. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న STV 339, STV 395 ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకున్నట్లయితే డేటా అలానే వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ 30 అలానే 71 రోజుల వ్యాలిడిటీలతో అందుబాటులో ఉంటాయి.

మార్కెట్లో బెస్ట్ ప్లాన్ ఇదే..

మార్కెట్లో బెస్ట్ ప్లాన్ ఇదే..

ఇప్పటి వరకు టెలికం మార్కెట్లో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న రూ.333 ట్రిపుల్ ఏస్ ప్లాన్ బెస్ట్ ప్లాన్‌గా ఉండేది. తాజాగా ఆ స్థానాన్ని రూ.444 చౌకా ప్లాన్ ఆక్రమించేసింది.

Best Mobiles in India

English summary
Things You Need to Know About the BSNL Rs.444 Plan. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X