జియో యాప్స్‌తో ఇకపై వీటి అడ్రస్ గల్లంతేనా..?

Written By:

అసలు రిలయన్స్ జియో ఎలా పుట్టింది. ెవరి ఆలోచనల నుంచి పుట్టి అది ఏ స్థాయికి వెళ్లేందుకు కసరత్తులు చేస్తోంది. ఇది కష్టమర్లకు సేవలను అందిస్తోంది. లేక ఆపరేటర్ తో కలిసి వ్యాపారానికి వ్యూహాలు రచిస్తోంది.. ఇప్పటిదాకా ముఖేష్ అంబాని తన మనసులోని మాటను బయటపెట్టనేలేదు. రిలయన్స్ జియో ఎటువైపు అడుగులు వేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. ఓ స్మార్ట్ లుక్కేయండి.

బిగ్ ఆయిల్,బిగ్ డేటా..జియో ఇన్‌సైడ్ నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో చాట్

ఇక మీడియా వైపు చూస్తే టీవీ, వీడియో ఆన్ డిమాండ్, క్లౌడ్ ఆధార సర్వీసులు అందించే వీలుంది. అదే సమయంలో వెబ్ ఆధారిత సేవలు కూడా ఉంతాయి. మొదటిసారిగా వినియోగదారులకు అందించేది మాత్రం ఆండ్రాయిడ్, ఐఓఎస్ సెల్ ఫోన్ల వినియోగదారులకు జియో చాట్ అనే మెసేజింగ్ యాప్.

#2

వెంటనే మెసేజ్ పంపుకోవటం, ఉచిత ఎస్సెమ్మెస్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవి అమల్లోకి వస్తే ఇక జియోనే మొత్తం ఇండియా మార్కెట్ ని శాసిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

వాట్సప్, వియ్ చాట్, లైన్ మెసెంజర్ లాంటి

ప్రధానంగా 8 కోట్ల మంది వాడకందారులున్న వాట్సప్, వియ్ చాట్, లైన్ మెసెంజర్ లాంటి ఇతర మెసేజింగ్, కాలింగ్ యాప్స్ తో ప్రధానంగా పోటీ ఉంటుందన్నమాట. అవి జియో దెబ్బకు తలుపులు మూసుకోవాల్సిన పరిస్థితులు ఎంతో దూరంలో లేవని తెలుస్తోంది.

#4

సిటీ రీసెర్చ్ సంస్థ అంచనా ప్రకారం జియో చాట్ క్రమంగా వాయిస్, మెసేజింగ్, ఎంటర్టైన్మెంట్, ఈ-కామర్స్ ను కలిపి ఉమ్మడిగా ఒకే యాప్ గా మార్చి వాడకందారులకు సేవలందిస్తుందని తెలుస్తోంది.

జియో ప్లే.

అది టీవీ చానల్స్ అందించే యాప్. లైవ్ టీవీ ఇవ్వటమే కాకుండా జియో ప్లే ఆటోమేటిక్ గా కార్యక్రమాలన్నిటినీ ఏడురోజులపాటు క్లౌడ్ మీద నిల్వ ఉంచుతుంది. అంటే, ఇది ఓవర్ ద టాప్ (ఒటిటి) కే పరిమితమవుతుందా, ఇళ్లలో టీవీలకూ విస్తరిస్తుందా అన్నదే అసలైన ప్రశ్న.

#6

అయితే, చాలా మంది మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నది మాత్రం డిటిహెచ్ ఆపరేటర్లకూ, ఎమ్మెస్వోలకూ దీటుగా సేవలందిస్తూ కేబుల్ ఆపరేటర్లద్వారా ఇంటింటికీ టీవీలకు ప్రసారాలు అందించే అవకాశమున్నదని. అదే సమయంలో మొబైల్ ప్లాట్ ఫామ్ మీద కూడా అందజేస్తుందని భావిస్తున్నారు.

జియో ఆన్ డిమాండ్

వాయిస్ ఆన్ డిమాండ్ తరహాలో ఉంటుంది. దీన్నే జియో ఆన్ డిమాండ్ పేరుతోను, జియో బీట్స్ పేరిట మ్యూజిక్ స్ట్రీమింగ్, జియో ఫ్రెండ్స్ పేరుతో ఫ్రెండ్స్ లొకేటర్ యాప్ భవిష్యత్ లో విస్తరించేందుకు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెట్టారని తెలుస్తోంది.

జియో న్యూస్

జియో న్యూస్ పేరుతో ఆన్ లైన్ న్యూస్ పేపర్ సర్వీస్, జియో మాగ్ పేరుతో ఆన్ లైన్ మాగజైన్ సర్వీస్దవచ్చునని తెలుస్తోంది. రోగి వైద్య చరిత్రను క్లౌడ్ సహాయంతో నిల్వచేసే ప్రక్రియ, విద్యాబోధన లాంటివి కూడా ప్రధానంగా జియో లో ఉండవచ్చునని తెలుస్తోంది.

#9

జియో న్యూస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అందరూ దాని వెంటే పరుగులు పెట్టే అవకాశం ఉంది. మిగతా న్యూస్ యాప్స్ పాతాళానికి వెళ్లిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write things you should know about Reliance Jio apps
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot