గూగుల్ లో ఇవి వెతికితే మీరు జైలుకే....
గూగుల్ ఇది పెద్దగా పరిచయం అక్కరలేని పేరు ఎందుకంటే దీని గురించి తెలియని వారంటు ఉండరు.ఎవరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ రోజుల్లో సెర్చ్ చేసేది ఒక్క గూగుల్ లో మాత్రమే.
గూగుల్ ఇది పెద్దగా పరిచయం అక్కరలేని పేరు ఎందుకంటే దీని గురించి తెలియని వారంటు ఉండరు.ఎవరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ రోజుల్లో సెర్చ్ చేసేది ఒక్క గూగుల్ లో మాత్రమే. అయితే గూగుల్ లో ఎవరు సెర్చ్ చేయకూడని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఒక వేళా అవి సెర్చ్ చేసి చూస్తే మీ ప్రమయం లేకుండానే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఈ శీర్షిక లో భాగంగా గూగుల్ లో సెర్చ్ చేయకూడని విషయాలు మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి....

ఆరోగ్యపరమైన విషయాలు....
గూగుల్ లో మీ symptoms చూసి ఎట్టి పరిస్థుతులలో మీ ఆరోగ్యం పై ఒక అంచన కి రావొద్దు.కోట్లాది వెబ్ సైట్స్ మీరు ఏది టైపు చేసిన సమాధానం ఇస్తాయి.వాటిలో నూటికి తొంబై శాతం డాక్టర్లు maintain చేయరు.అందులో జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వాటి జోలికి వెళ్లి మీకు ఉన్న symptoms బట్టి రోగాన్ని నిర్దారణ చేసుకోని హైరానా పడితే మాత్రం చాల ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. లేని పోనివి ఊహించుకొని మంచి ఆరోగ్యాన్ని పడు చేసుకోవద్దని గూగుల్ ఈ మధ్య ఒక కాన్ఫరెన్స్ లో ప్రకటించింది.

బాంబులు తయారు చేయాడం ఎలా....
అమెరికా లో ఉన్న ఇండియా లో ఉన్న కూడా బాంబులు తయారు చేయడం ఎలా ఒక సారి ఎక్కువ మందిని చంపడం ఎలా అని సెర్చ్ చేస్తే మాత్రం అంతే సంగతులు. ఎందుకంటే ఆటోమేటిక్ గా మీ IP అడ్రస్ సెక్యూరిటీ సర్వర్స్ లో సేవ్ అయిపోతుంది. ఈ మాత్రం అనుమానం వచ్చిన IP అడ్రస్ లాంటి ధారాన్నీ పట్టుకొని ఆ దారం వెతుకుంటూ మీ ఇంటి లోపాలకి వచ్చి మీ సిస్టం ముందు నిలబడతారు పోలీసులు.

మాదకద్రవ్యాల గురించి....
మాదకద్రవ్యాలు (డ్రగ్స్) కంపోసిషన్స్ తయారు చేయడం పై కూడా కొంతమంది ఆన్ లైన్ లో వెతుకుతూ ఉంటారు. ఇది కూడా పోలీసులకు పట్టించేదే. ఇలాంటి క్రిమినల్ యాక్టీవిటీ కీ సంబందిచి గూగ్లె లో సెర్చ్ చేయకపోవడమే చాలా మంచిది. ఒక వేళ చేస్తే మాత్రం రిస్క్ భరించాల్సి వస్తుంది.

Pregnant woman .....
కడుపులో ఉన్నదీ ఆడ మగ అని Pregnant woman వెతుకుతూ ఉంటారు. కానీ అవన్నీ చాలా వరకు సైంటిఫిక్ ప్రూఫ్ లేని కంటెంట్. కాకపోతే జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతకవచ్చు. అయితే ఏమి తినాలి ఎం తినకూడదు అని నెట్ లో చూసి ఫాలో అవ్వకూడదు అంటున్నారు డాక్టర్లు. ప్రతి Pregnant woman కి తను ఉన్న పరిస్థితి బట్టి ఎవరు ఏమి తినాలి అనేది డాక్టర్లు చెబుతారు. టెస్ట్ లు చేసాక ఎవరు ఏ లోపం తో బాధ పడ్తున్నారో చూసి డైట్ ను సజెస్ట్ చేస్తారు కాబట్టి ఇది కూడా గూగుల్ లో సెర్చ్ చేయకపోవడం తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది.

చిన్న పిల్లల మందుల గురించి....
చిన్న పిల్లల మందుల గురించి కూడా కొంత మంది వెతుకుతూ ఉంటారు.అందులో ఏ మెడిసిన్ కు ఎంత డోస్ వేయాలని కూడా గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ మందుల్లో చాలా రకాలు ఉంటాయి.వాటిలో ఏ మందు ఉంది ఎంత వేయాలి అనేది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు . కాబట్టి చిన్న పిల్లల ఆరోగ్యం తో ఆటలాడి ఎక్సట్రా డోస్ వేసి వారి ఆరోగ్యాన్ని పాడు చేయవద్దు అంటున్నారు డాక్టర్లు .

కాన్సర్ symptoms ....
కాన్సర్ symptoms గురించి చాలా మంది వెతుకుతున్నారు అని ఆన్ లైన్ సర్వే లో తేలింది.సాధారణంగా తల తిప్పడం నీరసంగా ఉండటం ఎక్కడో ఒక్క చోట మొప్పి వస్తే అది ఏంటో తెలుసుకోవాలని భయపడుతూ సెర్చ్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారంట.ఇంకా అలాగే కాన్సర్ లో ఎన్నో రకాలు ఉన్నాయి అవి ఏంటో టెస్టులు చేస్తే తప్ప డాక్టర్లకే అర్థం కాదు మరి గూగుల్ కి ఎం తెలుస్తుందో ఒకసారి మీరే ఆలోచించాలి. కాబట్టి ఆరోగ్యం విషయం లో ఏదైనా సరే గూగుల్ చేయవద్దు అనేది డాక్టర్ల మాట.


Click it and Unblock the Notifications








