బీఅలర్ట్ : ఈ విషయాలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో షేర్ చేయవద్దు!

Posted By:

 బీఅలర్ట్ : ఈ విషయాలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో షేర్ చేయవద్దు!
శక్తివంతమైన సమాచార మాద్యమాల్లో ఒకటైన ‘సోషల్ నెట్‌వర్కింగ్ ' కమ్యూనికేషన్ రూపురేఖలనే మార్చేసింది. ఫేస్‌బుక్.. ట్విట్టర్ వంటి ప్రముఖ సామాజిక బంధాల వెబ్‌సైట్‌లు విస్తృత సమాచార వ్యవస్థను కలిగి ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

సోషల్ మీడియా మరింతగా విస్తరిస్తున్న నేపధ్యంలో అనే దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లైంగిక వేధింపులు... జాతి విమర్శలు... ఆర్ధిక మోసాలు... సమాచార దోపడి ఇలా అనేక రకాలైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా ఎక్కవవుతున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ యూజర్‌లను జాగృతం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయకూడిన పలు కీలక అంశాలను మీతో పంచుకోవటం జరుగుతోంది.

1.) మీరు పార్టీలో మత్తు పానీయాలు సేవించినట్లయితే సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచురించవద్దు.

2.) ఇతరులతో సరస సల్లాపాలు సాగించిన ఫోటోలను సోషల్ మీడియా సైట్‌‌లలో పోస్ట్ చేయకూడదదు.

3.) అక్రమ సంబంధాల గురించి వెల్లడించరాదు.

4.) పై అధికారి పై ఫిర్యాదులను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయవద్దు.

5.) మీ కుటుంబ వ్యవహారాలను సామాజిక సంబంధాల సైట్‌లలో పెట్టొద్దు.

6.) మిత్రులతో గొడవకు సంబంధించిన సమచారాన్ని షేర్ చేయవద్దు.

7.) మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను సోషల్ మీడియాలో ఉంచవద్దు.

8.) మీ చిన్నారుల వీడియోలు లేదా ఫోటోలను ప్రచురించరాదు.

9.) మీ వ్యక్తగత సమాచారన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దు.

10.) జాతి, మతం ఇంకా ఇతర రాజకీయాలకు సంబంధించి విమర్శలు చేయకూడదు.

11.) మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయవద్దు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot