Home
News

కోడింగ్‌లో కొత్త ట్రెండ్ సృష్టిస్తోన్న చిచ్చర పిడుగు!

టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదు. అది మనందరిలోనూ ఉంటుంది. దానిని గుర్తించి జీవిత లక్ష్యంగా మలచుకున్న వారే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు.

టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదు. అది మనందరిలోనూ ఉంటుంది. దానిని గుర్తించి జీవిత లక్ష్యంగా మలచుకున్న వారే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. సరిగ్గా అటువంటి రియల్ స్టోరీ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.

కోడర్‌బన్నీజ్ సంస్థకు సీఈఓగా..

కోడర్‌బన్నీజ్ సంస్థకు సీఈఓగా..

సిలికాన్ వ్యాలీకి చెందిన సమీరా మెహతా అనే 10 సంవత్సరాల బాలిక ప్రోగ్రామింగ్ విభాగంలో తన సత్తాను చాటుతోంది. కోడర్‌బన్నీజ్ అనే సంస్థకు ఫౌండర్ ఇంకా సీఈఓగా వ్యవహరిస్తోన్న ఈ చిచ్చెర పిడుగు అనేక సదస్సులో పాల్గొని జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంది.

 

 

6వ ఏట నుంచే కోడింగ్‌...

6వ ఏట నుంచే కోడింగ్‌...

6వ ఏట నుంచే కోడింగ్‌ పట్ల ఆకర్షితురాలైన మెహతా తన 8వ ఏట కోడర్‌బన్నీజ్ పేరుతో ఓ గేమ్‌ను క్రియేట్ చేసింది. ప్రత్యేకించి చిన్నారుల కోసం డిజైన్ చేయబడిన ఈ గేమ్ ద్వారా కోడింగ్ ఏ విధంగా చేయవచ్చే అనేది తెలుసుకునే వీలుంటుంది. ఈ బోర్డ్ గేమ్ క్రియేట్ చేసిన తరువాత 2016లో నిర్వహించిన థింక్ ట్యాంక్ లెర్నింగ్ పిచ్‌ఫెస్ట్‌లో మెహతా పాల్గొన్నారు. ఈ కాంటెస్టులో ఆమె టాలెంట్‌కు గాను రెండవ బహుమతి క్రింద 2500 డాలర్లు లభించాయి.

 

 

కార్టూన్ నెట్‌వర్క్ స్పూర్తిధాయక వీడియోలో లీడ్ రోల్..

కార్టూన్ నెట్‌వర్క్ స్పూర్తిధాయక వీడియోలో లీడ్ రోల్..

ఇదే సమయంలో కార్టూన్ నెట్‌వర్క్ మార్కెటర్స్‌ను కూడా సమీరా మెహతా ప్రొఫైల్ ఆకర్షించగలిగింది. ఆ తరువాత వారు చిత్రీకరించిన ఓ స్పూర్తిధాయక వీడియోలో మోహతా లీడ్ రోల్ పోషించి పబ్లిక్ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. అనేక న్యూస్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేసిన మోహతా అమెజాన్‌లో తన గేమ్‌ను విక్రయించటం ప్రారంభించింది. తన తండ్రి రాకేష్ మెహతా (ఇంటెల్ ఇంజినీర్) సహకారంతో ఒక్క ఏడాదిలో 1000 గేమ్ బాక్సులను విక్రయించగలిగానని, వీటి విలువ 35,000 డాలర్లు అని మెహతా బిజినెస్ ఇన్‌సైడర్‌కు తెలిపింది. ఇదే సమయంలో తన గేమ్ ద్వారా స్కూల్ ఏజ్ పిల్లలకు కోడింగ్ వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నట్లు మెహతా తెలిపింది.

 

 

CoderMind పేరుతో రెండువ గేమ్‌..

CoderMind పేరుతో రెండువ గేమ్‌..

Yes, 1 Billion Kids Can Code పేరుతో ఓ ప్రచార కార్యక్రమానికి ప్రారంభించిన మెహతా తన గేమ్‌ను అన్ని పాఠశాలల్లో ప్రమోట్ చేస్తోంది. ఈ స్కూల్ ఇయర్ స్టార్ట్ అయిన నాటి ఇప్పటి వరకు 106 స్కూళ్లలో ఈ గేమ్‌ను టీచ్ చేస్తున్నారని మెహతా తెలిపింది. తన మొదటి గేమ్ కోడర్‌బన్నీజ్ గొప్ప విజయాన్ని అందుకున్న నేపథ్యంలో CoderMind పేరుతో రెండువ గేమ్‌ను మోహతా లాంచ్ చేసింది.

దిగ్గజం కంపెనీలు సైతం ఔరా అంటున్నాయి...

దిగ్గజం కంపెనీలు సైతం ఔరా అంటున్నాయి...

ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బోర్డ్ గేమ్ అని మెహతా చెబుతోంది. ఈ గేమ్ ను తన చిన్న తమ్ముడు ఆదిత్ సహాయంతో బిల్ట్ చేసినట్లు మెహతా తెలిపింది. సమీరా మెహతాలోని నైపుణ్యాలను చూసి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజం కంపెనీలు సైతం ఔరా అంటున్నాయి. ఈ చిన్నారి భవిష్యత్ లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Best Mobiles in India

English summary
This 10-year-old coder is already so successful she's already caught the attention of Google and Microsoft.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X