ఆరేళ్లకే రూ.70 కోట్ల సంపాదన ఆర్జిస్తున్న పిల్లవాడి గురించి తెలుసా ?

ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి గురించి కాదు కాదు అతని సంపాదన చూస్తే అందరూ తెల్లమొహం వేస్తారు..ఎందుకంటారా..ఇతని సంపాదన ఏడాదికి రూ. 70 కోట్లు.

|

ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి గురించి.. కాదు కాదు అతని సంపాదన చూస్తే అందరూ తెల్లమొహం వేస్తారు..ఎందుకంటారా..ఇతని సంపాదన ఏడాదికి రూ. 70 కోట్లు. అమెరికాలో నివసిస్తున్నఈ బుడతడి దెబ్బ ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. తాను ఆడుకునే బొమ్మలతో ఇతను సంపాదిస్తున్న సంపాదన చూసి అందరూ నోరెళ్లబెడతున్నారంటే అతని స్టామినా ఏంటో తెలుసుకోవచ్చు...పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఆధార్ లింకింగ్‌పై కేంద్రం తీపికబురు, 3 నెలలు గడువు పొడిగింపుఆధార్ లింకింగ్‌పై కేంద్రం తీపికబురు, 3 నెలలు గడువు పొడిగింపు

బొమ్మలతో రివ్యూలు ఇవ్వడం ద్వారా..

బొమ్మలతో రివ్యూలు ఇవ్వడం ద్వారా..

ఈ పిల్లాడి పేరు రియాన్. వయస్సు ఆరేళ్లు..అందరూ ఆడుకునే బొమ్మలతో రివ్యూలు ఇవ్వడం ద్వారా యూట్యూబ్ వార్తల్లోకెక్కారు. ఆ ఆటవస్తువుల గురించి ఎవ్వరూ ఇవ్వలేని విధంగా రివ్యూలు ఇచ్చేస్తుంటాడు. అదే అతనికి కోట్ల రూపాయలను తెచ్చిపెట్టింది.

ToysRivew పేరిట యూట్యూబ్ లో ఓ ఛానల్..

ToysRivew పేరిట యూట్యూబ్ లో ఓ ఛానల్..

పిల్లాడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ToysRivew పేరిట యూట్యూబ్ లో ఓ ఛానల్ పెట్టి అతని రివ్యూలను పోస్ట్ చేయడంతో ఈ బుడ్డోడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ ఛానల్ ఇప్పుడు అత్యధిక రెవిన్యూ వెబ్‌సైట్లలో ఒకటిగా నిలిచి రికార్డులను సృష్టిస్తోంది.

2015లో స్టార్ట్..

2015లో స్టార్ట్..

2015లో స్టార్ట్ అయిన ఈ ఛానల్ కు ఇప్పుడు కోటిమంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. గతేడాది ఈ ఛానల్ మీద మనోడు రూ. 70 కోట్లకు పైగా సంపాదనను ఆర్జించాడు.

అగ్రస్థానంలో..

అగ్రస్థానంలో..

2017లో యూ ట్యూబ్ ద్వారా అత్యధికంగా ఆర్జించిన వారి జాబితాలో రేయాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం రాయల్టీ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న యూ ట్యూబ్ ఛానెళ్లలో ఇది 8వ స్థానంలో ఉంది.

డబ్బుల కోసం..

డబ్బుల కోసం..

అయితే డబ్బుల కోసం తల్లిదండ్రులు తమ పిల్లల చేత బలవంతంగా ఇలాంటివి చేయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం పిల్లలను తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నట్లు ప్రముఖ యూ ట్యూబర్ పేవ్‌డీపే అంటున్నారు.

అతని తల్లి మాత్రం..

అతని తల్లి మాత్రం..

అయితే అతని తల్లి మాత్రం రేయాన్‌ను ఒత్తడి చేయడం లేదు. అతని చదువుకు ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు. సెలవు రోజునే వీడియోలను రికార్డు చేస్తున్నామని చెబుతోంది.

ఈ ఛానెల్‌పై తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన..

ఈ ఛానెల్‌పై తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన..

కాగా ఈ ఛానెల్‌పై తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఇది ఎంతో బాగుందంటే, తమ పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఈ పిల్లాడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Best Mobiles in India

English summary
This 6-Year-Old Earns Rs 70 Crore A Year Just Playing With His Toys On YouTube More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X