500 మిల్లియన్ల టార్గెట్ : కొత్త వ్యూహంతో ఎయిర్‌‍టెల్ దూకుడు

By Gizbot Bureau
|

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన జియో దెబ్బకు అన్ని కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతి ఎయిర్‌‍టెల్ కూడా కొత్తగా ముందుకు దూసుకువస్తోంది. కొత్త కొత్త టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షించుకునేందుకు రెడీ అయింది. జియోకి సవాల్ విసురుతూ నెమ్మదిగా అత్యంత తక్కువ ధరలో అధిక డేటాను అందించే విధంగా ప్రణాళికలు రచిస్తోంది.

This Airtel plan may help Reliance Jio achieve its 500 million targets

అయితే ఈ ప్రయోజనాలను కేవలం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందివ్వనుంది. ఫ్రీ పెయిడ్ కస్టమర్ల కన్నా పోస్ట్ పెయిట్ కస్టమర్ల వైపే ఎక్కువగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా కంపెనీ 500 మిల్లియన్ కస్టమర్లను టార్గెట్ గా పెట్టుకుంది.

 ఎయిర్‌టెల్ దృష్టి ప్రధానంగా ARPUపైనే

ఎయిర్‌టెల్ దృష్టి ప్రధానంగా ARPUపైనే

తమకు ఉన్న కస్టమర్లలో అత్యధికంగా స్పెండ్ చేసేవారికి, పోస్ట్‌పేయిడ్ కస్టమర్లకు ప్రోత్సాహకాలు, ఇతర సేవలు అందించడం ద్వారా జియోను ధీటుగా ఎదుర్కోవాలని భావిస్తోంది. జియో, వొడాఫోన్ ఐడియా వలె కాకుండా ఎయిర్‌టెల్ ARPUపై దృష్టి సారించింది. అలాగే, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ పేరుతో కస్టమర్లకు ఆకట్టుకుంది. ఆర్పుపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇది చార్ట్‌లో 129వ స్థానంలో ఉంది.

ఎయిర్ టెల్ బ్లాక్ ప్లాన్‌తో ముందుకు

ఎయిర్ టెల్ బ్లాక్ ప్లాన్‌తో ముందుకు

ఇప్పుడు మరో ప్లాన్‌తో ఎయిర్‌టెల్ ముందుకు వస్తోంది. హై-పేయింగ్ కస్టమర్లకు మరో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ముందుకు వస్తోంది. ఈ మేరకు ఎకనమిక్ టైమ్స్‌లో వార్త వచ్చింది. Airtel Black పేరుతో దీనిని తీసుకు వస్తోంది. ఈ ప్లాన్ ద్వారా అధికంగా చెల్లించే కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రయోజనాలు అందించడంపై ఎయిర్‌టెల్ దృష్టి సారించింది. అదే సమయంలో, ఈ బెనిఫిట్స్ చూపించి ఇప్పటికే తక్కువ ఖర్చు చేస్తున్న కస్టమర్ల ద్వారా ఆర్పును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ప్రయోజనాలు ఇవే

ప్రయోజనాలు ఇవే

ఎయిర్ టెల్ బ్లాక్ ద్వారా వివిధ రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. బెట్టర్ కంటెంట్ ఆఫరింగ్స్, కన్స్యూమర్ బ్రాండ్స్ పైన డిస్కౌంట్లు, ఇంటర్నేషనల్ రోమింగ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వివిధ రకాల యాప్స్, స్ట్రీమింగ్ సేవలు వంటి బెనిఫిట్స్ అందిస్తారు. ఎయిర్ టెల్ బ్లాక్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలోనే భాగం చేస్తున్నారు. రూ.999 అంతకంటే ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధంగా కస్టమర్లకు ఈ ప్రయోజనాలు ఉంటాయి.

 రెవెన్యూ మోడల్ ఇదే

రెవెన్యూ మోడల్ ఇదే

ఖర్చు చేయని కస్టమర్లను దూరం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇలాంటి ఆఫర్ల ద్వారా ఎక్కువ రెవెన్యూ రాబట్టడానికి సిద్ధపడినట్లుగా కనిపిస్తోంది. రిలయన్స్ జియో లో-వ్యాల్యూ ప్లాన్స్ ఎలాగూ తక్కువ ఖర్చు చేసే కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ వినూత్న ఎయిర్ టెల్ బ్లాక్ తీసుకు రానుంది. ఎయిర్ టెల్ బ్లాక్ ద్వారా.. పోస్ట్ పెయిడ్ వ్యాపారం పెంచుకోవడం, ఎయిర్ టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలోని తక్కువ వ్యాల్యూ కలిగిన కస్టమర్లను బ్లాక్‌లోకి అప్ గ్రేడ్ చేయడం, విలువైన కస్టమర్లను ఎయిర్‌టెల్‌ కస్టమర్లుగా ఉంచడమే లక్ష్యం.

జియోకి అడ్డుకట్ట

జియోకి అడ్డుకట్ట

ఎయిర్ టెల్ రెండు కేటగిరీల్లో కస్టమర్లను కలిగి ఉంది. ఎయిర్ టెల్ గోల్డ్ కింద రూ.499 లోపు కస్టమర్లు, ప్లాటినం కింద రూ.499 కంటే ఎక్కువ చెల్లించేవారు ఉన్నారు. ఇప్పుడు ఎయిర్ టెల్ బ్లాక్ ద్వారా అధిక ప్రయోజనాలతో ఎక్కువ మందిని ఆకర్షించాలని చూస్తోంది. ఇది కస్టమర్లకు ప్రయోజనంతో పాటు కంపెనీకి కూడా ఎక్కువ రెవెన్యూ తెచ్చి పెడుతుంది. ఎక్కువ చెల్లించే కస్టమర్లను నిలుపుకునే ఉద్దేశ్యంలో ఎయిర్ టెల్ ఉంది. వీరిని జియో వంటి ప్రత్యర్థి ఆపరేటర్లకు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తోంది.

Best Mobiles in India

English summary
This Airtel plan may help Reliance Jio achieve its 500 million targets

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X