ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే వెంటనే బిల్స్ చెక్ చేసుకోండి
మొబైల్ వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులు, సేవలను అందించడమే లక్ష్యంగా 2016లో స్థాపించిన ఇంటర్నెట్ సంస్థ స్నాప్‌ట్యూబ్. భారత్ ప్రధాన మార్కెట్‌గా స్థాపించిన 18నెలల కాలంలో సంతృప్తికర సేవలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచ మార్కెట్‌లో ప్రధాన స్థానాన్ని దక్కించుకొంది. ఈ యాప్ ను అనతి కాలంలోనే దాదాపు 40 మిల్లియన్ల మంది తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. ఏ యాప్ కి సాధ్యం కాని రీతిలో ఈ యాప్ డౌన్లోడ్ జరిగింది. అయితే దీని వెనుక కంపెనీ పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ Secure-D వెల్లడించింది. అయితే ఈ యాప్ ద్వారా అనధికార లావాదేవీలు జరిగాయని సెక్యూరిటీ సంస్థ గుర్తించింది.

ఆరు నెలల్లో ఎలా సాధ్యం
సెక్యూరిటీ సంస్థ రిపోర్ట్ ప్రకారం 70 మిల్లియన్ల లావాదేవీలను కేవలం 4.4 మిల్లియన్ యునిక్యూ డివైస్ ల నుంచి జరిపిందని అది కేవలం 6నెలల్లోనే ఈ లావాదేవీలు జరిగాయని తెలిపింది. దీని వెనుక పెద్ద కథ ఉందని ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని చెబుతోంది.

91 మిల్లియన్ డాలర్ల ప్రీమియం ఛార్జీలు ఎలా ?
దాదాపు 91 మిల్లియన్ డాలర్ల అన్ వాంటెడ్ ప్రీమియం ఛార్జీలను యూజర్ల నుంచి రాబట్టేందుకు ప్రయత్నించిందని దీనిని మేము నిరోధించగలిగామని సెక్యూర్ డీ తెలిపింది. ఈ యూజర్ల అంతా బ్రెజిల్,శ్రీలంక, మలేషియా, సౌత్ ఆప్రికా కు చెందినవారిగా గుర్తించింది వీరంతా ఈ యాప్ భారీన పడ్డారని ఇప్పటికీ దీని మాయలోనే ఉన్నారని తెలిపింది.

క్లిక్ ద్వారానే ఆదాయం
ఈ యాప్ డౌన్లోడ్స్ అండ్ క్లిక్ ద్వారానే కంపెనీ కోట్ల రూపాయలను ఆర్జిస్తోందని ఇదంతా హ్యాండ్ సెట్ల మీద కనిపించకుండానే జరుగుతోందని Upstream's CEO, Guy Krief చెబుతున్నారు. ఈ వీడియో యాప్ స్క్రీన్ మీద లేకున్నా బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తూ ఉందని తద్వారా వారికి రెవిన్యూ మార్గం అవుతోందని కంపెనీ చెబుతోంది. కాబట్టి ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే వెంటనే మీ బిల్స్ చెక్ చేసుకోవాలని సూచించింది.

యాప్ ఉపయోగం ఇదే
ప్రపంచవ్యాప్తంగా 100పైగా దేశాల్లో స్నాప్‌ట్యూబ్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం. 40మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, ప్రతి రోజు 10మిలియన్లకు పైగా వినియోగదారులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం పది భారతీయ భాషల్లో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్,ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లతో ప్రధాన వెబ్‌సైట్లు వేటి నుంచైనా వీడియోలు, సంగీతాన్ని సులువుగా, త్వరగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోలను ఇంటర్నెట్ అవసరం లేకుండా వీక్షించవచ్చు.


Click it and Unblock the Notifications








