గూగుల్ మనల్ని ఏప్రిల్ పూల్ ఎలా చేసిందో తెలిస్తే షాకవుతారు

టెక్ జాయింట్ గూగుల్ ఈ ఏడాది రెండు రకాల ఫీచర్లతో మనల్ని ఏప్రిల్ ఫూల్ చేసింది. అవేంటో మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. గూగుల్ కూడా మనల్ని ఫూల్ చేస్తుందా అని నోరెళ్లబెడతారు. కంపెనీ ఈ మధ్య రిలీజ్ చేసి

|

టెక్ జాయింట్ గూగుల్ ఈ ఏడాది రెండు రకాల ఫీచర్లతో మనల్ని ఏప్రిల్ ఫూల్ చేసింది. అవేంటో మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. గూగుల్ కూడా మనల్ని ఫూల్ చేస్తుందా అని నోరెళ్లబెడతారు. కంపెనీ ఈ మధ్య రిలీజ్ చేసిన క్లాసిక్ ఆర్కేడ్ గేమ్ స్నేక్ యూజర్లను ఏప్రిల్ పూల్ చేయడానికే అని తెలుస్తోంది. ఈ గేమ్ గూగుల్ మ్యాప్ యాప్ ద్వారా ప్రవేశపెట్టింది. అయితే అది ఎలా సాధ్యమనే సందేహాలు కూడా రాకముందే మళ్లీ స్క్రీన్ క్లీనర్ ఫీచర్ అంటూ ఫైల్స్ గో యాప్ ద్వారా తీసుకువచ్చింది. కంపెనీ ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం మీద ఈ కొత్త ఫీచర్ అనౌన్స్ చేసింది.

 
గూగుల్ మనల్ని ఏప్రిల్ పూల్ ఎలా చేసిందో తెలిస్తే షాకవుతారు

ఈ ఫీచర్ మీ స్మార్ట్ ఫోన్ ని బయట నుంచి క్లీన్ చేస్తుందని, ఫోన్ మీద ఎటువంటి మరకలు పడినా వెంటనే వాటిని తొలగిస్తుందని గూగుల్ చెబుతోంది. అయితే ఇదంతా ఎలా సాధ్యమని ఏప్రిల్ పూ్ చేయడానికేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.

అసలేంటి ఈ ఫీచర్

అసలేంటి ఈ ఫీచర్

స్క్రీన్ క్లీనర్ అనే కొత్త ఫీచర్ గూగుల్ యాప్ ఫైల్స్ గో లో కనిపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ ఫోన్ బయట ఎటువంటి దుమ్ము, ధూళి, ఇతర మరకలు ఉన్నా వాటిని వెంటనే క్లీన్ చేస్తుందట. మీ ఫోన్ డిస్ ప్లే ఎప్పటికప్పుడు అత్యంత అందంగా కనిపించేలా ఈ ఫీచర్ తీర్చిదిద్దుతుందిని గూగుల్ చెబుతోంది.

వీడియో డెమో విడుదల

వీడియో డెమో విడుదల

దీనికి సంబంధించిన ఓ వీడియో డెమో ని కూడా గూగుల్ విడుదల చేసింది. ఫోన్ ని ఎలా క్లీన్ చేస్తుందో ఈ వీడియోలో వివరించారు. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందని అందరూ తలలు బద్దలుకొట్టుకోకండి.వీడియోలో పొందుపరిచి కంటెంట్ ప్రకారం smudge detector API ద్వారా గూగుల్ ఈ డస్ట్ ని పసిగట్టి దాన్ని క్లీన్ చేస్తుందట.

API
 

API

ఈ smudge detector API మన ఫోన్ మీద ఏమైనా మట్టిమరకలు పడినా లేకుంటే ఏమైనా దుమ్ము ధూళి ఉన్నా క్లీన్ చేస్తుందట. ఈ ఫీచర్లో అంతర్గతంగా పొందుపరిచిన మైక్రో మూమెంట్స్ ని వాడుకుంటూ ఫోన్ మొత్తాన్ని శుభ్రపరిచి నీట్ గా ఉంచుతుంది.

ఇందులో నిజమెంత

ఇందులో నిజమెంత

అయితే ఇందులో నిజమెంత అనేది చాలామందికి అర్థం కాని విషయం. ఇప్పటికే ఈ ఫీచర్ కోసం చాలామంది ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్నారు కూడా. వాస్తవానికి అంతర్గంతంగా ఉన్న ఈ ఫీచ్ ద్వారా బయట ఉన్న డస్ట్ ని క్లీన్ చేయడం ఎలా సాధ్యమని అందరూ అనుకుంటున్నారు. గూగుల్ దీని మీద ఇంకా క్లారిటీ ఇస్తే బాగుంటుంది కాబోలు.

 Files Go app

Files Go app

కంపెనీ ఈ యాప్ ని 2017లో పరిచయం చేసింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్ పైన ఉన్న డివైస్ లకు రన్ అవుతుంది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ పైళ్లను , ఫోల్డర్స్ ను క్రమపద్దతిలో ఆర్గనైజ్ చేస్తుంది. ఫోన్ ని క్లీన్ చేస్తూ పనికిరాని వాటిని తీసేయమని చెబుతూ ఉంటుంది.

Best Mobiles in India

English summary
This April Fool's day, Google is 'offering' to clean your smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X