రేపటి వాతావరణాన్ని సూచించే ‘టెంపీస్కోప్’
అతడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. పేరు కెన్ కవామోటో. వాస్తవ ప్రపంచానికి, డిజిటల్ ప్రపంచానికి మధ్య హద్దులను తొలగిస్తూ ఇతగాడు ఆవిష్కరించిన ‘టెంపోస్కోప్' ఆశ్చర్యకర రీతిలో అబ్బురపరుస్తోంది.

బాక్స్ తరహాలో ఉండే ఈ టెంపోస్కోప్ వాతావరణ సమాచారాన్ని రియల్ - టైమ్ అనుభూతులతో చూపిస్తుంది. అంటే, వర్షం పడుతున్న సమయంలో నీటి చుక్కలను డిస్‌ప్లే చేస్తూ, మేఘావృతంగా ఉన్న సమయంలో మేఘాలను డిస్‌ప్లే చేస్తుంది.

ఈ బాక్సును పీసీకి అనుసంధానించుకుని ఇంటర్నెట్ సౌకర్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులనైనా రియల్ టైమ్ అనుభూతులతో వీక్షించవచ్చు.
‘టెంపీస్కోప్’ పనితీరుకు సంబంధించి డెమో వీడియో


Click it and Unblock the Notifications








