బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి రెండు సరికొత్త వార్షిక ప్లాన్లు
దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని ఎదుర్కునేందుకు ప్రభుత్వ రంగం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ తో ముందుకు దూసుకొచ్చింది.
దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని ఎదుర్కునేందుకు ప్రభుత్వ రంగం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ తో ముందుకు దూసుకొచ్చింది. ఇప్పటికే ఎయిర్టెల్,వోడాఫోన్ లాంటి సంస్థలు జియోతో పోటీనెదుర్కుంటున్న తరుణంలో ప్రభుత్వ రంగ దిగ్గజం జియోకి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈ నేఫథ్యంలోనే రూ.1699,రూ. 2099 పేరిట రెండు ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1699 ప్లాన్....
ఈ రూ.1699 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 730 జీబీ డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్యాక్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు.

బీఎస్‌ఎన్‌ఎల్ vs జియో
జియో ఇటీవలే తన దీపావళి ఆఫర్ లో భాగంగా కొత్త ప్లాన్ ను ప్రారంభించింది. రూ. 1,699 ప్లాన్ రిలయన్స్ జియో రోజుకు 1.5 జిబి డేటాను మరియు 100 ఎస్ఎంఎస్ తో అపరిమిత కాల్స్ ను అందిస్తోంది. రిలయన్స్ జీయో 1,699 ప్లాన్ కింద మొత్తం 547GB డేటాను అందిస్తుంది అయితే బిఎస్ఎన్ఎల్ మొత్తం 730GB డేటాను అందిస్తుంది.

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2099 ప్లాన్....
ఈ రూ.2099 ప్లాన్ ద్వారా కస్టమర్లకు రోజుకి 4 జీబీ డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్యాక్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు.

ఈ రెండు ప్లాన్లు...
ఈ రెండు ప్లాన్లు అక్టోబర్ 29 నుండి బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి.

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.299 ప్లాన్....
బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల రూ.299 ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ ద్వారా నెలకు 31 జీబీ డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను కూడా ఈ ప్లాన్ కింద వినియోగదారులు పొందుతున్నారు.


Click it and Unblock the Notifications








