Home
News

చిన్న బగ్ గూగుల్ సీఈఓ పోస్టుకి ఎసరు పెట్టేలా చేసింది

By Gizbot Bureau

ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ CEOకి ఓ బగ్ ఏకంగా ఎసరు తెచ్చినంత పనిచేసింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ న్యూస్ చదవాల్సిందే. ఇటీవల పాపులర్ జాబ్ రీసోర్సర్, సోషల్ ప్లాట్ ఫాం LinkedInలో గూగుల్ జాబ్ ఓపెనింగ్స్‌కు సంబంధించి పోస్టులు దర్శనమిచ్చాయి.

This bug allowed everyone to apply for Google CEOs position

అందులో Google CEO పోస్టుకు కూడా అప్లయ్ చేసుకోండి అంటూ ఓ పోస్టు కనిపించింది. అది చూసిన జాబ్ సీకర్లంతా గూగుల్ సీఈఓ పోస్టుకు అప్లయ్ చేసుకునేందుకు పోటీపడ్డారు. దీంతో సైటు ఒక్కసారిగా స్థంభించినంత పనయింది. నిజానికి అక్కడ గూగుల్ సీఈఓ పోస్టుకు ఎలాంటి ఓపెనింగ్స్ లేవు.XX

ఇందుకు కారణం BUG

ఇందుకు కారణం BUG

అయితే ఇందుకు ప్రధాన కారణం Linkedin వెబ్ సైట్లో జాబ్ లిస్టింగ్ కంపెనీ పేజీల్లో ఓ BUG అని తేలింది. ఈ బగ్ కారణంగా ఎలాంటి అనుమతి లేకుండానే ఏదైనా పోస్టుకు అప్లయ్ చేసుకునేలా పోస్టులు కనిపించాయి.

 బగ్‌ను గుర్తించిన మిచెల్ రిజెండర్స్

బగ్‌ను గుర్తించిన మిచెల్ రిజెండర్స్

Next Web రిపోర్టు ప్రకారం.. నెదర్లాండ్స్ ఆధారిత రిక్రూటర్ మిచెల్ రిజెండర్స్ ఈ బగ్‌ను గుర్తించారు. వెంటనే మైక్రోసాఫ్ట్ సొంత ప్రొఫెషనల్ సోషల్ నెట్ వర్క్ Linkedinకు తెలియజేశారు. ఏదైనా కంపెనీ Linkedin బిజినెస్ పేజీల్లో సెర్చ్ చేసిన యూజర్లను Unofficial Job పోస్టింగ్ చేసేలా బగ్ అనుమతి ఇచ్చింది. అలా ఇది కూడా అనుమతి ఇచ్చిందని తెలిపారు.

 గూగుల్ సెర్చ్ పేజీలో కూడా

గూగుల్ సెర్చ్ పేజీలో కూడా

గూగుల్ సెర్చ్ పేజీలో కూడా సీఈఓ పోస్టు ఓపెనింగ్ ఉన్నట్టుగా పాప్ అప్ పోస్టు కనిపించింది. LinkedIn సహా ఇతర వెబ్ సైట్లలో కూడా జాబ్ లిస్టింగ్ పేజీ దర్శనమిచ్చింది. దీనిపై స్పందించిన లింకిడిన్ కంపెనీ ‘బగ్' ను ఫిక్స్ చేశామని, ఇప్పటి నుంచి ఎలాంటి సమస్యలు ఉండవని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ లోపే జరగాల్సింది జరిగిపోయింది.

జాబ్ పోస్ట్ లిస్టింగ్‌లో

జాబ్ పోస్ట్ లిస్టింగ్‌లో

ఈ సమస్య మా ఆన్‌లైన్ జాబ్స్ లో ఒక బగ్ కారణంగా తలెత్తింది. ఇది జాబ్ పోస్ట్ లిస్టింగ్‌లో యూజర్లను అనుమతించింది. ఇప్పుడు సమస్య పరిష్కరించాం. మోసపూరిత ఉద్యోగ పోస్టింగ్‌లు మా సేవా నిబంధనలు ఉల్లంఘిస్తాయి. అందుకే బగ్ సమస్య.. మా దృష్టికి రాగానే పరిష్కరించాం' అని కంపెనీ పేర్కొంది. ఫ్రీ జాబ్ పోస్టింగ్‌లకు సంబంధించి.. LinkedInలో ఉచిత జాబ్ పోస్టింగ్‌లు లేవు. అయినప్పటికీ, చిన్న , మధ్యతరహా వ్యాపారాలకు పరిమిత సంఖ్యలో ఉద్యోగాలను ఉచితంగా పోస్ట్ చేయడానికి అనుమతించేలా టెస్టింగ్ జరుగుతోందని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
This bug allowed everyone to apply for Google CEO's position
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X