గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్త యాప్స్ విభాగం “Made For India”

Posted By: BOMMU SIVANJANEYULU

ఇటీవల బెంగళూరులో నిర్వహించిన యాప్ ఎక్స్‌లెన్స్ సమ్మిట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ 'Made for India' పేరుతో సరికొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. భారతీయులకు అవసరమైన యాప్స్‌ను తయారు చేయటమే లక్ష్యంగా లాంచ్ కాబడిన ఈ ప్రోగ్రామ్ ద్వారా డెవలపర్స్‌కు తమ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశాన్ని గూగుల్ కల్పించింది.

గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్త యాప్స్ విభాగం  “Made For India”

ఇండియన్ డెవలపర్స్ కోసం రూపొందించబడిన ఈ ఇనీషియేటివ్‌లో భాగంగా ప్రత్యేకంగా కేటాయించబడిన సెక్షన్‌లో ఇండియన్ యాప్స్‌ను ప్రదర్శిస్తారు. ఇండియన్ డెవలపర్స్ డిజైన్ చేసిన హై-క్వాలిటీ యాప్స్‌కు ఈ సెక్షన్‌లో చోటు లభిస్తుంది. తమ యాప్‌ను మేడ్ ఫర్ ఇండియా సెక్షన్‌లో చూడాలనుకునే డెవలపర్స్ g.co/play/madeforindiaలోకి వెళ్లి సెల్ఫ్ నామినేషన్ ఫారమ్‌ను పూర్తి చేయవల్సి ఉంటుంది.

మేడ్ ఫర్ ఇండియా సెక్షన్‌కు ఎంపికయ్యే అప్లికేషన్‌లలో ఇన్నవేషన్‌తో పాటు మినిమైజిడ్ డేటా కన్‌సంప్షన్, ఆప్టిమైజిడ్ బ్యాటరీ కన్‌సంప్షన్, ఆప్టిమైజిడ్ ఫర్ ఇంటర్నెట్ కనెక్టువిటీ, యూజ్‌ఫుల్ ఆఫ్‌లైన్ స్టేట్, డివైజ్ కంపాటిబిలిటీ ఫర్ యాప్స్, యాప్ సైజ్ రిడక్షన్, లోకలైజేషన్ సపోర్ట్ వంటి ఫ్యాక్టర్స్ ఉండాలి.

ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో గూగుల్ యాప్ మార్కెట్ పై మరింత దృష్టిసారిస్తోంది. ఇటీవల వెల్లడైన ఓ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 70శాతానికి పైగా ఇంటర్నెట్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకోగలుగుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ఇటీవల వెల్లడైన మరో విశ్లేషణ ప్రకారం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించుకునే వారి సంఖ్య అమెరికాతో పోలిస్తే ఇండియాలోనే ఎక్కువగా ఉందట.

గూగుల్ యాప్ ఎక్స్‌లెన్స్ సమ్మిట్‌లో భాగంగా గూగుల్ ప్లే బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ పూర్ణిమా కోచీకార్ భారత్‌లో ప్లే స్టోర్ యాప్స్ వినియోగానికి సంబంధించి ఆసక్తికర వివరాలను రివీల్ చేసారు. ఈమె తెలిపిన వివరాల ప్రకారం భారత్‌లో ప్రతినెలా 100 కోట్లకు పైగా గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ ఇన్‌స్టాల్ కాబడుతున్నాయి. యాప్స్ వినియోగం విషయంలో ప్రతిఏటా 150శాతానికి పైగా వృద్ధిరేటు నమోదు అవుతున్నట్లు పూర్ణిమా కోచీకార్ తెలిపారు. ఈ సమ్మిట్‌లో భాగంగా 700 మంది యాప్ అలానే గేమ్ డెవలపర్స్‌ను ఒకే వేదికపైకి చేర్చిన గూగుల్ బెస్ట్ క్వాలిటీ యాప్స్‌ను అభివృద్ధి చేసే క్రమంలో వారి నుంచి విలువైన సూచనలను తీసుకుంది.

ఇకపై హార్ట్‌తోనే మీ ఫోన్ లాక్ చేయవచ్చు, తీయవచ్చు

ప్రపంచంలో అతి పెద్ద యాప్ స్టోర్ ఏదైనా ఉందంటే అది గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ అభివృద్థి చేసిన ఈ యాప్ స్టోర్‌లో లక్షల సంఖ్యలో యాప్స్, గేమ్స్, బుక్స్, మూవీస్ కొలువుతీరి ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు తమతమ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్‌లలోకి లాగినై వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో తలెత్తే సమస్యలు విసుగుపుట్టిస్తుంటాయి. వాస్తవానికి ఇవి పరిష్కరించలేనంత పెద్ద సమస్యలేమి కావు.

డీఎఫ్-బీపీఏ-09.. ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో వస్తుంటుంది. ఈ సమస్య ఇక మీదట మీకు ఎదురైనట్లయితే డివైస్ సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ సర్వీసెస్ ఫ్రేమ్ వర్క్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేసినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది.

కోడ్ 194...ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా మీరు ప్లే స్టోర్ నుంచి గేమ్ లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించినపుడు సంభవిస్తుంటుంది. ఈ సమస్య మీకు ఎదురైనపుడు గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌కు సంబంధించిన క్యాచీ డేటాను క్లియర్ చేసినట్లయతే సమస్య పరిష్కారమవుతుంది. క్యాచీని క్లియర్ చేసే క్రమంలో డివైస్ సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేస్తే సరి.

కోడ్ 495... ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా ప్లే స్టోర్ నుంచి యాప్ లేదా గేమ్‌ను డౌన్‌లోడ్ లేదా అప్‌‍డేట్ చేస్తున్న సమయంలో వస్తుంటుంది. ఈ ఎర్రర్‌ను ఫిక్స్ చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్ ప్లే స్టోర్ డేటాను డిలీట్ చేస్తే సరి. సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేయండి.

English summary
Google Play store has a new category for apps which is just for indian users.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot