మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ప్రమాదంలో ఉన్నారు

మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా?, అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. కొత్తగా పుట్టుకొచ్చిన ఆన్‌లైన్ స్కామ్ ఒకటి టెక్నాలజీ నిపుణులను సైతం బురిడీ కొట్టిస్తోంది.

 మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ప్రమాదంలో ఉన్నారు

Read More : రికార్డులు బద్దలు కొడుతున్న నోకియా 6

ఈ స్కామ్‌ను తొలత వర్డ్ ప్రెస్ సెక్యూరిటీ సర్వీస్ సీఈఓ మార్క్ మౌండర్ గుర్తించారు. ఈయన చెబుతోన్న దాన్ని ప్రకారం ఈ కొత్తరకం కుంభకోణం ఎక్స్‌పీరియన్సుడ్ టెక్నికల్ యూజర్లను సైతం కన్విన్స్ చేసేస్తుందట. యూజర్‌కు సంబంధించి జీమెయిల్‌తో పాటు ఇతర సర్వీసులను కూడా ఈ స్కామ్ ముసుగులో అటాకర్లు హ్యాక్ చేయగలుగుతున్నారట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ అటాక్ నేపథ్యం ఎలా ఉంటుందంటే..

ముందుగా మీ జీమెయిల్ అకౌంట్‌కు, మీకు తెలిసిన జీమెయిల్ యూజర్ నుంచి ఓ మెయిల్ అందుతుంది. తెలిసిన వారి నుంచి వచ్చిన మెయిల్ కాబట్టి, వెంటనే మీరు ఆ మెయిల్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆకట్టుకునే సబ్జెక్ట్ లైన్ కనిపిస్తుంది. మొత్తం చూడలన్న కుతాహలంతో సంబంధిత అటాచ్‌మెంట్ లేదా ఇమేజ్ పై క్లిక్ చేస్తారు.

ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.

మీరు ఓపెన్ చేసే అటాచ్ మెంట్ వేరొక ట్యాబ్‌లో ఓపెన్ అయి మరొకసారి జీమెయిల్ అకౌంట్ లోకి sign-in అవ్వమని అడుగుతుంది. ఈ పేజీలో గనుక మీరు sign-in అయినట్లయితే హ్యాకర్లు ఉచ్చులో ఇరుక్కున్నట్లే.

ఈ బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీగా ధర తగ్గించారు

హ్యాకర్లకు మీ అకౌంట్‌లోకి యాక్సెస్ లభించినట్లయితే

ఒక్కసారి హ్యాకర్లకు మీ అకౌంట్‌లోకి యాక్సెస్ లభించినట్లయితే మీ జీమెయిల్ అకౌంట్‌లోని ఈమెయిల్స్ అన్ని వాళ్ల చేతుల్లోకి వెళ్లటమే కాకుండా మీ పేరుతో వాళ్లకు వైరస్ అటాచ్‌మెంట్స్ దాగి ఉన్న మెయిల్స్ పడతాయి. వాళ్లు కూడా మీలాగే ఈ మెయిల్‌ను ఓపెన్ చేసే ప్రయత్నం చేసినట్లయితే వాళ్ల, వాళ్ల జీమెయిల్స్ అకౌంట్స్ కూడా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.

ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే..?

ఈ ప్రమాదం నుంచి మీరు మీ జీమెయిల్ అకౌంట్‌ను కాపాడుకోవాలంటే, మీ అకౌంట్‌లోని అనుమానాస్పద మెయిల్స్ జోలికి వెళ్లకండి. అంతేకాకుండా, బ్రౌజర్ లోకేషన్ బార్, ప్రోటోకాల్స్‌ను ఒకటికి రెండు సార్లు పరిశీలించండి. accounts.google.comకు ముందు https:// అలానే గ్రీన్ కలర్‌లో లాక్ సింబల్ ఉంటేనే ముందుకు ప్రోసిడ్ అవ్వండి. అంతేకాకుండా, మీ జీమెయిల్ అకౌంట్‌కు టు స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసి ఉంచుకోండి.

జియో రూ.999 ఫోన్ ఇదే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This Gmail hacking attack is fooling even savvy users. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting