అభిమాని అంటే వీడేరా...! (ఫోటో గ్యాలరీ)

Posted By: Prashanth

అభిమాని అంటే వీడేరా...! (ఫోటో గ్యాలరీ)

 

ఆపిల్ ఐఫోన్5 పై మోజు పారేసుకున్నాడు ఆ వీరాభిమాని, కానీ.. కొనుగోలు చేసే సామర్ధ్యం అతని వద్ద లేదు. చివరకు, మనమే ఐఫోన్5 తయారు చేస్తే పోలా! అన్న సంకల్పానికి వచ్చేసాడు. అనుకున్నదే తడవుగా ఐఫోన్5ను తయారు చేసేసాడు, స్టీల్ ఫ్లేట్‌తో!, వివరాల్లోకి వెళితే...... సినా విబో ( Sina Weibo) అనే చైనీస్ వెబ్‌సైట్‌కు చెందిన యూజర్ ఒకరు స్టీల్ ప్లేట్‌తో ఐఫోన్5ను తయారు చేసిన వైనం టెక్నాలజీ ప్రంపచాన్ని ఆశ్చర్యానికిలోను చేస్టోంది. అలంకరణకు మాత్రమే ఉపయోగపడే ఆ డివైజ్ ఈ ఏడాదికిగాను అద్భుత ఆవిష్కరణల జాబితాలో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్టీల్ ప్లేట్‌తో కూడిన ఐఫోన్5 నిర్మాణంలో భాగంగా ఇతగాడు... 140మిల్లీమీటర్ల పొడవు, 60మిల్లీ మీటర్ల వెడల్పు, 6 మిల్లీ మీటర్ల మందంతో కూడిన స్టీట్ ప్లేట్‌ను సేకరించాడు. తరువాతి క్రమంలో సదరు స్టీల్ ప్లేట్ కోణాలకు ఐఫోన్5 తరహాలో పాలిష్ పట్టించాడు. తరువాతి చర్యగా అవసరమైన రంగులతో స్టీల్ ప్లేట్‌కు మెరుగులద్ది అచ్చం ఐఫోన్5లా మార్చేసాడు. పెన్సిల్ సాయంతో ఆపిల్ లోగోను సైతం ముద్రించేసాడు. ఆ పనితీరు మీరు చూడండి..... ఫోటో గ్యాలరీలో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot