అడ్డంగా దొరికిన తెలివి తక్కువ దొంగ!

Posted By:

చోరికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన ఓ తెలివి తక్కువ దొంగకు సంబంధించిన ఉదంతం ‘టంబ్లర్ బ్లాగ్స్'లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. "నా ఫోన్ దొంగలించిన ఒక స్ట్రేంజర్ జీవితం," అనే శీర్షికతో ప్రచురితమవుతున్న ఈ పోస్టుకు టంబ్లర్ అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వివరాల్లోకి వెళితే..... దుబాయ్ నివాసితుడైన హఫీద్ స్పెయిన్ నగరంలోని ఐబిజా బీచ్ వద్ద ఐఫోన్‌ను దొంగిలించాడు.

అయితే, దొంగిలించబడిన ఫోన్‌లోని ఫైల్ షేరింగ్ అప్లికేషన్ ‘డ్రాప్ బాక్స్'ను టర్న్‌ఆఫ్ చేయటం మరిచిపోయాడు. దింతో దొంగిలించబడిన ఫోన్ ద్వారా హఫీర్ చిత్రీకరించిన ప్రతి ఫోటో, ఫోన్ అసలు యజమానిరాలి కంప్యూటర్‌లో కాపీ అయ్యింది. కంప్యూటర్‌లో కాపీ అయిన ఫోటల్లో హఫీద్ ముఖచిత్రాలు కూడా లభించటం విశేషం. పేరు తెలిపేందుకు నిరాకరించిన ఫోన్ యజమాని ఈ అప్‌డేట్‌లను క్రమం తప్పకుండా టంబ్లర్‌లో పోస్ట్ చేస్తోంది. జూలై 28 నుంచి హఫీద్ ఇలా ఫోటోలు పంపుతూనే ఉన్నాడు. దింతో.. హఫీద్ ఉదంతం టంబ్లర్‌లో మారుమోగిపోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

This Guy Stole A Woman's iPhone

ఫోన్ దొంగిలించబడిన ప్రదేశం ఇదే....

This Guy Stole A Woman's iPhone

దొంగిలించిన ఐఫోన్ కెమెరా ముందు హఫీద్ ఫోజులు

 

 

 

This Guy Stole A Woman's iPhone

దొంగిలించిన ఐఫోన్ ముందు హఫీద్ ఫోజులు

అడ్డంగా దొరికిన తెలివి తక్కువ దొంగ!

చూస్తుంటే కుర్రోడికి చేతివాటం ఎక్కువగా ఉన్నట్లులేదు.

అడ్డంగా దొరికిన తెలివి తక్కువ దొంగ!

హఫీద్ రూమ్‌మేట్స్‌లో ఒకరు

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ బుర్ర తక్కువ దొంగ అమెరికాలోని ఒక మహిళ వద్ద నుంచి ఐఫోన్‌ను దొంగిలించాడు. విడ్డూరంగా దొంగిలించిన ఫోన్‌లోని ఫేస్‌బుక్ అకౌంట్ వాల్ పై తన ఫోటోను పోస్ట్ చేసి సర్వత్రా చర్చనీయాంశంగా మారాడు. వివరాల్లోకి వెళితే. జీనీ అలెన్, వాషింగ్ టన్ పరిధిలోని బ్రిమిర్టన్‌లోని స్థానిక గ్రంధాలయంలో వీడియోను చిత్రీకరిస్తుండగా అలెన్ చేతిలోని ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన హ్యాండ్‌సెట్‌‌లో అలెన్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో పాటు తన చిన్నారులు ఫోటోలు ఇంకా ముఖ్యమైన కంపెనీ ఈమెయిల్స్ ఉన్నాయి. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి తన వ్యక్తిగత సమాచారాన్నివినియోగించుకుని ఏమైనా దుర్వినియోగానికి పాల్పడుతాడేమోనని అలెన్ బెంబేలెత్తటం మొదలెట్టింది. ఇంతలోనే ఓ షాకింగ్ సమాచారాన్ని ఆమె తెలుసుకుంది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అలెస్ ఫేస్‌బుక్ అకౌంట్ టైమ్‌లైన్ పై తన ఫోటోను పోస్ట్ చేసుకున్నాడు. దీంతో బిత్తరపోయిన అలెన్ రిమోట్ క్రంటోలిగ్ వ్యవస్థ ద్వారా తన ఫోన్‌లోని సమాచారాన్ని చెరిపివేయగలిగింది. అలెన్ స్నేహితులు సదరు దొంగ పోస్ట్ చేసిన వాల్ క్రింది ‘సెల్‌ఫోన్ దొంగ' అంటూ శీర్షికలివ్వటం మొదలెట్టారు. ఈ ఘటన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot