ఇంట్లో ఏసీని air purifierగా కన్వర్ట్ చేసే డివైస్,ధర రూ.399 మాత్రమే
ఈ రోజుల్లో air purifier కావాలంటే భారీగానే చెల్లించాలి. ఇంట్లో ఏసీ ఉన్నా అందులో నుంచి స్వచ్చమైన గాలి రాక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దీనికి IIT Delhi startup ఓ పరిష్కార మార్గాన్ని కనుగొంది. వీరు ఇందుకోసం ఓ డివైస్ ను కనుగొన్నారు . ఈ డివైస్ ద్వారా Nanoclean AC filters సహాయంతో మీ ఏసీని purify air వచ్చే విధంగా మార్చేయవచ్చు. windows and split దగ్గర నుంచి చల్లని స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఈ డివైస్ పనిచేస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. Nanoclean filters ని ఎటువంటి ఏసీ మోడల్స్ కైనా వాడుకోవచ్చు. ఇండియాలో లభించే అన్ని రకాల మోడళ్లకు ఈ డివైస్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

ఎయిర్ పొల్యూషన్
దేశంలో రోజు రోజుకు ఎయిర్ పొల్యూషన్ అధికమవుతుందే కాని తగ్గడం లేదు. దీని వల్ల ఎక్కడా స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. ఇంట్లో ఏసీలు ఉన్నా కాని గాలి అంతంత మాత్రంగానే దొరుకుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా IIT Delhi startup ప్రతినిధులు Nanoclean filters డివైస్ ని తయారుచేశారు. ఈ డివైస్ ఇంట్లో కాని లేదా ఆఫీసుల్లో కాని మరే ప్రదేశంలోనైనా కాని వాడుకోవచ్చు.

ధర
వన్ ప్యాక్ Nanoclean AC filterలో రెండు ఫిలర్ట్స్ ఉంటాయి. ఈ రెండు ఫిల్టర్స్ ని ఇంట్లో ఉన్న ఒక ఏసీకి వాడుకోవచ్చు. దీని ధరను కంపెనీ రూ. 399గా నిర్ణయించింది. ఈ ఫిల్టర్స్ కొనుగోలు చేయాలనుకున్న వారు అమెజాన్ లో కాని లేకుంటే company’s own websiteలో కాని కొనుగోలు చేయవచ్చు.ప్రస్తుతం అమెజాన్ కాంబో ప్యాక్ కింద వీటిని అమ్ముతోంది. ఈ కాంబో ప్యాక్ ధర రూ. 899గా ఉంది. దీంతో పాటుగా ఈ ఫిల్టర్స్ అన్ని mortar stores అలాగే ఫార్మసీ షాపుల్లోనూ లభిస్తున్నాయి.

ఎలా పనిచేస్తుంది
ఇప్పుడున్న ప్రతి ఏసీ ప్లాస్టిక్ మెష్ తో air filterతో వస్తున్న సంగతి తెలిసిందే. Nanoclean AC filterని ఈ ప్లాస్టిక్ మెష్ కి టేపు ద్వారా అంటింస్తే సరిపోతుంది. కాగా ఇది ఎటువంటి ఛార్జింగ్ కాని ఎలక్ట్రిక్ అనుసంధానమై రాలేదు కాబట్టి అదనంగా కరెంట్ బిల్ వస్తుందన్న బాధ ఉండదు. మూసివేసిన చిన్నగదిలో దాదాపు PM2.5 అంతకన్నా చిన్న ఇతర సూక్ష్మ-కణ కాలుష్య కారకాలను ట్రాప్ చేస్తుంది.దాదాపు 90 శాతం స్వచ్చమైన చల్లని గాలిని ఈ Nanoclean filters అందిస్తుంది. ఇది అమర్చిన గంటలోనే గదిలో 90 శాతం స్వచ్ఛమైన గాలిని ఉండేలా సహాయపడుతుంది. 1.5 ton AC రన్ అవుతున్నప్పుడు లోపలకు వచ్చే గాలిని కేవలం 55 నిమిషాల్లోనే స్వచ్ఛమైన గాలిగా మార్చివేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఈ నానో క్లీన్ ఫిల్టర్స్ ద్వారా డబ్బులు ఆద, కరెంట్ ఆదా రూంలో స్పేస్ ఆదా జరుగుతాయని కంపెనీ చెబుతోంది.


Click it and Unblock the Notifications