మీకు తెలుసా మీ ఇంట్లో చెత్తను కొంటారని..

Written By:

మనం రోజు ఇంట్లోని చెత్తని బయటపడేస్తుంటాం..అయితే ఆ చెత్తను కొనే వాళ్లుంటే చాలా బాగుంటుంది అని ఒక్కోసారి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. మరి ఈ చెత్తను కొనేవాళ్లు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతుంటాం కూడా. అయితే మీకు దగ్గర్లో లేరు కాని ఖరగ్ పూర్ లో చెత్తను డబ్బులిచ్చి కొనుక్కుపోతున్నారట. చెత్తను కొనడమేందీ అని అనుకుంటున్నారా..ఇది అక్కడ ఇప్పుడు పెద్ద బిజినెస్ వైపుగా అడుగులు వేస్తోంది.

Read more: అమెరికాలో అత్యంత చెత్త జీతాలు ఇచ్చే రాష్ట్రాలు

మీకు తెలుసా మీ ఇంట్లో చెత్తను కొంటారని..

వివరాల్లోకెళితే అభిమన్యుమను అనే ఐఐటీ స్టూడెంట్ ప్రతి ఒక్కరి ఇంటెకెళ్లి చెత్తను సేకరిస్తున్నారట. ఎవరి ఇంట్లోనైనా చెత్త ఉంటే వారిచ్చిన నంబర్ కి కాల్ చేస్తే ఆటోమేటిగ్గా వారే వచ్చి మీకు డబ్బులిచ్చి మరీ చెత్తను తీసుకెళతారు. ఉదయం 8.30 నుంచి 5.00 పీఎమ్ వరకు ఎప్పుడైనా మీరు కాల్ చేయవచ్చు. ఈ ఆలోచన అభిమన్యు మదిలోనుంచి పుట్టింది. ప్రస్తుతం అతను ఐఐటీ ఖరగ్ పూర్ లో పీహెచ్ డీ చేస్తున్నాడు.

Read more: ఒక్క బగ్‌తో ఫేస్‌బుక్ నుంచి 10 లక్షలు..

మీకు తెలుసా మీ ఇంట్లో చెత్తను కొంటారని..

మొత్తం 7 మంది ఉద్యోగులతో అలాగే కొంతమంది రోజువారి పనిమనుషులతో ఇది రన్ అవుతోంది. చెత్తను ఇలా ఎందుకు సేకరిస్తున్నారంటే దాన్ని రీ సైక్లింగ్ చేసి వర్మీ కంపోస్ట్ గా తయారుచేస్తారని వారి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అలాగే పేపర్ ను తయారు చేస్తున్నారట. మేము వారానికి రూ. 1500 వరకు చెత్తను ఇచ్చే వారికి చెల్లిస్తున్నామని అతను చెబుతున్నారు.

మీకు తెలుసా మీ ఇంట్లో చెత్తను కొంటారని..

దీనికోసం త్వరలో ఓ యాప్ ని కూడా డెవలప్ చేస్తున్నామని దీని ద్వారా పని మరింత సులువు అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
Here Write This IITian Pays People For Their Trash In Kharagpur. Here’s Why
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot