రూ.19000కే ఐఫోన్ ఎక్స్ లాంటి ఫోన్, 6జీబి, 128జీబి స్టోరేజ్

Posted By: BOMMU SIVANJANEYULU

యాపిల్ ఐఫోన్ 10వ వార్షికోత్సవాన్ని పరస్కరించుకుని ఇటీవల మార్కెట్లో ఐఫోన్ ఎక్స్ ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ లతో పోలిస్తే ఖరీదైన ఐఫోన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 3డీ ఫేస్ ఐడీ, ఎడ్జ్-టు-ఎడ్జ్ స్ర్కీన్ వంటి విప్లవాత్మక ఫీచర్లతో లాంచ్ అయిన ఈ డివైస్‌ను అనేక చైనా కంపెనీలు అనుకరిస్తున్నాయి.

రూ.19000కే ఐఫోన్ ఎక్స్ లాంటి ఫోన్, 6జీబి, 128జీబి స్టోరేజ్

వాటిలో ఒకటైన 'లీగో’ (Leagoo) ఎస్9 పేరుతో ఐఫోన్ ఎక్స్ తరహా ఫోన్‌ను అక్కడి మార్కెట్లో లాంచ్ చేసింది. ఐఫోన్ ఎక్స్‌కు కాపీ‌క్యాట్‌గా పేర్కొనబడుతోన్న ఈ డివైస్ లీగో ఎస్9 పేరుతో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ ఎక్స్ తరహాలో బీజిల్-లెస్ డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరా సెటప్ వంటి సిమిలర్ ఫీచర్స్‌తో లాంచ్ అయిన ఈ డివైస్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం యాపిల్ స్టాండర్డ్స్‌ను అందుకోలేక పోయింది.

రూ.19000కే ఐఫోన్ ఎక్స్ లాంటి ఫోన్, 6జీబి, 128జీబి స్టోరేజ్

లీగో ఎస్9 స్పెసిఫికేషన్స్..5.85 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ పీ40 చిప్‌సెట్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, చైనా మార్కెట్లో ఈ డివైస్ ధర 300 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.19,330).

Airtel 4G Hotspot ధర తగ్గింది

ఏదైనా ఒక బ్రాండెడ్ క్వాలిటీ వస్తువు మార్కెట్లో విడుదలై విజయవంతమైతే చాలు ఆ వెనువెంటనే దాని డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది. మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోన్న నకిలీ వస్తువుల జాబితాలో టెక్నాలజీ గాడ్జెట్‌లు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా నకిలీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఇబ్బడి మబ్బడిగా లభ్యమవుతున్నాయి.

English summary
This iPhone X copycat will cost less than $300 (approximately Rs. 19,330).
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot