జియో నీకు ఇది తగదు, ఇకనైనా ఆటలు మానుకో..

Written By:

ఉచితం పేరుతో టెల్కోలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జియోపై ఎయిర్‌టెల్‌ నిప్పులు చెరిగింది. అదీగాక జియో ప్రభావంతో టెలికాం ఇండస్ట్రీకి ఇప్పటికే కొన్ని కోట్ల మేర నష్టాలు వస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌, మరోసారి జియో కాల్స్‌ సునామితో వచ్చే నష్టాలపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది.

అన్నీ సూపరే, బెస్ట్ సెలక్షన్ మీదే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో కాల్స్‌ సునామితో

జియో కాల్స్‌ సునామితో తమకు ఒక్కో క్వార్టర్‌కు రూ.550 కోట్ల మేర నష్టాలు వాటిల్లుతున్నాయని భారతీ ఎయిర్‌టెల్‌ గురువారం పేర్కొంది.

ఒక్కో నిమిషానికి 20 పైసల మేర నష్టాలు

తమ ప్రత్యర్ధి నెట్‌వర్క్‌ నుంచి వచ్చే కాల్స్‌ నిర్వహించడానికి ఒక్కో నిమిషానికి 20 పైసల మేర నష్టాలు పాలవుతున్నామని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

ఎయిర్‌టెల్‌ స్థాపించిన హైవేపై

ఎయిర్‌టెల్‌ స్థాపించిన హైవేపై జియో ఉచితంగా ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకుందని మండిపడింది. భారత్‌లో టెలికాం మార్కెట్‌లో పోటీవాతారణం కావాలని, కానీ మోనోపలి కాదని హెచ్చరించింది.

అవన్నీ అవాస్తవాలనే..

మొబైల్‌ టెర్మినేషన్‌ ఛార్జ్‌(ఎంటీసీ) ద్వారా ఎక్కువ రెవెన్యూలు ఆర్జిస్తున్నాయనే జియో ఆరోపణలన్ని ఎయిర్‌టెల్‌ ఖండించింది. అవన్నీ అవాస్తవాలనే పేర్కొంది.

ఎంటీసీలను రద్దుచేస్తే

ఎంటీసీలను రద్దుచేస్తే, రిలయన్స్‌ జియో దోపిడీపూరిత ధరల విధానం మరింత కొనసాగుతుందని కంపెనీ చెప్పింది.

జీరో ఎంటీసీతో

జీరో ఎంటీసీతో రిలయన్స్‌ జియో, తన ఖర్చులను ఎయిర్‌టెల్‌, ఇతర ఆపరేటర్లకు మళ్లించాలని చూస్తుందని ఆరోపించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This is how much 'free calls' from Reliance Jio network cost Airtel per quarter Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot