Home
News

ఈ ఏడాదికిగాను యూట్యూబ్‌‌లో అతిపెద్ద గేమ్ ఇదే..

గేమింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన పీయూబీజీ, ఫోర్ట్‌నైట్ వంటి బ్యాటిల్ రాయల్ గేమ్స్ ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచాన్ని హోరెత్తిస్తోన్న విషయం తెలిసిందే.

గేమింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన పీయూబీజీ, ఫోర్ట్‌నైట్ వంటి బ్యాటిల్ రాయల్ గేమ్స్ ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచాన్ని హోరెత్తిస్తోన్న విషయం తెలిసిందే. యువకుల దగ్గర నుంచి పెద్ద వయసు వారు వరకు ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ వెర్షన్స్ గేమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కాల్ ఆఫ్ డ్యూటీ అనే ఫస్ట్-పర్సన్ షూటర్ గేమ్ కూడా చేరిపోయింది.

యూట్యూబ్‌లో తీవ్రమైన పోటీ..

యూట్యూబ్‌లో తీవ్రమైన పోటీ..

ఈ మూడు ఆన్‌లైన్ గేమ్స్ ప్రపంచమంతా వైరల్ అవుతున్నప్పటికి యూట్యూబ్‌లో మాత్రమే తీవ్రమైన పోటీని ఎదుర్కుంటున్నాయట. యూట్యూబ్ డైరెక్టర్ (గేమింగ్ కంటెంట్ అండ్ పార్టనర్‌షిప్స్) ర్యాన్ వాట్స్, వెర్జ్ మీడియాతో షేర్ చేసిన వివరాల ప్రకారం బ్యాటిల్ రాయల్ గేమ్స్‌కు యూట్యూబ్‌లో ట్రెండిగ్ అవుతున్నప్పటికి వీటిని Minecraft గేమ్ అధిగమించేసిందట.

 

 

అతిపెద్ద గేమ్‌గా మైన్‌క్రాఫ్ట్..

అతిపెద్ద గేమ్‌గా మైన్‌క్రాఫ్ట్..

ది వెర్జ్ కథనం ప్రకారం 2018కుగాను యూట్యూబ్‌‌లో అతిపెద్ద గేమ్‌గా మైన్‌క్రాఫ్ట్ అవతరించింది. శాండ్‌బాక్స్ వీడియో గేమ్ అయిన మైన్‌క్రాఫ్ట్‌ను స్విడిష్ గేమ్ డెవలపర్ అయిన మార్కస్ పర్సన్ 2011లో అభివృద్థి చేసింది. ఆ తరువాత ఈ గేమ్‌ను మెజాంగ్ అనే వీడియో గేమ్ డెవలపర్ అభివృ్ద్థి చేసింది. ఈ గేమ్‌లో భాగంగా స్ట్రక్షర్స్‌ను బిల్డ్ చేసేందుకుగాను ప్లేయర్స్ వివిధ వెరైటీలలో బ్లాక్స్‌ను ఎంపిక చేసుకుని 3డీ పద్థతిలో వాటిని సృష్టించుకునే వీలుంటుంది.

7.4 కోట్ల యాక్టివ్ ప్లేయర్స్..

7.4 కోట్ల యాక్టివ్ ప్లేయర్స్..

ఈ గేమ్ దాదాపుగా 10 సంవత్సరాల పాతదైనప్పటికి డిసెంబర్ 2017 నాటికి యూట్యూబ్‌లో 7.4 కోట్ల యాక్టివ్ ప్లేయర్‌లను కలిగి ఉందట. ఇదే సమయంలో ఫోర్ట్‌నైట్ బ్యాటిల్ రాయల్ గేమ్‌కు కేవలం 3.4 మిలయన్ యూజర్లు మాత్రమే ఉన్నారట. మైన్‌క్రాఫ్ట్ గేమ్ పాత టైటిల్‌తోనే కొనసాగుతున్నప్పటికి కంటెంట్ పరంగా మాత్రం కొత్తకొత్త అప్‌డేట్‌లను అందుకుంటోందట.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల రాకతో...

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల రాకతో...

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల రాకతో గేమింగ్ మరింతగా విస్తరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లను ఉపయోగించే ప్రతి ఒక్క యూజర్ కాస్తంత తీరక సమయం దొరికితే చాలు తన ఫోన్‌లోని గేమ్స్ పట్ల అమితమైన ఇష్టత చూపుతారు. ఆండ్రాయిడ్ గేమింగ్ ప్రియుల కోసం అనేక వర్షన్‌లలోని గేమ్స్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి.

ఇంటర్నెట్ కనెక్షన్‌తో అవసరం లేని గేమ్స్..

ఇంటర్నెట్ కనెక్షన్‌తో అవసరం లేని గేమ్స్..

అయితే, ఇంటర్నెట్ కనెక్షన్ అనేదే అవసరం లేకుండా ఆడుకునే విధంగా కొన్ని గేమ్స్ డిజైన్ చేయబడ్డాయి. వీటీని ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఉపయోగించుకోవచ్చు. క్రాసీ రోడ్, ఈఏ స్పోర్ట్స్ యూఎఫ్‌సీ, లింబో, స్వింగ్ కాప్టర్స్, బాల్డుర్స్ గేట్ II, కుక్, సర్వ్, డెలిషీయస్!, సార్సిరీ! 2, బ్యాడ్‌ల్యాండ్, టెంపుల్ రన్ 2, షాడో ఫ్లైట్ 2 వంటి గేమ్‌లను ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
This is the biggest game on YouTube this year.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X