ఫోన్ గురించి భయానక వాస్తవాలు

Written By:

కమ్యూనికేషన్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్న స్మార్ట్‌ఫోన్, ఆధునిక మనిషి జీవనశైలిలో పెనుమార్పులను తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్‌‍లలో పొందుపరుస్తున్న అడ్వాన్సుడ్ కమ్యూనికేషన్ సౌకర్యాలకు మనిషి దాసోహమంటున్నాడు. మనుషులు, స్మార్ట్‌ఫోన్‌ల మధ్య విడదీయలేని బంధం ఏర్పడిన నేపధ్యంలో, కొందరు వీటితో ఇంటరాక్ట్ అవుతున్న తీరు కలవరపెడుతోంది.

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

మార్కెట్లో రెడీగా ఉన్న, 20 హై‌క్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

ఎందుకంటే..?, చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫోన్‌లు పక్కలో లేనిదే నిద్రరాదంటున్నారు. ఫోన్‌లను పిల్లో క్రింద ఉంచుకుని నిద్రపోయే అలవాటు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికి వాటిని పట్టించుకోవటం లేదు. నిద్రలోనూ ఫోన్‌లను దగ్గరగా ఉంచుకోవటం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

చాలామంది తమ స్మార్ట్‌ఫోన్‌లను పిల్లో క్రింద పెట్టుకుని నిద్రపోతుంటారు.ఈ చర్య చాలా ప్రమాదకరమైనదని చాలా సంఘటనల్లో రుజువైంది. ఫోన్‌లను పిల్లో క్రింద ఉంచటం వల్ల ఒత్తిడితో రాపిడి జరిగి బరస్ట్ అయ్యే అవకాశముంది. ఈ కారణంగా అగ్నిప్రమాదం, తద్వారా ప్రాణాలకు ముప్పు కూడా వాటిల్లే అవకాశముంది.

 

ఫోన్ గురించి భయానక వాస్తవాలు


ఫోన్‌లను పక్కన పెట్టుకుని నిద్రపోవటం వల్ల నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఎందుకంటే.. డేటా ఆన్ చేసి ఉన్న ఫోన్‌కు తరచూ నోటిఫికేషన్స్ అలానే మెసేజెస్ వస్తుంటాయి. ఇవి పదేపదే శబ్దాలు చేయటం వల్ల మీకు సరిగా నిద్ర పట్టదు.

 

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

ఫోన్ రకరకాల రేడియేషన్‌లను విడుదల చేస్తుంది. ఫోన్ క్లాసిఫికేషన్‌ను బట్టి రేడియేషన్ స్థాయి ఉంటుంది. లో-ఎండ్ ఫోన్‌‍లలో ఈ రేడియేషన్ స్థాయి ఎక్కువుగా ఉంటుంది. ఫోన్‌లను తలకు దగ్గరగా ఉంచుకుని నిద్రపోవటం వల్ల కార్సినోజెనిక్ వ్యాధులు సంభవించే ప్రమాదముంది.

 

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

ఫోన్‌లను ఛాతీకి దగ్గరగా ఉంచుకుని నిద్రపోవటం వల్ల హార్ట్ అటాక్‌కు దారితీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

చాలా మంది ఫోన్‌‌లలో అలారమ్‌ను సెట్ చేసుకుని తమ పక్కనే ఉంచుకుని నిద్రపోతుంటారు. ఇది మంచి చర్య కాదు. కాబట్టి, సాధ్యమైనంత త్వరగా అలారమ్‌ను కొనుగోలు చేయండి.

 

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

రాత్రుళ్లు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించటం వల్ల మీ నిద్ర షెడ్యూల్ దెబ్బతింటుంది. ఈ ప్రభావం మెదడు పై చూపటంతో మరసటి రోజు మీరు చేసే ఏ పనిలోనూ ఏకాగ్రత చూపించలేరు.

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా సంభవించే నిద్ర లోపం మిమ్మల్ని మానసికంగా మరింత బలహీన పరచగలదు.

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా సంభవించే సుధీర్ఘ నిద్ర కొరత మీరు న్యూరోటాక్సిన్ స్థాయిని మరింత పెంచేస్తుంది. ఈ కారణంగా మీరు మంచి నిద్రను కోల్పొతారు.

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

స్మార్ట్‌ఫోన్ లైట్ ఎక్స్‌పోజర్ కారణంగా మెలాటోనిన్ హార్మోన్‌ను కోల్పొయిన వారిని ఒత్తిడి చుట్టుముడుతుంది.

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ‌లైట్ స్ర్కీన్ కంటి చూపును దెబ్బ తీసే ప్రమాదముందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కంటిశుక్లాలలకు దారితీసే ప్రమాదముందా..? అన్న అంశం పై పరిశోధనలు జరుగుతున్నాయి.

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

స్మార్ట్‌ఫోన్ బ్లూ‌లైట్ ఎక్స్‌పోజర్ మీలోని మెలాటోనిన్ హార్మోన్‌ను దెబ్బతీయటమే కాకుండా బ్రెస్ట్ ఇంకా ప్రోస్టేట్ కాన్సర్‌లను సృష్టించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

స్మార్ట్‌ఫోన్ బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ మీలోని మెలాటోనిన్ హార్మోన్ ను దెబ్బతీయటమే కాదు మీలో ఒబేసిటీ రిస్క్‌ను సృష్టిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This is Why You Should Not Sleep with a Cell Phone Under Your Pillow. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot