Just In
- 25 min ago
Dell నుంచి కొత్త Laptop లాంచ్ అయింది ! ధర & స్పెసిఫికేషన్లు చూడండి.
- 1 hr ago
Moto Tab G62 టాబ్లెట్ విడుదలైంది!! ధరల మీద ఓ లుక్ వేయండి...
- 2 hrs ago
Vivo V25 Pro 5G కలర్ మారే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
- 3 hrs ago
Airtel ముందస్తు స్పెక్ట్రమ్ చెల్లింపుగా DoTకి ఎంత చెల్లించిందో తెలుసా?
Don't Miss
- Automobiles
త్వరలో విడుదలకానున్న 'హోండా యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్': ఫోటోలు
- Lifestyle
Health Benefits of Ragi : ఈ ఒక్క పదార్ధం కలిగిన ఆహారాలు రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి!
- Sports
SA vs Eng 1st Test Playing 11 : బాజ్‌బాల్ అంతుచూడ్డానికి ప్రోటీస్ సై..! ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా తుది టీంలు!
- News
ఉచితాలపై సుప్రీం కీలక ప్రశ్నలు-రాజకీయ పార్టీల్ని ఆపలేం- ఏది సంక్షేమమో తేల్చాల్సిందే..
- Travel
నైనిటాల్ పర్యటనలో ఈ ప్రదేశాలు అస్సలు మిస్సవ్వొద్దు
- Movies
Guppedantha Manasu రిషి పెళ్లి ఆగిపోతే స్వీట్లు పంచుకొంటారా? జగతికి దేవయాని షాక్
- Finance
Gold: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గోల్డ్ ట్రేడర్.. ఎలా కుప్పకూలింది..? ఆ మోసంతో..
Android యూజర్లూ జాగ్రత్త.. Toll Fraud పై అప్రమత్తంగా ఉండండి!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ Android యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ మొబైళ్లలో Toll Fraud అనే మాల్వేర్ ద్వారా జరుగుతున్న మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ Toll Fraud మాల్వేర్ ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో చొరబడి యూజర్‌ను వైఫై నుంచి డిస్కనెక్ట్ అయ్యేలా చేసి బలవంతంగా మొబైల్ డేటాను వినియోగించేలా చేస్తుంది. అంతేకాకుండా ఇది యూజర్లను వారికి తెలియకుండానే ప్రీమియం సబ్స్క్రిప్షన్లను తీసుకునే విధంగా పని చేస్తుంది. SMS మోసాలు, కాల్ మోసాలను మాదిరిగానే ఈ టోల్ మోసాలు కూడా ప్రత్యేకమైన ప్రవర్తనను కలిగి ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ 365 డిఫెండర్ రీసెర్చ్ టీమ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్ 365 డిఫెండర్ రీసెర్చ్ టీమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. "ఈ Toll Fraud మాల్వేర్ ఆండ్రాయిడ్ మొబైళ్లపై దాడి లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ మాల్వేర్ ముందుగా, పలు ఎంపిక చేసిన నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని తద్వారా ఆ నెట్‌వర్క్‌కు సబ్స్క్రయిబ్ అయిన డివైజ్‌లపై దాడి చేస్తుంది. టోల్ఫ్రాడ్ మాల్వేర్ ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో చొరబడిన తర్వాత యూజర్‌ను వైఫై నుంచి డిస్కనెక్ట్ అయ్యేలా చేసి, బలవంతంగా మొబైల్ డేటాను వినియోగించేలా చేస్తుంది. అంతేకాకుండా ఇది యూజర్లను వారికి తెలియకుండానే ప్రీమియం సబ్స్క్రిప్షన్లను తీసుకునే విధంగా పని చేస్తుంది." అని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
"టార్కెట్ డివైజ్‌కు కనెక్ట్ అయిన తర్వాత, వినియోగదారు అనుమతి లేకుండానే ప్రీమియం సబ్స్క్రిప్షన్లను ఎనేబుల్ చేస్తుంది. ఇందుకోసం యూజర్ నుంచి ఓటీపీ అనుమతి కూడా లేకుండానే చేస్తుంది. అంతేకాకుండా.. ఇది మొబైల్లో సెక్యూరిటీ థ్రెట్‌లను యూజర్ గుర్తించకుండా ఉండేందుకు డైనమిక్ కోడ్ లోడింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది."అని మైక్రోసాఫ్ట్ యూజర్లను అప్రమత్తం చేసింది.

ఈ మాల్వేర్ ప్రమాదాన్ని ఎలా అరికట్టాలి:
ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి మైక్రోసాఫ్ట్ పలు మార్గాలను గుర్తించింది. ఈ ముప్పు యూజర్లను దరిచేరకుండా ఉండాలంటే.. యూజర్లు ఎల్లప్పుడు విశ్వసనీయ సోర్సుల నుంచి మాత్రమే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. అంతేకాకుండా డివైజ్‌ను ఎల్లప్పుడూ అప్డేట్ చేసుకోవాలని కోరింది. అనవసరంగా పలు అప్లికేషన్లకు ఎస్ఎంఎస్ల యాక్సెస్, నోటిఫికేషన్ల యాక్సెస్ ఇవ్వడాన్ని ఆపేయాలని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.

దీంతో పాటు మొబైల్స్‌లోకి మాల్వేర్లను చొప్పించే యాప్స్ చాలా ఉన్నాయి. వాటిలో ప్రమాదకరమైన కొన్నింటి గురించి తెలుసుకుందాం:
మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ అన్నీ మంచివే అని అనుకుంటే పొరపాటే. వాటిల్లో కొన్ని మాల్వేర్ యాప్స్ కూడా ఉన్నాయి. ఆ యాప్స్ మన మొబైల్స్‌లోకి మాల్వేర్లను చొప్పించి హ్యాకర్లకు ఆయుధాలు పనిచేస్తున్నాయి. తద్వారా మన డేటా, మరియు అకౌంట్లలో నగదు తస్కరణకు అవకాశం ఏర్పడుతుంది. అలాంటి పది ప్రమాదకరమైన అప్లికేషన్ల గురించి మనం తెలుసుకుందాం. అవి మన మొబైల్స్‌లో లేకుండా జాగ్రత్త పడదాం.
కూల్ కాలర్ స్క్రీన్ (Cool Caller Screen):
మొబైల్స్‌లోకి మాల్వేర్లను చొప్పించే అప్లికేషన్ల జాబితాలో కూల్ కాలర్ స్క్రీన్ యాప్ కూడా ఒకటి. ఇది Play స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది కాలర్ స్క్రీన్ (Caller Screen) ను మన ప్రిఫరెన్స్ అనుగుణంగా ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ ప్రమాదకరమైన మాల్వేర్లను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యాప్‌తో జాగ్రత్త గా ఉండాలి.
డాక్యూమెంట్ మేనేజర్ (Document Manager):
ఈ యాప్ మీ మొబైల్లోని డాక్యూమెంట్స్, ఫైల్స్ ను మేనేజ్ చేయడానికి వినియోగించబడుతుంది. అంతేకాకుండా ఇది పీడీఎఫ్, వర్డ్, ఎక్సెల్ ఇతరత్రా డాక్యూమెంట్స్ సులువుగా ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ, ఈ అప్లికేషన్ కూడా ప్రమాదకరమైన మాల్వేర్లను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యాప్‌తో జాగ్రత్త గా ఉండాలి.
ఆర్జీబీ ఎమోజీ కీబోర్డ్ (RGB Emoji Keyboard)
ఆర్జీబీ ఎమోజీ కీబోర్డ్ అప్లికేషన్ కూడా ప్రమాదకరమైన యాప్. ఇది మీ మొబైల్లోని డేటా మరియు నగదుదను తస్కరించే ప్రమాదం ఉంటుంది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించారు. కానీ, ఇదేవిధంగా ఇంకా కొన్ని యాప్‌లు ప్లేస్టోర్‌లో ఉన్నాయి. వాటితో జాగ్రత్తగా ఉండాలి.

కెమెరా ట్రాన్స్‌లేటర్ ప్రో (Camera Translator Pro)
ఇతర విదేశీ భాషల్లో ఉన్న టెక్స్ట్ ను మీరు చదవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. అయినప్పటికీ, ఈ యాప్ ప్రమాదకర మాల్వేర్ను కలిగి ఉంది. ఈ యాప్ యూజర్ల డేటా, వ్యక్తిగత సమాచారంపై యాక్సెస్‌ను దక్కించుకుంటుంది. కాబట్టి ఈ యాప్‌తో కూడా జాగ్రత్తగా ఉండాలి.
కలర్‌ఫుల్ మెసెంజర్ (Colorful Messenger)
గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న అత్యంత ప్రమాదకర యాప్‌లలో ఈ కలర్‌ఫుల్ మెసెంజర్ యాప్ కూడా ఒకటి. ఈ యాప్‌ను మీ మొబైల్ ఫోన్లలో కలిగి ఉన్నట్లయితే ఉన్న ఫళంగా దీన్ని డిలీట్ చేయడం ఉత్తమం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫాస్ట్ పీడీఎఫ్ స్కానర్ (Fast PDF Scanner)
ఈ యాప్ పేరు ప్రకారం పీడీఎఫ్ స్కానర్‌గా మనకు తెలుస్తోంది. ఇది ఇతర డాక్యూమెంట్స్‌ను పీడీఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. అయితే ఈ యాప్ కూడా ప్రమాదకరమైనది గా తెలుస్తోంది. దీన్ని కూడా డిలీట్ చేయడం ఉత్తమం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగ్ ఫొటో ఎడిటర్ (Thug Photo Editor)
ఈ తగ్ ఫొటో ఎడిటర్ యాప్‌ను ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. గూగుల్ ప్లే డేంజరస్ యాప్స్ జాబితాలో ఇది ఉంది. పేరు ప్రకారం ఇది యూజర్లను ఫొటో ఎడిటింగ్‌కు అనుమతి ఇస్తుంది. కానీ , అదేవిధంగా ఇది యూజర్ల డేటా, నగదును తస్కరిస్తుంది.
స్మార్ట్ కీ బోర్డ్ (Smart Keyboard)
గూగుల్ ప్లే స్టోర్‌లో చాలా వరకు కీ బోర్డ్‌లకు సంబంధించిన యాప్స్ ఉన్నాయి. కానీ అందులో చాలా యాప్స్ సురక్షితమైనవి కాదు. ఈ స్మార్ట్ కీ బోర్డ్ యాప్ చూడటానికి మీకు ఈజీ టైపింగ్ యాప్ మాదిరి కనిపిస్తుంది. కానీ, ఇది మీ డేటా, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086