ఈ పాత ఐఫోన్ ధరతో ఇప్పుడున్న లేటెస్ట్ ఐఫోన్ కూడా సరిపోదు

By Gizbot Bureau
|

మీరు ఐఫోన్ కొంటున్నారా..ఐఫోన్ లో లేటెస్ట్ గా వచ్చిన ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ ధర అన్ని ఐఫోన్ల కంటే ఎక్కువని అనుకుంటున్నారా..అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే దాన్ని మించిన ఐఫోన్ కూడా ఉంది. అది లేటెస్ట్ మోడల్ కన్నా ముందు విడుదలైన ఐఫోన్. ఇంతకీ ఆ ఫోన్ ఏదో చెప్పనే లేదు కదా.. అదే ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ . దీని ధర ఐఫోన్లలో లాప్ ఎండ్ వర్షన్ ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ కన్నా చాలా ఎక్కువ. iPhone XS Max 512 జిబి ఇంటర్నల్ మెమొరీతో వచ్చింది. దీన ధర మార్కెట్లో రూ. 1,44900గా ఉంది. అలాగే కొత్తగా విడుదలైన 11 Pro Max కూడా 521జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది. దీని ధర మార్కెట్లో లక్షా 38 వేల 900 రూపాయలుగా ఉంది. ఇది ఫ్లిప్ కార్ట్ లో లభ్యమవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐఫోన్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఇలా పాత ఫోన్ ధర కొత్త ఫోన్ ధరకన్నా ఎక్కువగా ఉండటం.

ఈ కామర్స్ సేల్
 

ఈ కామర్స్ సేల్

ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ సేల్ సంధర్భంగా iPhone XS Max 512GB ధరను ఒక్కసారిగా పెంచేసింది. iPhone 11 Pro Max 512GB version ధర కన్నా దీన్ని ఎక్కువ ధరకే అమ్ముతోంది. అయితే ఈ ఫోన్లు రెండు ఇప్పుడూ అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ దర్శనమిస్తున్నాయి.

మూడు ఐఫోన్లు

మూడు ఐఫోన్లు

ఆపిల్ కంపెనీ ఈ ఏడాది మూడు ఐఫోన్లను లాంచ్ చేసింది. iPhone 11, iPhone 11 Pro and iPhone 11 Pro Max పేర్లతో వీటిని విడుద చేసింది. కొత్త ఐఫోన్లు మూడు A13 bionic chipsetతో వచ్చాయి. అలాగే మంచి సాప్ట్ వేర్ అనుభూతిని కలిగించే విధంగా వచ్చాయి. ఐఫోన్ 11 కొత్త వర్షన్లు 6.1 ఇంచ్ లిక్విడ్ రెటినీ డిస్ ప్లేతో పాటుగా అదిరిపోయే గేమింగ్ అనుభూతిని అందిస్తున్నాయి.

ధరలు

ధరలు

Apple iPhone 11 స్టార్టింగ్ ధర

64జిబి స్టోరేజ్ వేరియంట్ రూ. 64 వేలు

ఐఫోన్ 11 ప్రొ 64జిబి వేరియంట్ రూ. 99 వేలు

ఐఫోన్ 11ప్రో మ్యాక్స్ 64జిబి వేరియంట్ రూ. 1,09,900

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ 2 వేరియంట్లలో వచ్చింది. 256జిబి అలాటే 512జిబి స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతోంది. ఐఫోన్ 11 కూడా 128జిబి, 256 జిబి స్టోరేజ్ వేరింయట్లలో లభిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
This old iPhone costs more than the top-end version of more powerful' iPhone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X