భలే దిండు..

Posted By:

ఉద్యోగం ఇంకా వ్యాపార అవసరాల రిత్యా మీ ప్రేయసిని విడిచి దూరంగా ఉంటున్నారా..?, ఆ దూరం మీ రోమాన్స్‌కు భంగం వాటిల్లేలా చేస్తోందా..? మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని గిజ్‌బాట్ సూచిస్తోంది. యూకే ఆధారిత ప్రముఖ డిజైన్ షాప్ లిటల్ రయోట్ (Little Riot) సరికొత్త దిండుకు రూపకల్పన చేసింది. ఈ తలగడ మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పిల్లో టాక్ (Pillow Talk)గా పేర్కొనబడుతున్నఈ తలగడలు రెండూ కలిపి ఓ సెట్‌గా లభ్యమవుతాయి. ప్రత్యేకమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఇవి స్పందిస్తాయి. ప్రేమికులు లేదా దంపతులు ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండవలసి వచ్చిన సందర్భాల్లో ఈ దిండ్లను తమ వెంట తీసుకువెళ్లాలి.

ఏలా పనిచేస్తాయ్..?

ఈ తలగడ పై తలవాల్చి పడుకున్న వెంటనే అవతలి వ్యక్తి దగ్గర ఉన్న తలగడ వెలగడం ప్రారంభిస్తుంది. దింతో అవతలి వ్యక్తి ఈ తలగడ పై పడుకుని ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేక రిస్ట్ బ్యాండ్‌ను ధరించటం ద్వారా మీ గుండె చప్పుడు మీ భాగస్వామికి వినిపిస్తుంది. ఆలస్యమెందుకు పిల్లో టాక్ తలగడ కోసం ఆర్డర్ చేయండి మరి. పిల్లో టాక్ పనితీరును క్రింది వీడియోలో చూడొచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot