ఢిల్లీ కాలుష్యానికి విరుగుడు
దేశ రాజధాని ఢిల్లీ నగరం వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఊపిరి పీల్చుకోవాలన్నా విషతుల్యం అయ్యింది.
దేశ రాజధాని ఢిల్లీ నగరం వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఊపిరి పీల్చుకోవాలన్నా విషతుల్యం అయ్యింది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మార్గం కనుగొని ఒక జాతీయ లేబోరేటరీ తాజాగా ప్రకటించింది. అంతే కాదు పలు పబ్లిక్ ప్రదేశాలను స్వచ్ఛమైన వాయు కేంద్రాలుగా మారుస్తామని తెలిపింది. ఈ మంగళవారం ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పతనమైంది. ముఖ్యంగా ఈ సీజన్ లో చుట్టు పక్కల రాష్ట్రాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో గడ్డిని కాల్చడం వల్ల ఈ ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తిందని నిపుణులు పేర్కొంటున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని 17 ప్రాంతాలు వాయు కాలుష్యానికి...
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని 17 ప్రాంతాలు తీవ్రస్థాయిలో వాయు కాలుష్యానికి ప్రభావితం అయినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటాలో తెలిపింది. ఇందుకు సంబంధించి సేకరించిన శాంపిళ్లలో ఎరో డైనమిక్స్ ప్రకారం ధూళి కణాల పరిమాణం పీఎం1 నుంచి పీఎం2.5 వరకూ ఉన్నట్లు రిపోర్టుల్లో తెలిపింది. అయితే "క్లీన్ ఎయిర్ జోన్" టెక్నాలజీ పనితీరు సుమారు 90 శాతం మేర ఉంటుందని నేషనల్ ఫిజికల్ లేబోరేటరీ చీఫ్ సెక్రటరీ శంకర్ అగర్వాల్ తెలిపారు.

ప్రమాణాల ప్రకారం పీఎం1 పదార్థాలు....
ప్రమాణాల ప్రకారం పీఎం1 పదార్థాలు అంటే గాలిలో వాటి సైజు 1 మైక్రోమీటర్ కన్నా తక్కువ అని అర్థం. ఇక పీఎం 2.5 అంటే ధూళి కణాల పరిణామం 2.5 మైక్రోమీటర్లు ఉన్నట్లు తెలిపింది.

ఈ సరికొత్త "క్లీన్ ఎయిర్ జోన్" టెక్నాలజీని....
అయితే ప్రస్తుతం ఈ సరికొత్త "క్లీన్ ఎయిర్ జోన్" టెక్నాలజీని ఎవర్ జెన్ సిస్టమ్స్ సంస్థ రూపొందించింది. దీనిని ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా వాడుతున్నారు. అంతే కాదు ఈ "క్లీన్ ఎయిర్ జోన్" టెక్నాలజీని ఇప్పటికే పలు ఆసుపత్రులు, స్కూళ్లు, బస్ స్టాండ్స్, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఇప్పటికే "క్లీన్ ఎయిర్ జోన్" టెక్నాలజీ సంస్థతో అటు ఇతర మునిసిపల్ బాడీలకు చెందిన అధికారులు సైతం సంప్రదింపులు జరుపుతున్నారు.

ఫ్లూయిడ్ డైనమిక్స్ సూత్రాల ఆధారంగా....
"క్లీన్ ఎయిర్ జోన్" టెక్నాలజీ సాంకేతికత విషయానికి వస్తే, దీనిని పూర్తిగా ఫ్లూయిడ్ డైనమిక్స్ సూత్రాల ఆధారంగా తయారు చేశారు. ఇందులో అత్యంత ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన ఏయిర్ ఫిల్టర్లను వినియోగించారు. ఇందులో అట్మాస్ఫిరిక్ కెమిస్ట్రీ, ఎయిర్ ప్లో ఇంజినీరింగ్ సూత్రాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు.

డ్యూయల్ ప్యూరిఫయర్ సామర్థ్యంతో....
ఈ "క్లీన్ ఎయిర్ జోన్" డ్యూయల్ ప్యూరిఫయర్ సామర్థ్యంతో నానో ధూళి కణాలను కూడా అడ్డుకొని గాలిని వడపోతపడుతోంది. అయితే కాదు ప్రమాదకరమైన రసాయనిక వాయువులు అయిన ఎన్‌వోఎక్స్, ఎస్‌వోఎక్స్, సీవోటూ, ఓజోన్ వంటి వాయువులను కూడా అరికడుతుంది.


Click it and Unblock the Notifications








