సరికొత్త ఆఫర్‌తో దూసుకొచ్చిన అనిల్ అంబాని ఆర్‌కామ్
Airtel, Bsnl జియోకి పోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్న నేఫథ్యంలో ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా దూసుకొచ్చింది.
టెలికం మార్కెట్లో ఆఫర్ల హోరు మొదలైంది. జియో దెబ్బకు అన్ని టెల్కోలు భారీ డేటా ఆఫర్లను ప్రకటిస్తూపోతున్నాయి. ఈ నేపథ్యంలో Airtel, Bsnl జియోకి పోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్న నేఫథ్యంలో ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా దూసుకొచ్చింది. రూ. 193కే సరికొత్త ఆఫర్‌ని ప్రకటించింది. ప్లాన్ వివరాలపై ఓ లుక్కేయండి.

రూ. 193తో రీఛార్జ్ చేసుకుంటే..
ఆర్ కామ్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ని ప్రకటించింది.రూ. 193తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1 జిబి డేటా చొప్పున 28 రోజుల పాటు వాడుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

రోజుకి 30 నిమిషాల పాటు
దీంతో పాటు రోజుకి 30 నిమిషాల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ కమ్యూనికేషన్ తమ ట్విట్టర్ పేజీలో తెలిపింది.

రీఛార్జ్ ని పొందాలంటే
యూజర్లు ఈ రీఛార్జ్ ని పొందాలంటే రిలయన్స్ కమ్యూనికేషన్ పేజీలో లాగిన్ అయి పొందవచ్చు. మరిన్ని వివరాలకు http://recharge.rcom-eshop.com/special.php ఈ పేజీని చూడవచ్చు.

టెలికం సబ్ స్క్రైబర్లు
పీటీఐ కథనం ప్రకారం టెలికం సబ్ స్క్రైబర్లు జూన్ నెలాఖరుకి 120 కోట్లకు చేరారని తెలిపింది. ఇది కేవలం మొబైల్ యూజర్లకి సంబంధించి మాత్రమే. నెట్ అడిషన్లో 60 లక్షల మంది ఉన్నారని తెలిపింది.

నెలరోజుల వ్యవధిలో
కేవలం నెలరోజుల వ్యవధిలో టెలికం యూజర్లు భారీగా పెరిగారని ట్రాయ్ తన నివేదికలో తెలిపింది. మే నెలలో 1,204.98 million మంది ఉంటే అది జూన్ నెలకు 1,210.84 millionకు చేరారని ట్రాయ్ తెలిపింది. ఈ పెరుగుదల శాతం 0.49గా ఉంది.

టాప్ 5 ఆపరేటర్లలో మాత్రమే పెరుగుదల
మొత్తం 11 మంది టెలికం ఆపరేటర్లలో కేవలం టాప్ 5 ఆపరేటర్లలో మాత్రమే పెరుగుదల నమోదవుతోంది. Bharti Airtel, BSNL, Vodafone and Idea Cellular ఈ కంపెనీల్లో కొత్త కష్టమర్లు చేరుతున్నారని ట్రాయ్ తెలిపింది.


Click it and Unblock the Notifications








