గూగుల్ మ్యాప్స్ ద్వారా దొంగతనం చేస్తున్న హైటెక్ దొంగ, వింటే ఆశ్చర్యపోతారు

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంచితో పాటు చెడు కూడా ఎదురవుతోంది.

|

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంచితో పాటు చెడు కూడా ఎదురవుతోంది. విషయంలోకి వెళ్తే దొంగతనం చేయడానికి గూగుల్ మ్యాప్స్ కూడా ఇప్పుడు సాయం చేస్తోంది. చెన్నైలో ఓ ప్రొఫెషనల్ దొంగ గూగుల్ మ్యాప్స్ ద్వారా ధనవంతుల ఇళ్లను దోచుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న నుంగంబాక్కంకు చెందిన వైద్యుడి ఇంటిని దోచుకున్న తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.

 

రూ.20,000 ధరల్లో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే....రూ.20,000 ధరల్లో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే....

గూగుల్ మ్యాప్  ద్వారా....

గూగుల్ మ్యాప్ ద్వారా....

ఆ ప్రొపెషనల్ దొంగ గూగుల్ మ్యాప్ ద్వారా ఓ ఇల్లును ఎంచుకుంటాడు. విమానంలో అక్కడికి చేరుకుంటాడు. ఆ ఇంటిని దోచుకుని తిరుగు ప్రయాణంలో రైలెక్కుతాడు. పోలీసులకు ఎటువంటి క్లూ దొరకకుండా జాగ్రత్తపడతాడు.

దోచుకున్న తర్వాత చిన్న ఆధారం కూడా లేకుండా....

దోచుకున్న తర్వాత చిన్న ఆధారం కూడా లేకుండా....

దోచుకున్న తర్వాత చిన్న ఆధారం కూడా లేకుండా జాగ్రత్త పడే దొంగను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, చెన్నైలో ధనికులు నివసించే పలు ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలన్నీ ఒకేలా ఉండడంతో ఒకే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఇటీవల వల్లువూర్ కొట్టమ్‌లో కూడా ఇటువంటి దొంగతనాలే జరిగాయి.

 

 

హైదరాబాద్‌లో ఓ దొంగతనం కేసులో....
 

హైదరాబాద్‌లో ఓ దొంగతనం కేసులో....

ఇటీవల హైదరాబాద్‌లో ఓ దొంగతనం కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాతియా రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు. నుంగబాక్కం, వల్లువూర్ కొట్టంలో జరిగిన దొంగతనాలు కూడా తాను చేసినవేనని అంగీకరించాడు. దీంతో మరింత లోతుగా విచారించిన పోలీసులు ఈసారి విస్తుపోయే విషయాలు చెప్పాడు.

ధనికులు నివాసముండే ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్ ద్వారా...

ధనికులు నివాసముండే ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్ ద్వారా...

చెన్నైలోని ధనికులు నివాసముండే ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతుకుతానని, అనంతరం విమానంలో చెన్నై వెళ్లి ముందే టార్గెట్ చేసిన ప్రాంతానికి చేరుకుంటానని చెప్పాడు.

ధనవంతులు రోజులో ఎక్కువ సమయం బయటే గడుపుతారని....

ధనవంతులు రోజులో ఎక్కువ సమయం బయటే గడుపుతారని....

ధనవంతులు రోజులో ఎక్కువ సమయం బయటే గడుపుతారని, కాబట్టి తన పని సులభం అయ్యేదని చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, వెంట తీసుకెళ్లిన పనిముట్లతో తాళాలు తెరిచి లోపలికి ప్రవేశిస్తానని వివరించాడు.

వేలిముద్రలు పడకుండా...

వేలిముద్రలు పడకుండా...

అయితే, ఎక్కడా వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడతానని పేర్కొన్నాడు. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీ చేసినా తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడతానని తెలిపాడు. ఆ తర్వాత దోచుకున్న సొత్తుతో తన సొంతూరికి రైలులో చేరుకుంటానని దొంగ సాతియా రెడ్డి వివరించాడు.

 

 

Best Mobiles in India

English summary
Hi-tech thief used Google Maps to target posh localities in other cities, took flights to rob houses more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X