200 సంవత్సరాలు ప్రయత్నించినా తెలుసుకోలేని పాస్‌వర్డ్!

అవి బ్యాంకింగ్‌కు సంబంధించిన అన్‌లైన్ అకౌంట్‌లే కావొచ్చు, సోషల్ మీడియాకు సంబంధించిన అకౌంట్‌లే కావొచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ను వినియోగించకుంటోన్న 100 కోట్ల యూజర్లు ఆన్‌లైన్ అకౌంట్‌లను కలిగి ఉన్నారు. ఆన్‌లైన్ అకౌంట్‌లను సెక్యూర్‌గా ఉంచుకునే క్రమంలో పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకోవటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బలమైన పాస్‌వర్డ్‌ అవసరం..

మన ఆన్‌లైన్ అకౌంట్‌లకు సంబంధించి లాగిన్ ఐడీ లేదా యూజర్ నేమ్‌లు ఎలా ఉన్నా, పాస్‌వర్డ్ మాత్రం చాలా బలమైందిగా ఉండాలని సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతుంటారు. బలమైన పాస్‌వర్డ్‌ల మాట అటుంచితే ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది యూజర్లు క్రాక్ చేసేందుకు అనువైన సింపుల్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించుకుంటున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.

సులువుగా హ్యాక్ అయ్యే పాస్‌వర్డ్‌ల జాబితాలో..

పాస్‌వర్డ్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏటా అధిక సంఖ్యలో యూజర్లు వాడే అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ సంస్థలు ఏటా విడుదల చేస్తూనే ఉన్నాయి. ఏటా ఈ సంస్థలు విడుదల చేస్తున్న చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో '123456' అనే పాస్‌వర్డ్ ముందు వరసలో ఉండటం విశేషం.

అక్షరాల సంఖ్యను బట్టి..

పాస్‌వర్డ్‌లను బ్రేక్ చేసేందుకు హ్యాకర్లకు ఎంత సమయం పడుతుంది..?, అనే అంశం పై నిశిత పరిశీలన జరిపిన BetterBuys అనే వెబ్‌సైట్ ఆసక్తికర వివరాలను వెల్లడించింది. పాస్‌వర్డ్‌లో పొందుపరిచిన అక్షరాల సంఖ్యను బట్టి, దాన్ని క్రాక్ చేసే సమయం ఆధారపడి ఉంటుందని సదరు వెబ్‌సైట్ చెబుతోంది.

.29 మిల్లీసెకన్ల సమయం చాలట

ఈ వెబ్‌సైట్ చెబుతోన్న దాని ప్రకారం...  ఉదాహరణకు మీరు "abcdefg" అనే 7 అక్షరాలతో కూడిన పాస్‌వర్డ్‌ను ఎంచుకున్నారు. హ్యాకర్లకు ఇటువంటి పాస్‌వర్డ్‌ను క్రాక్ చేసేందుకు .29 మిల్లీసెకన్ల సమయం చాలట.

12 అక్షరాల పాస్‌వర్డ్ అయితే..

ఇదే సమయంలో మీరు 12 అక్షరాలతో కూడిన పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లయితే, దాన్ని క్రేక్ చేసేందుకు హ్యాకర్లకు రెండు దశాబ్ధాల కాలం పడుతుందట.

Brute force method

పాస్‌వర్డ్‌లను క్రాక్ చేసే క్రమంలో హ్యాకర్లు ఎక్కువుగా జాన్ ద రిప్పర్ వంటి టూల్స్ పై ఆధారపడుతున్నట్లు సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ సాఫ్ట్ వేరే టూల్ ఉపయోగించే "Brute force method" వివిధ పదబంధాలు, పదాలు ఇంకా అక్షరాలను ప్రయోగించే పాస్‌వర్డ్ మ్యాచ్ అయ్యేంత వరకు ప్రయత్నించగలదట.

సరికొత్త టూల్

ఈ నేపథ్యంలో పాస్‌వర్డ్ సెక్యూరిటీ పై యూజర్లకు మరింత అవగాహనను కలిగించేందుకు BetterBuys సరికొత్త టూల్‌తో ముందుకొచ్చింది. ఆ టూల్, మీరు క్రియేట్ చేసిన పాస్‌వర్డ్‌ అక్షరాల సంఖ్యను బట్టి ఎంత బలమైందో, హ్యాకర్లు బ్రేక్ చేసేందుకు ఎంత సమయం పడుతుందో కూడా ఎస్టిమేషన్ ఇవ్వగలదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This Website Shows How Long A Hacker Would Take To Crack Your Password. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting