థామ్సన్  'మేడ్ ఇన్ ఇండియా' టీవీ లు, ధర రూ.10,999 నుంచి ... 

By Maheswara
|

ఫ్రెంచ్‌ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం థాంమ్సన్‌... దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్‌ Path 9A సిరీస్, Path 9R సిరీస్‌ టీవీలను విడుదల చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ తెలియపర్చింది. భారతదేశంలో కొత్త వేరియంట్‌లను (50 మరియు 75-అంగుళాల మోడల్స్) ప్రకటించడం ద్వారా ఓత్ ప్రో టీవీ శ్రేణిని కూడా విస్తరించింది.ఈ టీవీలను గూగుల్‌తో పరీక్షించి అభివృద్ధి చేశారు మరియు 'మేక్ ఇన్ ఇండియా' సర్టిఫికేట్ కూడా పొందారు.

థామ్సన్  Path 9A,9R సిరీస్

థామ్సన్ Path 9A,9R సిరీస్

థామ్సన్ , Path 9A సిరీస్ ద్వారా HD మరియు FHD టీవీలపై దృష్టి పెడుతుంది, అయితే 9R సిరీస్ ద్వారా  4K టీవీలను విడుదల చేస్తారు. 9A సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఉన్నాయి - 32-అంగుళాల HD, 32-అంగుళాల HD bezel-less, 40-అంగుళాల FHD, మరియు 43-అంగుళాల FHD మరియు 9R సిరీస్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి - 43-అంగుళాల 4K, 50-అంగుళాల 4K, మరియు 55 -ఇంచ్ 4K. శ్రేణి లో ఈ టీవీ లు విడుదల అవుతున్నాయి.Path  9A మరియు 9R సిరీస్ లో  ఫీచర్ IPS A + ప్యానెల్, క్వాడ్-కోర్ అమ్లాజిక్ ప్రాసెసర్లు మరియు క్వాడ్-కోర్ మాలి GPU లను కలిగి ఉంటాయి. 9R టీవీలు 4K కి మద్దతు ఇస్తాయి మరియు HDR 10 తో సహా విభిన్న మైన HDR ఫార్మాట్లను అందిస్తాయి.

స్మార్ట్ టీవీ అనువర్తనాలు

స్మార్ట్ టీవీ అనువర్తనాలు

థామ్సన్ తన టీవీలకు 5000 కి పైగా స్మార్ట్ టీవీ అనువర్తనాలు మరియు గేమ్ లకు యాక్సిస్ ఉంటుందని హామీ ఇచ్చింది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ 9 తో ఆపరేట్ చేయబడతాయి. ఈ టీవీ రిమోట్ ల లో సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మరియు గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకమైన బటన్లను కలిగి ఉంటుంది.

థామ్సన్ Oath Pro సిరీస్
 

థామ్సన్ Oath Pro సిరీస్

థామ్సన్ ఓత్ ప్రో సిరీస్ యొక్క 43-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల వేరియంట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు 50 మరియు 75-అంగుళాల రెండు కొత్త మోడళ్లను జోడించింది. థామ్సన్ ఓత్ ప్రో సిరీస్ లో డాల్బీ విజన్, హెచ్‌డిఆర్ 10 మరియు హైబ్రిడ్ లాగ్-గామాకు మద్దతుతో 4K డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది MEMC కి పనిచేస్తుంది. ఆడియో పరంగా, మీరు డాల్బీ డిజిటల్ ప్లస్ ‌తో కలిపి రెండు 15W స్పీకర్లను పొందుతారు.

Path 9A, 9R, Oath pro series : ధర మరియు లభ్యత

Path 9A, 9R, Oath pro series : ధర మరియు లభ్యత

థామ్సన్ 9A సిరీస్, 9R సిరీస్ మరియు ఓత్ ప్రో సిరీస్ యొక్క కొత్త మోడల్ టీవీ లు  ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగస్టు 6 నుండి అమ్మకానికి రానున్నాయి. 32 అంగుళాల టీవీ హెచ్‌డి వెర్షన్ ధర రూ .10,999 కాగా, 32 అంగుళాల హెచ్‌డి Beezle less మోడల్ పై రూ .11,499 ఖర్చు అవుతుంది. Path 9A సిరీస్‌లోని 40 అంగుళాల FHD, 43 అంగుళాల FHD వేరియంట్లు వరుసగా రూ .16,499, రూ .19,999 కు అమ్ముడవుతాయి.

Path 9A, 9R, Oath pro series : ధర మరియు లభ్యత

Path 9A, 9R, Oath pro series : ధర మరియు లభ్యత

9R సిరీస్ లో  వస్తున్న 43 అంగుళాల 4K వేరియంట్‌కు రూ .21,999, 50 అంగుళాల 4K మోడల్ ధర రూ .25,999, 55 అంగుళాల 4K Path ధర రూ .29,999. 50 అంగుళాల థామ్సన్ Oath pro  టీవీ  ధర రూ. 28,999, 75 అంగుళాల థామ్సన్ Oath proటీవీ వేరియంట్ ధర రూ. 99.999. గా ఉన్నాయి 

Best Mobiles in India

Read more about:
English summary
Thomson Launches New Android TV lineUp,Price Starting at Rs.10,999 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X