Home
News

Thomson నుంచి బడ్జెట్ ధరకే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు

By Gizbot Bureau

ఫ్రెంచ్‌ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం థాంమ్సన్‌... దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్‌ టీవీలను విడుదల చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా పేటెంట్‌ హక్కుదారు ఎస్‌పీపీఎల్‌ సీఈఓ అవనీత్‌ సింగ్‌ మార్వా చెప్పారు. దీంతో అన్ని రకాల ఆండ్రాయిడ్‌ టీవీలను స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న తొలి బ్రాండ్‌గా నిలిచామన్నారు.43, 49, 55, 65 అంగుళాల వేరియంట్లలో ఈ టీవీలున్నాయని, వీటి ధర రూ. 29,999 నుంచి రూ. 59,999 వరకు ఉంటుందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై వీటిని విక్రయిస్తామన్నారు.

Thomson నుంచి బడ్జెట్ ధరకే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు

ఈ Android Smart TVలో ఇన్‌బిల్ట్‌ క్రోమ్‌క్యాస్ట్, డాల్బీ సౌండ్, 2.5 ర్యామ్, 16 జీబీ మెమరీ, 5000కు పైగా వివిధ ప్రీఇన్‌స్టాల్డ్‌ యాప్స్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌ప్లే కోసం హాట్‌కీస్, 4కే 10హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లేతో పాటు ఇతర ఆసక్తికర ఫీచర్లను పొందుపరిచనట్లు కంపెనీ తెలిపింది. ఈ సంధర్భంగా మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేద్దాం.

కొడాక్ ఎక్స్‌ప్రొ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు

కొడాక్ ఎక్స్‌ప్రొ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు

కొడాక్ భారత్‌లో రెండు నూతన స్మార్ట్ టీవీలను ఎక్స్‌ప్రొ సిరీస్‌లో విడుదల చేసింది. 49, 43 ఇంచుల డిస్‌ప్లే సైజులలో ఈ కొత్త టీవీలు వినియోగదారులకు లభిస్తున్నాయి. 49 ఇంచుల టీవీలో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, ఆండ్రాయిడ్ 5.1 ఓఎస్, ల్యాన్, ఏవీ, యూఎస్‌బీ, వీజీఏ, పీసీ ఆడియో, హెచ్‌డీఎంఐ పోర్టులు, 20 వాట్ల స్పీకర్లు తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక 43 ఇంచుల టీవీలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, ఆండ్రాయిడ్ 7.1 ఓఎస్, ల్యాన్, ఏవీ ఇన్, యూఎస్‌బీ, పీసీ ఆడియో ఇన్, హెచ్‌డీఎంఐ పోర్టులను అందిస్తున్నారు. కాగా 43 ఇంచుల టీవీ ధర రూ.20,999 ఉండగా, 49 ఇంచుల టీవీ ధర రూ.24,999 గా ఉంది. ఫిప్‌కార్ట్‌లో ఈ రెండు టీవీలు వినియోగదారులకు లభిస్తున్నాయి.

దైవా ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ

దైవా ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ

దేశీయ టీవీల తయారీదారు దైవా డీ32ఎస్‌బీఏఆర్ మోడల్ నంబర్ పేరిట ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో క్రికెట్ పిక్చర్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల వీక్షకులకు క్రికెట్ మ్యాచ్‌ల వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ టీవీలో 32 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా ఈ డిస్‌ప్లే 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇందులో 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, 1 ఆప్టికల్ అవుట్‌పుట్ పోర్టు, వైఫై, ల్యాన్ ఫీచర్లను అందిస్తున్నారు. కాగా దైవా డీ32ఎస్‌బీఏఆర్ టీవీని రూ.12,990 ధరకు అందిస్తున్నారు. దీన్ని దైవా అఫిషియల్ వెబ్‌సైట్‌తోపాటు పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ టీవీపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. ఇందుకు గాను వినియోగదారులు టీవీని కొనుగోలు చేశాక మై దైవా యాప్‌లో ప్రొడక్ట్‌ను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐఫాల్క‌న్ వీ2ఏ

ఐఫాల్క‌న్ వీ2ఏ

ఐఫాల్క‌న్ కంపెనీ వీ2ఏ పేరిట 4కె ఆండ్రాయిడ్ టీవీని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ టీవీ 65 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌ను క‌లిగి ఉంది. అలాగే ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా ఈ టీవీ ప‌నిచేస్తుంది. ఇందులో 64 బిట్ క్వాడ్‌కోర్ సీపీయూ, 2.5 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, గూగుల్ క్రోమ్‌క్యాస్ట్‌కు స‌పోర్ట్‌, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్‌, డాల్బీ డీటీఎస్ సౌండ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ఈ టీవీ ధ‌ర రూ.99,999 ఉండ‌గా.. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఈజీ ఈఎంఐల రూపంలోనూ ఈ టీవీని వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిల్ లేదా క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఈ టీవీని కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది.

శాంసంగ్‌ అన్‌బాక్స్‌ మ్యాజిక్‌

శాంసంగ్‌ అన్‌బాక్స్‌ మ్యాజిక్‌

శాంసంగ్‌ అన్‌బాక్స్‌ మ్యాజిక్‌ సిరీస్‌లో స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వీటిని పర్సనల్‌ కంప్యూటర్‌, మ్యూజిక్‌ సిస్టమ్‌, హోమ్‌ క్లౌడ్‌, లైవ్‌ క్యాస్ట్‌, టూ వే షేరింగ్‌ డివైస్‌ల మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. వీటిల్లో అల్ట్రాహెచ్‌డీ డిస్‌ప్లే ఉన్న టీవీలను కూడా విడుదల చేశారు. 32 ఇంచులు మొదలుకొని 82 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌ వరకు ఈ టీవీలు లభిస్తున్నాయి. రూ.24,900 ధరకు 32 ఇంచుల టీవీని కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ ఎన్‌యూ6100

శాంసంగ్ ఎన్‌యూ6100

శాంసంగ్ ఎన్‌యూ6100 సిరీస్‌లో 3 నూత‌న 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. 43, 50, 55 ఇంచుల డిస్‌ప్లే సైజ్ ఉన్న మోడ‌ల్స్‌లో ఈ టీవీలు వినియోగ‌దారుల‌కు లభిస్తున్నాయి. వీటిల్లో లైవ్ క్యాస్ట్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని స‌హాయంతో ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్నా స‌రే స్మార్ట్‌ఫోన్ ద్వారా లైవ్ వీడియోను పెడితే దాన్ని ఈ టీవీల్లో చూడ‌వ‌చ్చు. ఇక వీటిలో వైఫై, హెచ్‌డీఎంఐ, డాల్బీ డిజిట‌ల్ ప్ల‌స్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. అలాగే ఈ మూడు టీవీల్లో 4కె అల్ట్రా హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్ ల‌భిస్తున్న‌ది. కాగా 43 ఇంచుల టీవీ ధ‌ర రూ.41,990 ఉండ‌గా, 50 ఇంచుల టీవీని రూ.51,990 కి, 55 ఇంచుల మోడ‌ల్ టీవీని రూ.61,990 ధ‌ర‌కు అందిస్తున్నారు.

షియోమీ ఎల్ఈడీ టీవీ

షియోమీ ఎల్ఈడీ టీవీ

షియోమీ ఎంఐ ఎల్ఈడీ టీవీ ని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ పేరిట 32 ఇంచుల ఎల్ఈడీ టీవీని షియోమీ లాంచ్ చేసింది. ఇందులో 20 వాట్ల స్పీక‌ర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. గూగుల్ వాయిస్ సెర్చ్ ఫీచ‌ర్‌ను ఈ టీవీలో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారంగా ఈ టీవీ ప‌నిచేస్తుంది. ఇందులో 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, డీటీఎస్ వంటి ఫీచ‌ర్లు ల‌భిస్తున్నాయి. ఇక ఈ టీవీని రూ.12,999 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Thomson Launches New Range of Official Android Smart TVs in India, Prices Start at Rs. 29,999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X