Threadsలో ట్రెండింగ్ టాపిక్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం X (Twitterకు పోటీగా మోటా విడుదల చేసిన థ్రెడ్స్ యాప్.. యూజర్లకు మరింత చేరువయ్యేందుకు కీలక ఫీచర్లను విడుదల చేస్తోంది. తాజాగా ఈ టెస్ట్ ఆధారిత ప్లాట్‌ఫాం ట్రెండింగ్ టాపిక్ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.
ఈ ఫీచర్ ట్విట్టర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ట్రెండింగ్ టాపిక్ ఫీచర్ (Threads App Trending Topics Feature) ద్వారా ట్విట్టర్‌కు గట్టిపోటీ ఇస్తుందని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌పై మెటా, థ్రెడ్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మెటా సిబ్బంది పొరపాటున ఈ ఫీచర్ గురించి లీక్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ట్రెండింగ్ టాపిక్ ఫీచర్ నంబర్ ఫార్మాట్‌లో కనిపించనుంది. సెర్చ్ ఆప్షన్ వద్ద ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన ఓ థ్రెడ్స్ పోస్టు వైరల్ అవుతోంది. అయితే అదే తరహా వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందా లేదా అనేది తెలియలేదు.
మెటా నేతృత్వంలోని థ్రెడ్స్ ఈ ఫీచర్‌ను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానుందని సమాచారం. అయితే ఎప్పటికి రానుందనే సమాచారం వెల్లడి కాలేదు. X (ట్విట్టర్) ట్రెండింగ్ ఫీచర్‌ను ఇప్పటికే కలిగి ఉంది. హ్యాష్‌ట్యాగ్‌లు, కీవర్డ్ వినియోగించి సెర్చ్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచి థ్రెడ్స్ యూప్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ట్విట్టర్‌లో తీసుకొచ్చిన భారీ మార్పులను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు మెటా థ్రెడ్స్ యాప్‌ను లాంచ్ చేసింది. తొలివారంలోనే సుమారు 100 మిలియన్‌ల సైన్‌అప్‌లను నమోదు చేసింది. గతంలో వచ్చిన యాప్‌ల కంటే అతి తక్కువ కాలంలో ఆదరణ పొందింది. థ్రెడ్స్ యాప్ అతి తక్కువ కాలంలోనే ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు భావించారు.
అయితే అంచనాలకు భిన్నంగా థ్రెడ్స్ యాప్ రోజువారీ వినియోగదారుల సంఖ్యను భారీగా కోల్పోయింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలకు దిగింది. యాప్‌లో యూజర్లను ఆకర్షించే విధంగా కీలక అప్‌డేట్లు, ఫీచర్లను విడుదల చేస్తోంది. త్వరలో ట్రెండింగ్ టాపిక్ ఫీచర్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
థ్రెడ్స్ యాప్‌లో ప్రత్యేకంగా లాగిన్ కావాల్సిన అవసరం లేకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఖాతా తెరిచే అవకాశం కల్పించింది. థ్రెడ్ ఖాతాను తొలగించేందుకు చాలామంది యూజర్ల ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే థ్రెడ్స్ ఖాతాను డిలీట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా డిలీట్ కానుందని తెలిసి వెనక్కి తగ్గారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రస్తుతం థెడ్స్ పనిచేస్తుందని తెలుస్తోంది, డిసెంబర్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








