6 లక్షల వీడియోలు డిలీట్, ఎక్కడ, ఎప్పుడు తెలుసుకోండి

వచ్చిన తక్కువ కాలంలో సోషల్ మీడియాను ఊపేసిన పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ ఏదైనా ఉందంటే అది Tik Tok మాత్రమే. యువకులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ యాప్ అంతే స్థాయిలో ఓ ఊపు ఊపింది. అంతలా పాపులారిటీని సంప

|

వచ్చిన తక్కువ కాలంలో సోషల్ మీడియాను ఊపేసిన పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ ఏదైనా ఉందంటే అది Tik Tok మాత్రమే. యువకులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ యాప్ అంతే స్థాయిలో ఓ ఊపు ఊపింది. అంతలా పాపులారిటీని సంపాదించుకున్న ఈ యాప్ అదే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఏకంగా టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది.

 
6 లక్షల వీడియోలు డిలీట్, ఎక్కడ, ఎప్పుడు తెలుసుకోండి

టిక్ టాక్ వీడియోల్లో పెరిగిన అశ్లీలత, బూతు కంటెంట్ అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామాలతో బిత్తరపోయిన టిక్ టాక్ యాజమాన్యం ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది.

60లక్షల వీడియోలను

60లక్షల వీడియోలను

ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ 60లక్షల వీడియోలను డిలీట్ చేసింది. భారత ప్రభుత్వం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా వీడియోలను డిలీట్ చేశామని టిక్ టాక్ చెప్పింది. 2018 జూలై నుంచి ఇప్పటివరకు ఉన్న వీడియోలను తొలగించామంది.

ఏజ్ లిమిట్

ఏజ్ లిమిట్

టిక్ టిక్ యూజర్ల భద్రత, సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతేకాదు ఏజ్ లిమిట్ కూడా ఫిక్స్ చేసింది. ఇకపై 13ఏళ్లు పైబడిన వారికే టిక్ టాక్ అకౌంట్ ఇస్తారు. 13ఏళ్ల లోపు పిల్లలు టిక్ టాక్ లోకి లాగిన్ అవ్వలేరు.

టిక్ టాక్ సేఫ్టీ సెంటర్
 

టిక్ టాక్ సేఫ్టీ సెంటర్

దీని కోసం టిక్ టాక్ సేఫ్టీ సెంటర్ కూడా ఓపెన్ చేసింది. హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, తమిల్, కన్నడ, మలయాళీ, ఒరియా భాషల్లో దీన్ని తీసుకొచ్చారు. ఈ యాప్‌కు ఇండియాలో 6కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నారు.

మద్రాసు హైకోర్టు

మద్రాసు హైకోర్టు

టిక్ టాక్ యాప్‌ను బ్యాన్‌ చేయాలని మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. దీనిపై చర్చలు జరగుతున్నాయి. చైనాకు చెందిన ఈ వీడియో యాప్.. పిల్ల‌ల్లో అశ్లీల ప్ర‌వృత్తిని పెంచుతోంద‌ని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

టిక్ టాక్ ను బ్యాన్ చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం కోర్టుని ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారిస్తున్న మద్రాసు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టిక్‌ టాక్ యాప్‌ పిల్లలపై ప్రభావం చూపుతోందని చెప్పింది.

 

మీడియాకు కోర్టు ఆదేశాలు

మీడియాకు కోర్టు ఆదేశాలు

టిక్ టాక్ లో ఉన్న వీడియోల‌ను వాడొద్దని మీడియాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టిక్‌ టాక్ యాప్‌పై మ‌ద్రాసు హైకోర్టులోని మ‌ధురై బెంచ్ కేసును ప‌రిశీలిస్తోంది. టిక్‌ టాక్ వాడుతున్న పిల్ల‌లు.. లైంగిక వేధింపుల‌కు గుర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కోర్టు చెప్పింది.

Best Mobiles in India

English summary
Tik Tok removes over six million videos in India due to violation of its community guidelines

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X