టికోనా హైస్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్!

By Prashanth
|
టికోనా హైస్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్!


హైదరాబాద్: ఇంటర్నెట్ ప్రొవైడర్ టికోనా ఆంధ్రప్రదేశ్ యూజర్ల కోసం సరికొత్త ‘అన్‌లిమిటెడ్ యూసేజ్ మంత్లీ సూపర్ సేవర్ ప్లాన్’ను ఆఫర్ చేస్తోంది. హై స్పీడ్ ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్, అన్‌లిమిటెడ్ యూసేజ్, తక్కువ టారిఫ్‌లను కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్యాకేజీ కింద 4 ఎంబీపీఎస్ స్పీడ్‌లో అన్‌లిమిటెడ్ యూసేజ్‌ను రూ.1249లకే పొందవచ్చు (వ్యాలిడిటీ 30 రోజులు). ఆరు నెలల చెల్లింపు సదుపాయాన్ని ఎంచుకుంటే, ఇన్‌స్టలేషన్ ఉచితంగా, వార్షిక చెల్లింపు సదుపాయాన్ని ఎంచుకుంటే రుసుముపై 7% తగ్గింపు పొందవచ్చని టికొనా సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హేరంబ్ రణడే తెలిపారు.

 

3జీ టారిఫ్ ధరలను 80శాతం తగ్తించిన వొడాఫోన్:

ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్ వొడాఫోన్ తమ పరధిలోని 3జీ టారిఫ్ ధరలను 80శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దింతో 3జీ టారిఫ్‌లను తగ్గించిన నాలుగో కంపెనీగా వొడాఫోన్ గుర్తింపుపొందింది. ఇప్పటికే ఈ టారిఫ్‌లను తగ్గించిన కంపెనీల జాబితాలో భారతి ఎయిర్‌టెల్, ఐడియా, ఆర్‌కామ్‌లు ఉన్నాయి. తమ కంపెనీ 3జీ టారిఫ్‌లు రూ.25 నుంచి ప్రారంభమవుతాయని వొడాఫోన్ పేర్కొంది. రూ.25కు 25 ఎంబీ యూసేజిని, రూ.1,599కు 12 జీబీ డేటా యూసేజిని అందిస్తామని పేర్కొంది. ప్రి-పెయిడ్ కస్టమర్ల కోసం పే-యాజ్-యూ-గో స్కీమ్ కింద 10 కేబీ డేటాను 2 పైసలకే అందిస్తామని వివరించింది. రోమింగ్‌కు, డేటా యూసేజ్‌కు ఎలాంటి అదనపు చార్జీలుండవని వొడాఫోన్ విభాగం తెలిపింది

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X