TikTok పిచ్చితో ప్రాణాలు తీసుకున్నాడు, పూర్తి వివరాలు చదవండి...

|

ఇండియాలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా అందరు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. ఇంటి వద్ద ఉన్న యువతలలో ఎక్కువ మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్లలో కాలం గడుపుతున్నారు. ఇందులో మరి ముఖ్యంగా ఎక్కువ మంది తమ తమ వీడియోలను తయారు చేసి టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో షేర్ చేస్తున్నారు. ఇటువంటి సరదా పని ఒక యువకుడిని తన ప్రాణాలను తీసుకునేలా చేసింది.

సోషల్ మీడియా

సోషల్ మీడియా

వివరాలలోకి వెళితే నోయిడా ప్రాంతంలోని సెక్టార్ 39 పోలీసు పరిధిలోకి వచ్చే 18 ఏళ్ల వ్యక్తి తన ఇంటి వద్ద ప్రాణాలు తీసుకున్నాడు. అతని మరణానికి గల కారణం తెలుసుకొని అందరూ నివ్వెరపోయారు. సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన కంటెంట్‌పై తగినంత లైక్‌లు పొందడంలో విఫలమైనందున ఇంతకు తెగించాడు అని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

 

 

Google Next Hub స్మార్ట్ డిస్‌ప్లేలో వీడియో కాల్స్ చేయడం ఎలా?Google Next Hub స్మార్ట్ డిస్‌ప్లేలో వీడియో కాల్స్ చేయడం ఎలా?

పోలీసు అధికారుల కథనం

పోలీసు అధికారుల కథనం

పోలీసు అధికారుల కథనం ప్రకారం యువకుడు నోయిడాలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ తన తండ్రితో కలిసి సెక్టార్ 39 పరిధిలో నివసిస్తున్నాడు. టిక్‌టాక్‌లో ఎప్పుడు తన వీడియోలను పంచుకొనే యువకుడు ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉండి టిక్‌టాక్‌లో తాను చేసిన వీడియోలను షేర్ చేసాడు. "గత కొన్ని రోజులుగా తన వీడియోలకు తగినంత లైక్ లు రావడం లేదు అని అతను తన తండ్రితో పంచుకున్నాడు "అని సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) శైలేష్ తోమర్ అన్నారు.

 ప్రాథమిక దర్యాప్తు

ప్రాథమిక దర్యాప్తు

తన కుమారుడు తమ ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడని తండ్రి నుండి సాయంత్రం పోలీసు అధికారులకు కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. "ఒక బృందాన్ని అక్కడికి తరలించి మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. అతను ఆత్మహత్య చేసుకున్న చోట ఎటువంటి లెటర్ లేదు. ప్రాథమిక దర్యాప్తులో మరణానికి గల కారణం సోషల్ మీడియాలో తక్కువ లైక్‌లను పొందడం అని తేలింది. అతని తండ్రి ప్రస్తుతం మరిన్ని వివరాలు చెప్పే పరిస్థితిలో లేరు అని SHO తెలిపింది.

 

 

శవపరీక్ష

పోలీసు అధికారులు కొద్దిమంది పొరుగువారిని విచారించక తెలిసిన విషయాల ప్రకారం అతను గత కొన్ని రోజులుగా తన వీడియోలకు తగినంత లైకులు రావట్లేదని కలత చెందినట్లు ధృవీకరించారు. శవపరీక్ష తరువాత బాధితుడి మృతదేహాన్ని తండ్రికి అప్పగించారు. అతని మృతదేహాన్ని పొందడానికి పోలీసుల బృందం అతడి యొక్క ఇంటి తలుపులను పగలగొట్టాల్సి వచ్చింది. కుటుంబంలోని వారు మరియు పొరుగువారు చెప్పినదాని నుండి గత కొన్ని రోజులుగా అతని వీడియోలకు తగినంత లైక్‌లు రాకపోవడంతో అతను నిరాశకు గురయ్యాడని తెలుస్తోంది. అక్కడి నుండే ఆత్మహత్య నోటును స్వాధీనం చేసుకోకపోయినా అతను ఇంత తీవ్రమైన చర్య తీసుకున్నాడు. ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోంది "అని జోన్ 1 అదనపు డిప్యూటీ కమిషనర్ కుమార్ రణ్విజయ్ సింగ్ అన్నారు.

Best Mobiles in India

English summary
TikTok Addiction Kills a Man For not Getting Enough Likes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X