టిక్‌టాక్ తో సహా 59 చైనా యాప్ లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం...

|

ఇండియాలో టిక్‌టాక్,షేర్‌ఇట్, UCబ్రౌజర్ వంటి చైనా యాప్ ల వినియోగం ఎక్కువగా ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఇండియాలో వీటిని వాడకూడదు అని ప్రభుత్వం బ్యాన్ చేసింది.

చైనా యాప్ ల నిషేధం

చైనా యాప్ ల నిషేధం

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ యొక్క సెక్షన్ 69A కింద పబ్లిక్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ని అడ్డుకోవటానికి మరియు ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డ్స్ నిబంధనల స్వభావం దృష్ట్యా చైనా యొక్క 59 యాప్ లను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రత, రక్షణ, రాష్ట్ర భద్రత మరియు ప్రజాసంక్షేమం కోసం నిమగ్నమై బ్యాన్ చేసిన యాప్ ల వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియా డిజిటల్ మార్కెట్

ఇండియా డిజిటల్ మార్కెట్

గత కొన్ని సంవత్సరాలుగా సాంకేతిక పురోగతిని అధికంగా సాధిస్తూ డిజిటల్ రంగంలో ప్రాధమిక మార్కెట్ గా యొక్క ప్రముఖ ఆవిష్కర్తగా ఇండియా అవతరించింది. అదే సమయంలో 130 కోట్ల మంది భారతీయ ప్రజల యొక్క డేటా భద్రతకు సంబంధించిన అంశాలు మరియు గోప్యతను కాపాడటం వంటి అంశాలపై తీవ్ర ఆందోళనలు కూడా పెరిగాయి. ఇలాంటి ఆందోళనలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని ఇటీవల గుర్తించబడింది. శత్రుదేశాలు ఈ సర్వర్ల ద్వారా వినియోగదారుల యొక్క డేటాను అనధికారికంగా దొంగిలించడం కోసం ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే మొబైల్ యాప్ లను దుర్వినియోగం చేస్తున్నట్లు పలు నివేదికలలో సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదులు చేసింది. ఇటువంటి ఫిర్యాదుల దృష్ట్యా ప్రస్తుతం ఈ యాప్ లను డెలీట్ చేయాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది.

భారత సైబర్ క్రైమ్

భారత సైబర్ క్రైమ్

హానికరమైన యాప్ లను నిరోధించడానికి భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమగ్ర సిఫార్సును పంపింది. డేటా యొక్క భద్రత మరియు గోప్యతకు సంబందించిన ప్రమాదం గురించి పౌరుల నుండి ఆందోళనలను మంత్రిత్వ శాఖ అందుకుంది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డేటా భద్రత మరియు పబ్లిక్ ఆర్డర్ సమస్యలపై ప్రభావం చూపే గోప్యతా ఉల్లంఘన గురించి పౌరుల నుండి అనేక ప్రాతినిధ్యాలను పొందింది. అదేవిధంగా భారత పార్లమెంటులో కూడా వివిధ ప్రజా ప్రతినిధులు వీటి మీద ఆందోళనలు కూడా చేసారు. భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి మరియు పౌరుల గోప్యతకు హాని కలిగించే యాప్ లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలలో బలమైన కోరస్ కూడా ఉంది.

తొలగించవలసిన చైనీస్ యాప్ ల వివరాలు

తొలగించవలసిన చైనీస్ యాప్ ల వివరాలు

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు తొలగించవలసిన చైనీస్ యాప్ ల వివరాలు వరుసగా ఈ క్రింద ఇవ్వబడ్డాయి. టిక్‌టాక్, వాల్ట్-హైడ్, విగో వీడియో, బిగో లైవ్, వీబో, వీచాట్, షేర్‌ఇట్, UC న్యూస్, UCబ్రౌజర్, బ్యూటీప్లస్, జెండర్, క్లబ్‌ఫ్యాక్టరీ, హెలో యాప్, లైక్, క్వాయ్, రోమ్‌వే, షీన్, న్యూస్‌డాగ్, ఫోటో వండర్, APUS బ్రౌజర్, VivaVideo-QU వీడియో ఇంక్, పర్ఫెక్ట్ కార్ప్, CM బ్రౌజర్ మరియు వైరస్ క్లీనర్ (హాయ్ సెక్యూరిటీ ల్యాబ్). ఈ యాప్ లను వెంటనే మీ యొక్క ఫోన్ లలో వాడుతుంటే కనుక వెంటనే డెలిట్ చేయవలసిందిగా ప్రజలను ప్రభుత్వం కోరింది.

చైనా యాప్- ప్రైవేట్ డేటా

చైనా యాప్- ప్రైవేట్ డేటా

చైనా యొక్క యాప్ లు కొన్ని పెద్ద మొత్తంలో ప్రజల యొక్క ప్రైవేట్ డేటాను సేకరిస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. ఇటువంటి యాప్ ల జాబితాలో దేశంలో చాలా మంది ప్రజలు ఉపయోగించే కొన్ని ప్రసిద్ధి చెందిన యాప్ లు ఉండడం గమనార్హం. ఈ చైనీస్ యాప్ లలో టిక్‌టాక్, షేర్‌ఇట్, UC బ్రౌజర్, జెండర్ మరియు క్లీన్ మాస్టర్ వంటివి కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
TikTok and Other 59 Chinese Apps Banned in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X