టిక్‌టాక్ పూర్తి డేటాను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

ఇండియాలో ఒక రోజు ముందు వరకు కూడా టిక్‌టాక్ యాప్ ను ఎక్కువ మంది వాడేవారు. ప్రముఖ చైనా సంస్థ టిక్‌టాక్ ను గత ఏడాది విడుదల చేసింది. ఇది విడుదల అయినప్పుడు యూట్యూబ్ వంటి వాటిని కూడా వెనుకకు నెట్టి అధిక డౌన్ లోడ్ లను సాధించిన వాటిలో మొదటి స్థానంలో నిలిచింది. టిక్‌టాక్ సహాయంతో సామాన్యులు సైతం బాగా పాపులర్ అయ్యారు.

టిక్‌టాక్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం

టిక్‌టాక్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం

ప్రజల యొక్క గోప్యత దృష్ట్యా టిక్‌టాక్ తో సహా మరో 58 చైనా యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించింది. ప్రస్తుతం టిక్‌టాక్ యాప్ భారతదేశంలోని యాప్ స్టోర్స్‌లో కూడా అందుబాటులో లేదు. దీనిని ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసిన వ్యక్తులు ఇప్పటికీ చేయగలరు కాని ఇందులో ఎటువంటి వీడియోలను అప్ లోడ్ చేయడం కుదరదు. ఇప్పటి వరకు మీరు అప్‌లోడ్ చేసిన అన్ని వీడియోలను డౌన్‌లోడ్ చేయాలని మీరు అనుకుంటే కనుక మీ మొత్తం డేటాను కొన్ని దశలలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: TikTok Videoలను వాటర్‌మార్క్ లేకుండా డౌన్‌లోడ్ చేయడం ఎలా?Also Read: TikTok Videoలను వాటర్‌మార్క్ లేకుండా డౌన్‌లోడ్ చేయడం ఎలా?

టిక్‌టాక్ డేటాను డౌన్‌లోడ్ చేసే పద్ధతులు

టిక్‌టాక్ డేటాను డౌన్‌లోడ్ చేసే పద్ధతులు

టిక్‌టాక్ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఇందులో మొదటి పద్ధతి మాన్యువల్ పద్ధతి. ఇందులో భాగంగా మీరు ప్రతి వీడియోను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. టిక్‌టాక్ నుండి మీ డేటాను నేరుగా కూడా పొందవచ్చు.

 

టిక్‌టాక్ డేటాను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేయడం

టిక్‌టాక్ డేటాను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేయడం

1. మీ ఫోన్‌లో టిక్‌టాక్ యాప్ ను ఓపెన్ చేసి మీ ప్రొఫైల్‌లోకి వెళ్లండి.

2. తరువాత ఏదైనా వీడియోను ఓపెన్ చేయండి> మూడు-చుక్కల చిహ్నాన్ని నొక్కండి> సేవ్ వీడియో ఎంపికను నొక్కండి.

3.ఇలా చేస్తే నిర్దిష్ట టిక్‌టాక్ వీడియో మీ యొక్క ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయబడుతుంది.

4. ఇతర వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి కూడా మీరు అదే దశలను అనుసరించవచ్చు.

 

టిక్‌టాక్ నుంచి డేటాను అభ్యర్థించడం

టిక్‌టాక్ నుంచి డేటాను అభ్యర్థించడం

టిక్‌టాక్ నుండి నేరుగా మీ డేటాను అభ్యర్థించడం ద్వారా కూడా మీరు పూర్తి డేటాను పొందవచ్చు. అభ్యర్థన ప్రాసెస్ చేయబడిన తర్వాత మీరు మీ మొత్తం డేటాను యాప్ లోనే ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


1. మీ ఫోన్‌లో టిక్‌టాక్ యాప్ ను ఓపెన్ చేసి కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు-చుక్కల చిహ్నాన్ని నొక్కండి.

2. ప్రైవసీ మరియు సేఫ్టీ ఎంపికను నొక్కండి> పర్సనలైజేషన్ మరియు డేటాను నొక్కండి> డౌన్‌లోడ్ యువర్ డేటా ఎంపికను నొక్కండి.

3. తదుపరి స్క్రీన్‌లో మీరు అభ్యర్థన డేటా ఫైల్‌ను నొక్కాలి. ఈ బటన్‌ను నొక్కితే మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి టిక్‌టాక్‌కు అభ్యర్థన పంపుతుంది. మీ అభ్యర్థన ప్రాసెస్ కావడానికి 30 రోజుల సమయం పట్టవచ్చు.

 

టిక్‌టాక్ డేటా డౌన్‌లోడ్

టిక్‌టాక్ డేటా డౌన్‌లోడ్

4. మీ డౌన్‌లోడ్ సిద్ధంగా ఉంటే మీరు మాన్యువల్‌గా యాప్ ను తనిఖీ చేయాలి. దీని తర్వాత మీరు డౌన్‌లోడ్ డేటా టాబ్‌కు వెళ్లాలి> అక్కడ మీరు అభ్యర్థించిన డేటా కోసం డౌన్‌లోడ్ బటన్‌ను నొక్కాలి.

5. అభ్యర్థించిన డేటా ఫైల్ కేవలం నాలుగు రోజుల వరకు మాత్రమే డౌన్‌లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇచ్చిన వ్యవధిలో మీరు డౌన్‌లోడ్ చేయకపోతే కనుక మళ్ళి డేటా కోసం అభ్యర్థించవలసి ఉంటుంది.

 

Best Mobiles in India

English summary
TikTok Banned: How to Download All Your Data From TikTok App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X