బ్యాన్ చేసినా ఆగని టిక్ టాక్ డౌన్‌లోడ్స్, ఎంత పిచ్చి అంటే..

యూత్‌ను ఈ మధ్యకాలంలో విపరీతంగా అట్రాక్ట్ చేసిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది టిక్‌ టాక్ యాప్ మాత్రమే. ఈ యాప్ దుర్వినియోగం అవుతోందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో కోర్టులు సైతం ఈ అంశంపై స్పందిం

|

యూత్‌ను ఈ మధ్యకాలంలో విపరీతంగా అట్రాక్ట్ చేసిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది టిక్‌ టాక్ యాప్ మాత్రమే. ఈ యాప్ దుర్వినియోగం అవుతోందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో కోర్టులు సైతం ఈ అంశంపై స్పందించాయి. తాజాగా సుప్రీంకోర్టు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్‌ను తొలగించాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఈ రెండు కంపెనీలు ఈ యాప్ ను తమ ప్లే స్టోర్ నుండి తొలగించాయి.

 
బ్యాన్ చేసినా ఆగని టిక్ టాక్ డౌన్‌లోడ్స్, ఎంత పిచ్చి అంటే..

అయితే కోర్టు నిర్ణయంతో టిక్ టాక్ భూతం పూర్తిగా వదిలిందనుకుంటే అది ఇంకా పతాక స్థాయికి చేరింది. ఇండియాలో ఈ యాప్ బ్యాన్ అయినా APKMirror ఫైల్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు.

APKMirror ద్వారా...

APKMirror ద్వారా...

APKMirror ఫౌండర్ Artem Russakovskii అభిప్రాయం ప్రకారం టిక్ టాక్ యాప్ బ్యాన్ చేసినా సమారుగా 10 నుంచి 15 సార్లు డౌన్లోడ్స్ పెరిగాయని తెలిపారు. ఈ డౌన్లోడ్స్ ప్రభావం ఇండియాలో చాలా ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కాగా APKMirror అనేది గూగుల్ ప్లే స్టోర్ తో సంబంధం లేకుండా డౌన్లోడ్ చేసుకునే పాపులర్ వెబ్ సైట్..

5 టైమ్స్ పెరుగుదల

5 టైమ్స్ పెరుగుదల

టిక్ టాక్ యాప్ ద్వారా మా వెబ్ ట్రాఫిక్ సుమారుగా 5 టైమ్స్ పెరుగుదల నమోదయిందని ఆయన అన్నారు. 16 ఏప్రిల్ న ఈ యాప్ ఇండియాలో బ్యాన్ చేశారు. 17 నుంచి APKMirror ద్వారా దీని డౌన్లోడ్స్ పెరిగాయని అప్పటి నుండి దీని ట్రాఫిక్ పెరుగుతూనే ఉందని ఆయన తెలిపారు.

12కోట్ల స్మార్ట్ ఫోన్లలో..
 

12కోట్ల స్మార్ట్ ఫోన్లలో..

గూగుల్, యాపిల్ స్టోర్లలో అందుబాటులో లేకపోయినా టిక్ టాక్ భూతం ఇప్పటికీ 12కోట్ల స్మార్ట్ ఫోన్లలో భద్రంగా ఉంది. తమకు భారత్‌లో 120 మిలియన్‌ల యూజర్లు ఉన్నట్లు టిక్ టాక్‌ను రూపొందించిన బైటెడెన్స్ టెక్నాలజీ ప్రకటించింది.

షేర్ ఇట్ తదితర యాప్‌ల ద్వారా ..

షేర్ ఇట్ తదితర యాప్‌ల ద్వారా ..

సుప్రీం ఆదేశాల మేరకు టిక్ టాక్‌ ప్రస్తుతం యాప్ స్టోర్‌లో అందుబాటులో లేకపోయినా ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్‌ను వాడుకోవచ్చు. అంతేకాక ఏపీకే ఫైల్ రూపంలో షేర్ ఇట్ తదితర యాప్‌ల ద్వారా వాటిని షేర్ చేసుకునే అవాకాశముంది. మరి అలాంటప్పుడు స్టోర్ నుంచి తొలగించినంత మాత్రన కలిగే ప్రయోజనం ఏమీలేదన్నది నిపుణుల అభిప్రాయం.

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ..

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ..

సుప్రీం ఆదేశాలపై బైటెడెన్స్ కంపెనీ స్పందించింది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న 12 కోట్ల టిక్‌ టాక్‌ యూజర్లుకు సేవలు కొనసాగిస్తామని చెప్పింది. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. యాప్ టర్మ్స్ అండ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వని 60 లక్షల వీడియోలను ఇప్పటి వరకు తొలగించినట్లు బైటెడెన్స్ స్పష్టం చేసింది.

Best Mobiles in India

English summary
TikTok downloads on APKMirror surge 12 times since India ban

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X