టిక్‌టాక్‌కు భారీ ఫైన్ వేయడానికి గల కారణాలు ఏంటో తెలుసా ?

By Gizbot Bureau
|

సోషల్ మీడియాలో ప్రస్తుతం చైనా యాప్ టిక్‌టాక్ వీడియోలు ట్రెండింగ్‌లో వుంటున్నాయి. చాలామంది తమ టాలెంటును ప్రదర్శించుకోవడానికి ఇదొక మంచి వేదిక అని భావిస్తూ ఈ యాప్‌కు అనతికాలంలోనే బాగా అడిక్ట్ అయిపోయారు. కాగా, ఈ యాప్‌పై పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత ఎదురవుతోంది.

tiktok is being investigated in the u.k for how it handles childrens data and safety

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో ఈ యాప్‌ను బహిష్కరించాలని అక్కడి మంత్రివర్గం డిమాండ్ చేసింది. తమిళ సంస్కృతిని టిక్‌టాక్ నాశనం చేస్తోందని వారు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా టిక్‌టాక్ యాప్‌కు అగ్రరాజ్యం అమెరికా కూడా గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఏకంగా రూ.40.6 కోట్ల జరిమానా విధించింది.

రూ.40.6 కోట్ల జరిమానా

రూ.40.6 కోట్ల జరిమానా

13 ఏళ్లలోపు చిన్నారుల వ్యక్తిగత వివరాలను(పేర్లు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు) బహిర్గతం చేయడం ద్వారా టిక్‌టాక్ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని అమెరికాకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పేర్కొంది. పదమూడేళ్ల లోపు చిన్నారుల డేటాను అక్రమంగా సేకరిస్తోందన్న కారణంగా టిక్‌టాక్‌ యాజమాన్యానికి ఫెడరల్‌ ట్రేడ్‌ ‍కమిషన్(FTC)‌ 5.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది.

 పదమూడేళ్ల లోపు చిన్నారుల..

పదమూడేళ్ల లోపు చిన్నారుల..

తల్లిదండ్రుల అనుమతి లేకుండా పదమూడేళ్ల లోపు చిన్నారుల ఫొటోలు, పేర్లు తదితర వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచడం ద్వారా టిక్‌టాక్‌ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఎఫ్‌టీసీ. ‘అమెరికాలో దాదాపు 65 మిలియన్ల మంది టిక్‌టాక్‌ యూజర్లు ఉన్నారు.

మ్యూజికల్‌.ఎల్‌వై (Musical.ly) అనే కంపెనీతో ఒప్పందం
 

మ్యూజికల్‌.ఎల్‌వై (Musical.ly) అనే కంపెనీతో ఒప్పందం

దీనిపై టిక్‌టాక్ స్పందిస్తూ.. తాము నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని స్పష్టం చేసింది. 13 ఏళ్లలోపు పిల్లలకు పూర్తి యాక్సెస్ కల్పించలేదనీ, యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. కాగా, అమెరికా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన టిక్‌టాక్ యాప్ మ్యూజికల్‌.ఎల్‌వై (Musical.ly) అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, అమెరికాలో అండ్రాయిడ్ మార్కెట్‌లో నాలుగో స్థానం, ఐవోఎస్ ప్లాట్ ఫామ్‌లో 25వ స్థానంలో వుంది.

మూజికల్ డాట్ లీ పేరుతో..

మూజికల్ డాట్ లీ పేరుతో..

ఒకప్పుడు మూజికల్ డాట్ లీ పేరుతో ఉన్న టిక్ టాక్... ఆ సమయంలో ఈ యాప్‌ను చాలామంది పిల్లలు వినియోగిస్తున్నారన్న విషయం గ్రహించి పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు అంటే... వారి పేర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారంను తల్లిదండ్రుల అనుమతులు లేకుండా పొందుపరుస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్ టాక్ పై భారీ జరిమానా విధించడంతో ఇతర ఆన్‌లైన్ సర్వీసులు కూడా అలర్ట్ అవుతాయని ఇది ఒక హెచ్చరికలా ఉండాలని అధికారులు వెల్లడించారు.

 బైట్ డాన్స్ కంపెనీ

బైట్ డాన్స్ కంపెనీ

ఇక గతేడాది టిక్‌టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ యూజర్లు ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. చైనాకు చెందిన బైట్ డాన్స్ కంపెనీ ఈ యాప్‌ను కొనుగోలు చేసింది. అమెరికాలో మ్యూజికల్ డాట్ లీ యాప్‌తో ఇది విలీనం అయ్యింది. ఇక ఈ యాప్‌లో ఈమెయిల్, ఫోన్ నెంబర్, యూజర్ నేమ్ లాంటి కనీస సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలా 65 మిలియన్ అకౌంట్లు అధికారికంగా రిజిస్టర్ అయ్యాయి. అయితే ఇందులో చాలా మంది 13 ఏళ్ల లోపు ఉన్నవారే అని అధికారులు ధృవీకరించారు. దీంతో ఆ సంస్థ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
tiktok is being investigated in the u.k for how it handles children's data and safety

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X