టిక్‌టాక్‌ను షేర్ చేయండి, లక్షరూపాయలు సొంతం చేసుకోండి

చైనాకు చెందిన ‘టిక్‌టాక్‌’ వీడియో యాప్‌ను ఇటివల భారత్‌లో గూగుల్‌, ఆపిల్‌ యాప్‌స్టార్లలో నుండి తీసేయాలని ఆ సంస్థలకు కేంద్ర ప్రభ్తుత్వం లేఖలు రాసిన విషయ తెలిసిందే. అయితే ఈ యాప్‌ మళ్లీ భారత్‌లో గూగుల్‌,

|

చైనాకు చెందిన 'టిక్‌టాక్‌’ వీడియో యాప్‌ను ఇటివల భారత్‌లో గూగుల్‌, ఆపిల్‌ యాప్‌స్టార్లలో నుండి తీసేయాలని ఆ సంస్థలకు కేంద్ర ప్రభ్తుత్వం లేఖలు రాసిన విషయ తెలిసిందే. అయితే ఈ యాప్‌ మళ్లీ భారత్‌లో గూగుల్‌, ఆపిల్‌ యాప్‌ స్టార్లలో లభ్యమవుతుంది. ఆ యాప్‌పై ఉన్న నిషేధాన్ని కొన్ని షరతులతో మద్రాసు హైకోర్టు ఇటీవల ఎత్తేసింది. నిషేధం ఎత్తేసిన దాదాపు వారం రోజుల తర్వాత యాప్‌ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. తమ క్రియేటివిటీని బయటపెడుతూ యూజర్లు టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు.

టిక్‌టాక్‌ను షేర్ చేయండి, లక్షరూపాయలు సొంతం చేసుకోండి

భారత యూజర్లకు మరింత మంచి సేవలను అందించడానికి మాకు వచ్చిన అవకాశం పట్ల గర్విస్తున్నాము. ఆ యాప్‌లో మరిన్ని సురక్షితమైన ఫీచర్లను తీసుకొస్తాం అని ఇటీవల టిక్‌టాక్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఆనందకర క్షణాల్లో టిక్‌టాక్‌ మరో బంపరాఫర్ ను తీసుకువచ్చింది. యూజర్లు లక్షరూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎలాగో చూద్దాం.

అత్య‌ధికంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌ల‌లో మొద‌టి స్థానం

అత్య‌ధికంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌ల‌లో మొద‌టి స్థానం

ఇప్పుడు టిక్‌టాక్ యాప్ మ‌ళ్లీ ఆయా యాప్ స్టోర్స్‌లో అత్య‌ధికంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌ల‌లో మొద‌టి స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలోనే టిక్‌టాక్ త‌న యూజ‌ర్ల‌కు ఒక గొప్ప అవ‌కాశాన్ని అందిస్తున్న‌ది. అందులో యూజర్లు రోజూ రూ.1ల‌క్ష గెలుచుకునే అవ‌కాశం క‌ల్పించారు.

#ReturnofTikTok

#ReturnofTikTok

టిక్‌టాక్ యూజ‌ర్లు #ReturnofTikTok పేరిట టిక్‌టాక్ మైక్రోసైట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయాలి. దీంతో అలా షేర్ చేసిన యూజ‌ర్ల‌లోంచి ముగ్గురు ల‌క్కీ విన్న‌ర్ల‌ను టిక్‌టాక్ ఎంపిక చేస్తుంది. వారికి రూ.1 లక్ష న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేస్తారు.

ప్ర‌మోష‌న్ కోసం
 

ప్ర‌మోష‌న్ కోసం

దీనికి కారణం లేకపోలేదు. తమ యాప్ కొద్ది రోజుల పాటు బ్యాన్ అయినందునే యాప్ ప్ర‌మోష‌న్ కోసం ఇలా ఓ కాంటెస్ట్‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని టిక్‌టాక్ తెలియ‌జేసింది. బ్యాన్ అయిన తరువాత కొద్దికాలంలో భారత్‌లో తగ్గిన టిక్‌టాక్ యూజర్లను పెంచుకునేందుకు బైట్ డ్యాన్స్ కంపెనీ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది.
అందులో భాగంగా మే 16వ తేదీ వరకు టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే యూజర్లలో రోజుకు ముగ్గురికి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. కాగా.. ఆ మధ్య టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడం వల్ల బైట్ డ్యాన్స్‌కు రోజుకు రూ.3.48 కోట్ల నష్టం వచ్చింది.

రోజుకు కోట్ల నష్టం

రోజుకు కోట్ల నష్టం

ఇండియాలో టిక్‌టాక్‌ బ్యాన్ కావడంతో తమకు రోజుకు కోట్ల నష్టం వాటిల్లుతోందని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ తెలిపిన సంగతి అందరికీ విదితమే. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌ను బిలియన్‌కు పైగా వినియోగిస్తున్నారు. మన దేశంలో అయితే ఏకంగా 300 మిలియన్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్ యాప్ ద్వారా పోర్నోగ్రఫీ ఎక్కువవుతోందని మద్రాస్ కోర్డు ఇటీవలే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ యాప్స్ నుంచి తొలగించేశాయి.

మదురైకి చెందిన ముత్తుకుమార్‌ అనే న్యాయవాది

మదురైకి చెందిన ముత్తుకుమార్‌ అనే న్యాయవాది

ఈ యాప్‌ యువతను తప్పుదారి పట్టిస్తోందని, పలువురు ఆత్మహత్య చేసుకున్నారని తెలుపుతూ మదురైకి చెందిన ముత్తుకుమార్‌ అనే న్యాయవాది గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో దీన్ని నిషేధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ టిక్‌టాక్‌ ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. మదురై ధర్మాసనం.. ఈ యాప్‌‌పై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేయడంతో ఇటీవల ఇది అమలైంది. వారం రోజుల క్రితం మళ్లీ అదే న్యాయస్థానం నిషేధాన్ని ఎత్తేసినట్టు ప్రకటించింది.

Best Mobiles in India

English summary
TikTok users can win Rs 1 lakh cash prize: Here's how

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X