భారత్‌లో పుంజుకున్న యాపిల్ ఐఫోన్ అమ్మకాలు!

Posted By:

భారత్‌లో పుంజుకున్న యాపిల్ ఐఫోన్ అమ్మకాలు!

భారత్ మార్కెట్లో గడిచిన ఏప్రిల్-జూన్ క్వార్టర్ కు సంబంధించి ఐఫోన్ అమ్మకాలు 400 శాతం మేర వృద్ధి సాధించినట్లు యాపిల్ సీఈఓ టిమ్ త్రైమాసిక అమ్మకపు ఫలితాల వెల్లడిలో భాగంగా తెలిపారు. ఇండియా సహా ఫిలిప్పిన్స్, టర్కీ, పోలాండ్ వంటి దేశాల్లో యాపిల్ అమ్మకాలు వృద్ధి చెందినట్లు కుక్ ఈసందర్భంగా వెల్లడించారు.

ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో యాపిల్ తమ ఉత్పత్తుల కొనుగోళ్ల పై బుయ్ బ్యాక్ స్కీమ్‌లతో పాటు ఈఎమ్ఐ సౌకర్యాలను కల్పించటం ద్వారాఐఫోన్5 ఇంకా ఐఫోన్4 అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు ఆయన వెల్లడించారు. అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలకు సంబంధించి బుయ్ బ్యాక్ స్కీమ్‌లను ప్రవేశపెట్టిన ఘనత తొలిగా యాపిల్‌కు దక్కుతుంది. ఈ విధానాన్ని ఇప్పుడు సామ్‌సంగ్, బ్లాక్‌బెర్రీ, సోనీ వంటి కంపెనీలు అనుసరిస్తున్నాయి.

భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు దారుణంగా పడిపోయిటనట్లు వారం క్రిందటే వార్తలు వినిపించాయి. 2012 అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో 230,000 ఐఫోన్‌లను విక్రయించగలగిన యాపిల్ జనవరి - మార్చి త్రైమాసికంలో కేవలం 120,000 ఐఫోన్‌లను మాత్రమే అమ్మగలిగిందని సదరు నివేదికు పేర్కొన్నాయి.

అయితే, కొత్త విధానాలకు శ్రీకారం చుట్టిన యాపిల్ ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో అమ్మకాల పరంగా భారీగా పంజుకుంది. గడిచిన త్రైమాసికంలో యాపిల్ మొత్తంగా 31.2 మిలియన్ల ఐఫోన్‌లను విక్రయించినట్లు తెలుస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting