కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా, డెబిట్ కార్డుకు కాలం చెల్లింది

By Gizbot Bureau
|

టెక్నాలజీ అమిత వేగంతో ముందుకు దూసుకువెళుతోంది. కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి ప్రధాన కారణం సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడటమే.ఈ నేపథ్యంలోనే ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. హ్యాకర్లు ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ పరిస్థితు నుంచి బయటపడేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం SBI వినూత్నంగా ఆలోచన చేసింది.

Time to surrender SBI ATM card? What State Bank of India customers should know

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ యోనో కార్డు ద్వారా యోనో యాప్ సహాయంతో పరిమిత నగదు ఉపసంహరణ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఇది ఇష్టం లేని వారు నేరుగా ఏటీఎం కార్డు ద్వారా కూడా డ్రా చేసుకోవచ్చు.

ఏటీఎం కార్డును సరెండర్ చేయాలా..

ఏటీఎం కార్డును సరెండర్ చేయాలా..

ఏటీఎం కార్డు లేకుండానే విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఏటీఎం కార్డును సరెండర్ చేయాలా, కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తవచ్చు. ఎస్బీఐ క్యాష్ విత్ డ్రా కోసం సెక్యూర్డ్ సౌకర్యం కల్పిస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ యోనో యాప్ ద్వారా నగదు ఉపసంహరణ పరిమితంగా ఉంటుంది. మీరు యోనో యాప్ ప్లాట్ ఫాం ద్వారానే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా కావాలనుకుంటే సెలెక్టెట్ ఏటీఎంల వద్ద (యోనో క్యాష్ పాయింట్ -YCP) వద్ద మాత్రమే నగదును కలెక్ట్ చేసుకోగలరు. అందులోను కస్టమర్ వెళ్లిన ఎస్బీఐ ఏటీఎంలలో కూడా యోనో క్యాష్ ఫంక్షన్ తప్పనిసరి అని ఎస్బీఐ తెలిపింది.

ఏటీఎం కార్డు అప్పగింత మీ ఇష్టం

ఏటీఎం కార్డు అప్పగింత మీ ఇష్టం

ఈ రకమైన లావాదేవీల్లో ఏటీఎం కార్డును తప్పనిసరిగా బ్యాంకుకి ఇవ్వాలా అనే సందేహం ప్రతి ఒక్కరికీ రావచ్చు. అయితే ఏటీఎం కార్డుల వినియోగం అనేది కస్టమర్ ఇష్టానికే బ్యాంకు వదిలేసింది. వినియోగదారుడు తన వ్యక్తిగత అభీష్టం మేరకే ఏటీఎం కార్డును అప్పగించవచ్చనని తెలిపింది. ఇదిలా ఉంటే ఏటీఎం కార్డును కేవలం డబ్బులు విత్ డ్రా చేయడానికి మాత్రమే ఉపయోగించడం లేదు. ఆన్‌లైన్ పేమెంట్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు వినియోగిస్తున్నాం.

 యోనో ప్లాట్ ఫాం ద్వారా క్యాష్ విత్ డ్రా ఎలా చేయాలి?
 

యోనో ప్లాట్ ఫాం ద్వారా క్యాష్ విత్ డ్రా ఎలా చేయాలి?

ముందుగా యోనో యాప్/పోర్టల్‌లోకి లాగిన్ అవండి. అక్కడ కనిపించే యోనో క్యాష్ ఆఫ్షన్ ఎంచుకోండి. తర్వాత క్విక్ లింక్స్ YONO Payలో YONO Cash ఎంచుకోండి. అప్పుడు మీకు యోనో క్యాష్ లాండింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే Nearest YONO cash Points క్లిక్ చేయండి. తద్వారా మీరు దగ్గరలోని మీ యోనో క్యాష్ పాయింట్స్‌ను తెలుసుకోవచ్చు.

Request YONO Cash

Request YONO Cash

ఇప్పుడు క్యాష్ విత్ డ్రా కోసం Request YONO Cash ను సెలక్ట్ చేసుకోండి. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మొదట మీ బ్యాంకు అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఎంత విత్ డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఓ ట్రాన్సాక్షన్‌కు రూ.10,000, రోజుకు గరిష్టంగా రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

 యోనో క్యాష్ పిన్ క్రియేట్

యోనో క్యాష్ పిన్ క్రియేట్

ఏటీఎంను డెలివరీ చానల్‌గా సెలక్ట్ చేసుకోండి. తర్వాత పేజీలో యోనో క్యాష్ పిన్ క్రియేట్ చేయండి. మీ డివైజ్ పైన మాత్రమే పిన్ నెంబర్ కనిపిస్తుంది. మళ్లీ ఓ సారి మీ ట్రాన్సాక్షన్స్ వివరాలను సమీక్షించుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించిన తర్వాత Confirm బటన్ పైన క్లిక్ చేయండి.

యోనో క్యాష్ పాయింట్‌

యోనో క్యాష్ పాయింట్‌

ఇప్పుడ మీకు దగ్గర్లోని యోనో క్యాష్ పాయింట్‌ను క్లిక్ చేయడం ద్వారా క్యాష్ విత్ డ్రా కోసం మీకు దగ్గరలోని యోనో క్యాష్ పాయింట్‌ను సెర్చ్ చేయండి. అక్కడ కనిపించే యోనో క్యాష్ పాయింటును సెలక్ట్ చేసుకోండి. ఆ సెంటర్ కి వెళ్లి యోనో క్యాష్ ఫంక్షన్ కలిగిన ఎస్బీఐ ఏటీఎం నుంచి మీకు వచ్చిన పిన్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Time to surrender SBI ATM card? What State Bank of India customers should know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X