డేటింగ్ యాప్ టిండర్ నుంచి కొత్త ఫీచర్, వారికోసమే

By Gizbot Bureau
|

మనసైన వారు దొరికేంత వరకూ అన్వేషించడానికి ఇప్పుడు మార్కెట్లో బోల్డన్ని యాప్స్‌ ఉన్నాయి. అందుకే కొంత మంది యువత డేటింగ్‌ కోసం షార్ట్‌కట్స్‌ కోరుకుంటున్నారు . ఇలాంటి వారికి 'టిండర్‌’ అనే యాప్‌ హాట్‌ ఫేవరేట్‌ గా మార్కెట్లో ఉంది. ఎప్పటికప్పడు యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తూ ఈ యాప్ మార్కెట్లో దూసుకుపోతోంది.

tinder launches new safety feature for lgbtq users

ఈ గ్లోబల్ ఆన్ లైన్ డేటింగ్ యాప్ టిండర్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. LGBTQ కమ్యూనిటీ యూజర్ల కోసం ప్రత్యేకించి New Saftey ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

LGBTQ స్టేటస్

LGBTQ స్టేటస్

ఎల్జీబిటీక్యూ కమ్యూనిటీ యూజర్లకు రక్షణ కల్పించడంలో భాగంగా టిండర్ ఈ కొత్త ఫీచర్ రూపొందించింది. LGBTQ స్టేటస్ మోసపూరితంగా మారిన తరుణంలో సుమారు 70 దేశాల్లోని LGBTQ యూజర్లకు రక్షణగా టిండర్ ఈ కొత్త ఫీచర్ ద్వారా చర్యలు చేపట్టింది. వారికోసం ‘Traveler Alert' పేరుతో ఇన్ యాప్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ట్రావెలర్ అలర్ట్ ఫీచర్

ట్రావెలర్ అలర్ట్ ఫీచర్

Tinder డేటింగ్ యాప్ ఓపెన్ చేయగానే LGBTQ యూజర్లు ట్రావెల్ చేసే దేశాల్లో వారికి హాని కలిగించే ప్రమాదాలకు ముందుగానే ట్రావెలర్ అలర్ట్ ఫీచర్ వార్నింగ్ ఇస్తుంది. ఒకసారి ఈ అలర్ట్ యాక్టివేట్ కాగానే ఇలాంటి దేశాల్లో టిండర్‌లో LGBTQ ఐడెంటిటీ ఆటోమాటిక్‌గా కనిపించదు. యూజర్లు తాము ఉన్న ప్రాంతంలోని లొకేషన్‌లో ప్రొఫైల్ కనిపించకుండా ఉండేలా Hide చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.

 ప్రొఫైల్ పబ్లిక్‌గా మార్చుకునే సదుపాయం

ప్రొఫైల్ పబ్లిక్‌గా మార్చుకునే సదుపాయం

కొత్త వారితో కనెక్ట్ అయ్యేందుకు వీలుగా ప్రొఫైల్ పబ్లిక్‌గా మార్చుకునే సదుపాయం కూడా ఉంది. Traveler Alert ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. LGBTQ యూజర్లు తమకు ఎక్కడ ప్రమాదమని భావిస్తారో అక్కడే ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కాగా 2018 ఏడాది నుంచి టిండర్ డేటింగ్ యాప్ కంపెనీ LGBTQ కమ్యూనిటీ రక్షణ కోసం ఎప్పటికప్పుడూ కొత్త అప్ డేట్స్ అందిస్తూ వారికి సపోర్ట్ చేస్తూ వస్తోంది.

గతంలో మహిళల కోసం కొత్త ఫీచర్

గతంలో మహిళల కోసం కొత్త ఫీచర్

టిండర్ యాప్‌లో ఉన్న మహిళలు తమ వైపు నుంచి ఇతరులకు తొలి సందేశం పంపించాక మాత్రమే వారికి సందేశాలు వచ్చేలా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మహిళా యూజర్ చాటింగ్ కోరుకుంటే తప్ప పురుష యూజర్లు ఆమెకు సందేశం పంపించడానికి వీలు కాదు.

టిండర్ గురించి..

టిండర్ గురించి..

ఇది దొంగల కోసం అలాగే అబద్దాలు చెప్పేవారి కోసం అలాగే ఫన్నీగా బిహెవ్ చేసేవారి కోసం కాదు. ఇది నిజంగా మీకు తగ్గ భాగస్వామిని వెతుక్కునే సైట్. సో మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీ పార్టనర్ ని వెతుక్కోండి. నచ్చని పక్షంలో మీ అకౌంట్ ని డిలీట్ చేయండి.

Best Mobiles in India

English summary
tinder launches new safety feature for lgbtq users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X