పాత ఫోన్ కొనేముందు..?

By Sivanjaneyulu
|

సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. వీటిని విక్రయించేందు ప్రత్యేకమైన వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌లో కొలువు తీరి ఉన్నాయి. పాత స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయంలో కాస్తంత అవగాహన కలిగి ఆలోచనాత్మకంగా వ్యవహరించినట్లయితే డబ్బు ఆదా అవటంతో పాటు మన్నికైన ఫోన్ మీ చెంతకు చేరుతుంది. ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం..

 పాత ఫోన్ కొనేముందు..?

Read More : సెల్ఫీకెమెరాతో దుమ్మురేపుతున్న ఫోన్లు

OLX, Quikr వంటి మార్కెట్ పేస్‌లలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసేముందు సంబంధిత సెల్లర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకోబోయే సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ ఏ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది..?, మోడల్ ఏంటి..? తరువాతి వర్షన్ అప్‌డేట్‌లు అందుకునే అవకాశం ఉందా..? ర్యామ్ సామర్ధ్యం ఎంత..? ప్రాసెసర్ వేగం ఎంత..? వంటి వివరాలను ముందుగా ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే రివ్యూలు ద్వారా చెక్ చేసుకోండి.

 పాత ఫోన్ కొనేముందు..?

Read More : 5 మోటరోలా ఫోన్‌ల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

ఫేస్‌బుక్ ఆన్‌లైన్ అడ్డాగా మారిపోతోంది. ఈ సోషల్ మీడియా మాద్యమం ద్వారా రోజు అనేక డీల్స్ ఓకే అవుతున్నాయి. మీరు ఎంపిక చేసుకునే సెకండ్ హ్యాండ్ ఫోన్‌కు ఇక్కడ బోలెడన్ని యూజర్ రివ్యూలు దొరకుతాయి. అంతేకాదు, ఫోన్ గురించి సెల్లర్‌తో కూడా ఫేస్‌‍బుక్‌లో చాట్ చేయవచ్చు.

 పాత ఫోన్ కొనేముందు..?

సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు ఆ ఫోన్‌కు సంబంధించిన బిల్స్ ఇంకా యాక్సెసరీస్ ఇంకా ఐఎమ్ఈఐ నెంబర్ ఖచ్చితంగా ఉందోలేదో చెక్ చేసుకోండి. భవిష్యత్‌లో మీకు ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మీకు పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రియిస్తోన్న వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలను ఆరా తీయటం మంది. అతనికి మంచి రెప్యుటేషన్ ఉంటేనే డీల్ ఓకే చేయండి.

 పాత ఫోన్ కొనేముందు..?

మీరు ఎంపిక చేసుకునే పాత ఫోన్ కనీసం 2జీబి లేదా 1జీబి ర్యామ్‌ను కలిగి ఉంటే మంచిది. ప్రాసెసర్ విషయానికొస్తే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ మంచి ఆప్షన్.డిస్‌ప్లే, కెమెరా, కీప్యాడ్, చార్జింగ్ పోర్ట్, సిమ్ స్లాట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వంటి భాగాలు చురకుగా స్పందిస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫోన్ స్పీకర్స్ ఇంకా సౌండ్ క్వాలిటీని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి. సిమ్‌కార్డ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడండి.

 పాత ఫోన్ కొనేముందు..?

Read More : మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెంచుకోండిలా..?

ఫోన్ గ్యారంటీ గురించిన వివరాలను పక్కాగా తెలుసుకోండి. సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు గ్యారంటీ ఉండకపోవచ్చు. మీరు ఎంపిక కేసుకునే సెకండ్ హ్యాండ్ ఫోన్ బ్రాండెడ్ క్వాలిటీదై ఉంటే బాగుంటుంది. మీరు కొనదలుచుకున్న సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఇప్పుటికీ మార్కెట్లో లభ్యమవుతున్నట్లయితే ఆన్‌లైన్ మార్కెట్లో ఆ ఫోన్ అందుబాటుకి సంబంధించిన డీల్స్‌ను చెక్ చేసుకోండి. వాటిలో ఏదైనా డీల్ మీకు నచ్చినట్లయితే సెకండ్ హ్యాండ్ యానిట్‌కు బదలుగా కొత్త యూనిట్‌నే పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Tips Before Buying Second Hand Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X