ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనేముందు పాటించవల్సిన చిట్కాలు..?

|
ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనేముందు పాటించవల్సిన చిట్కాలు..?

ఈ పండుగ సీజన్‌లో భాగంలో అధిక ముగింపు ధరల్లో లభ్యమవుతున్న ఖరీదైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..?

 

స్ర్కీన్‌ సైజ్:

స్మార్ట్‌ఫోన్ ఎంపికలో భాగంగా స్ర్కీన్‌సైజ్ కీలక పాత్ర పోషిస్తుంది. 3 అంగుళాల నుంచి 5 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. ఇటీవల కాలంలో 6 అంగుళాల స్ర్కీన్ వేరింయట్‌ల‌లో స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవటం వల్ల ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత క్వాలిటీతో కూడుకుని ఉంటుంది.

సౌకర్యవంతమైన డిస్‌ప్లే:

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మన్నికదై ఉండాలి. సూపర్ ఆమోల్డ్ ప్లస్, క్లియర్ ఎల్‌సీడీ, యాపిల్ రెటీనా డిస్‌ప్లేతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవతున్నాయి. అలాగే, మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే ఇంకా పీపీఐ (పిక్సల్ పర్ ఇంచ్) వంటి ఫీచర్లకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించండి.

ప్రాసెసర్:

ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌కు గుండెకాయ లాంటిది. వేగవంతమైన ప్రాసెసర్ ఫోన్ పనితీరును మరింత మెరగుపరుస్తుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో 1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ లేదా క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి.

కెమెరా:

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ ఫోన్ లో కెమెరా వ్యవస్థ మరింత సమర్థవంతమైనదిగా ఉండాలి. ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ఫీచర్లను మీ స్మార్ట్ ఫోన్ కెమెరా సపోర్ట్ చేసేదిగా ఉండాలి. అలాగే ఫ్రంట్ కెమెరా ఫీచర్ క్వాలిటీ వీడియో కాలింగ్ కు సహకరించాలి.

శక్తివంతమైన బ్యాటరీ:

స్మార్ట్‌ఫోన్ సమగ్రంగా పనిచేయాలంటే శక్తి ఎంతో అవసరం. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.

కనెక్టువిటీ ఫీచర్లు:

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన కనెక్టువిటీ ఫీచర్లను కలిగి ఉండాలి. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు సమర్థవంతంగా ఉన్నప్పుడే వెబ్ బ్రౌజింగ్ వేగవంతంగా ఉంటుంది.

స్టోరేజ్:

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ బలోపేతమైన స్టోరేజ్ వ్యవస్థను కలిగి ఉండటం అవసరం. మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో లభ్యమవుతున్నాయి. నోకియా వంటి ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు కొన్ని సంవత్సరాల వాలిడిటీతో ఉచిత క్లౌడ్ స్టోరైజ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X